ఎంతెంత దూరం!

(మనలో మనమాట 34)

ఈ ఉదయం మిత్రులొకరు తమ ట్రాక్టరుమీద ప్రయాణంకథ చెప్పేక, నాకు ఈకథ రాయాలనిపించింది. లేదు, నేను ట్రాక్టరు ఎక్కలేదు. ఇది సైకిలురిక్షా కథ. అయితే అప్పటికే, 50వ దశకంలో సైకిలు రిక్షాలు విరివిగానే ఉన్నాయి. మనుషులు లాగే రిక్షాలు తగ్గుతున్నాయి.

ఆరోజుల్లో మేం గుంటూరుకి 16 మైళ్లదూరంలో ఉన్న చిన్నపల్లె ఎడ్లపాడులో ఉన్నాం. విద్యుత్‌భాగ్యం కూడా లేని పల్లె. మానాన్నగారు అక్కడ కొత్తగా ప్రారంభించిన కొత్తస్కూలికి హెడ్‌మాస్టరుగా బదిలీ కావడంతో. ఆరోజుల్లో అలా పల్లెల్లో పెట్టిన స్కూళ్లలో పిల్లలు అట్టేమంది ఉండేవారు కాదు. ఓ పదిమంది ఉంచే గొప్ప. అంచేత జిల్లా బోర్డువారు యస్సస్సెల్సీ పరీక్షలు, హైస్కూల్లో ఆఖరేడు, కొన్ని స్కూళ్ళకి ఒకే సెంటరులో పెట్టేవారు.

నేను ఆ పరీక్షకి సిద్ధం అయిననాటికి 4మైళ్ళ దూరంలో ఉన్న మరోపల్లెలో పెట్టేరు. పేరు జ్ఞాపకం లేదు, కొత్తపేటో ఏదో అలాటిదే. అంచేత నేను ఆ పరీక్షకోసం రోజూ ఆ పల్లెకి వెళ్ళి రాయాల్సివచ్చింది. మానాన్నగారు నాసౌకర్యార్థం గుంటూరునించి సైకిలు రిక్షా తెప్పించేరు. రిక్షా వచ్చింది కానీ దాన్ని నడపడానికి సారథి కావాలి కదా. స్కూలుప్యూను సైదులిని తీసుకెళ్లమన్నారు.

నేను రిక్షా ఎక్కేను రాజు వెడలె అన్నట్టు. రవితేజము లేదనుకోండి, ఇక్కడ అవుసరం లేదు కదా.

ఈపల్లెనించి ఆపల్లెకి పొలాలగట్లమ్మటే తప్ప మరో దారి లేదు. పొలాలగట్లంటే తెలుసు కదా, అవేం తార్రాడ్లు కావు. ఎగుడూ దిగుడూ. అప్పట్లో నాకూ మానాన్నగారికీ తెలీలేదు కానీ సైకిలురిక్షాకి మూడు చక్రాలున్నా తొక్కడానికి కొంత శిక్షణ అవుసరమే. పాపం సైదులు ప్రయత్నించేడు కానీ వల్ల కాలేదు. పొగరుమోతు గిత్తలా అతనోవేపుకి నడపబోతే ముందుచక్రం మరోవేపుకి లాగుతోందనుకుంటాను. అతను సీటుమీంచి దిగి నెమ్మదిగా లాక్కుంటూ తీసుకెళ్తున్నాడు. నాలుగడుగులు వేసేక, నాకు ఆరిక్షాలో కూర్చొడం నచ్చలేదు. రిక్షా ఆపమని చెప్పేసి, దిగి నడవడం మొదలు పెట్టేను. “బాబుగోరు అరుస్తారమ్మగోరూ,” అన్నాడు సైదులు.

నేను ఫరవాలేదులే అని చెప్పి నడవడం కొనసాగించేను. రెండోరోజు మాఅమ్మకి తెలిసి, రిక్షా ఇంట్లో వదిలేసి, సైదులుని నాకు తోడు పంపింది పొలాలమ్మట మరే ప్రమాదాలూ జరక్కుండా.

అలా నాలుగు రోజులు నాలుగు మైళ్లు నడిచి వెళ్ళి పరీక్ష రాసేను.

ఇక్కడ వెంటనే క్వాక్‌సైకాలజీ అన్వయించుకుని, “అయ్యో, కారు లేదా? చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారన్నమాట” అంటూ జాలి గీతాలు అవుసరం లేదండి. అదొక కష్టం అని నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా అనుకోడంలేదు.

ఆనాడు మొదలుపెట్టిన నడక ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాను. పట్టుమని నాలుగువందల గజాలదూరంలేని వీధిచివర దుకాణానికి వెళ్ళాలంటే ఎగిరి కారులోకి దూకేవారిని చూస్తేనే నాకు ఆశ్చర్యం.

000

(ఏప్రిల్ 21, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఎంతెంత దూరం!”

  1. మేమూ మా బడికి నడిచి వెళ్ళేవాళ్ళం. మైలున్నర +మైలున్నర. మా ఊరి బడే. అంత దూరాన పొలమున్నాయన బడి కోసం ఇస్తే కట్టారట. అక్కడ బడి వచ్చాక ఒక చిన్న పల్లె కూడా ఏర్పడింది. హైస్కూలు వచ్చాక పుట్టింది కాబట్టి హైస్కూలుకొట్టాల ఆ ఊరి పేరు. 🙂

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. అప్పటికీ,ఇప్పటికీ సాధ్యమైనంతవరకూ నడచి వెళ్ళడమే మంచిది.పల్లెటూళ్ళలో ఈ రోజుల్లో ట్రాక్టర్లలో తిరుగుతుంటారు.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.