భీమారావు కత – హత్యా? ఆత్మహత్యా?

చిన్న గుమాస్తా భీమారావు ఉద్యోగంలో చేరగానే ఓ ఇరుకువాటా వెతుక్కున్నాడు

వాటాకి భీమా తీసుకోమన్నారు. వరసగా తెలిసేయి తీసుకోవలసిన భీమాలు

అద్దెవాటాకి భీమా, అందులో గల కుంటిబల్లకీ, పాతకుర్చీకీ, నాలుగు బొచ్చెలకీ భీమా.

ఒళ్ళు భీమా, కళ్ళూ, పళ్ళూ భీమా, కళ్ళజోడు భీమా

Medicare ఇచ్చే హామీ చాలదని, మరో భీమా medigap

వీటన్నిటీకీ మందులకోసం మరో బీమా

బతుకుభీమా. అందుకు ఇంట్లో ఇటు రెండుతరాలు అటు రెండుతరాల ఆరోగ్య చరిత్రలు

ఉద్యోగం ఊడినవేళ ఆదుకోడానికి మరో భీమా

కారు భీమా, సైకిలు భీమా,

చచ్చేక అపరకర్మకి భీమా.

భీమాలకి కిస్తీలు కట్టుకోడానికి నోరు కట్టుకున్నాడు.

యథావిధిగా నిత్యం సంధ్యావందనం చేసినంత శ్రద్ధగా కిస్తీలు చెల్లించుకుంటూ పోయేడు.

భీమారావు భీమాకంపెనీలని పోషించడానికి ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ కిస్తీలు చెల్లించేక చేతిలో చిల్లిగవ్వ మిగలక, తిండి లేక మాడి, పోయేడు.

దేవుడా ఇంత చేసేవా అనుకుంటూ అసువులు బాసేడు.

భీమరావు భార్యామణి కళ్ళు తుడుచుకుని,

దేవుడు ఏం చేసేడో, ముందేమి చేస్తాడో, చేయగలడో విచారించుకుంది.

భీమాకంపెనీకి విన్నవించుకుంది తమకు రావలసిన సొమ్ము పంపమని.

భీమాకంపెనీ ఎంతో మర్యాదగా భీమారావు అకాలమరణానికి విచారం వెలిబుచ్చేరు.

వివరాలు కనుక్కున్నారు. భీమారావు భార్యామణి అప్పీలు తప్పక పరిశీలించి, సొమ్ము అందజేస్తామని హామీమీద హామీలు కురిపించేరు.

ఆర్నెల్లతరవాత కాయితమ్ముకొకటి పంపేరు భీమారావు భార్యామణికి. బాంకులో కాషు చేసుకోగల కాయితం కాదది.

తమకి రావలసిన సొమ్ము ఏమీ లేదు. పంపలేనందుకు విచారిస్తున్నామంటూ సమచారం తెలిపే కాయితం మాత్రమే అది.

భీమారావు స్వచ్ఛందంగా తినవలసిన తిండి మానేసేడు.

తినగలిగినవాడు తినకుండా ఊరుకోడంలో స్వకీయమైన నిర్ణయం ఉంది.

భీమారావు తినవలసిన, తినగలిగిన తిండి తెలిసి తెలిసి మానీసేడు.

భీమారావు తనచావు తానే కోరి తెచ్చుకున్నాడు.

అది ఆత్మహత్య. భీమారావు తీసుకున్న భీమాపథకం ఆత్మహత్యని కవరు చేయదు.

భీమారావుభార్యామణి బీమా సొమ్ముకు అర్హురాలు కాదు.

బామామణి నెత్తీ నోరూ కొట్టుకుని ఏడ్చింది.

తెచ్చకున్న నాలుగురాళ్ళూ వాళ్ళఎదాన కొట్టినందుకు వెక్కి వెక్కి ఏడ్చింది.

కడుప్మండింది. కోటి శాపనార్థాలు పెట్టింది.

మళ్లీ మళ్ళీ వాళ్ళ ఆఫీసుచుట్టూ తిరిగింది. కాళ్ళా వేళ్ళా పడి బతిమాలింది.

భీమావర్తకులు సరే చూస్తామంటూ కాయితాలు లాగేరు. కిందా మీదా తిరగేసేరు.

చిల్లులకోసం వెతికేరు. ఎంత వెతికినా ఒక్కటే కనిపిస్తోంది.

తినకపోవడం నేరం. తనకు తానై ఉపోషాలుండి చావు తెచ్చుకుంటే అది ఆత్మహత్య.

అందువలన భీమా సొమ్ము ఇవ్వబడదు, ఇవ్వగల వీలు ఏమాత్రమున్నూ లేదు.

000

భామామణి బాధ చూసి, మనసు కరగిన లాయరొకరు ఆమెతరఫున కేసు పెట్టేడు.

భామామణితరఫున గట్టిగా బల్లగుద్ది వాదించేడు, “కాదిది ఆత్మహత్య. అవునిది హత్య. మీరంతా కలిసి, భీమాలమీద భీమాలు కట్టించి ప్రాణం తీసేరు. మీరు హంతకులు. అతడు హతుడు”

000

కోర్టులో కేసు నడుస్తోంది.

గెలుపెవరిదో ఇంకా తేలలేదు.

ఆత్మహత్య అని కోర్టువారు నిర్ణయిస్తే భీమాకంపెనీకి లాభం.

హత్య అని అయితే భీమారావుభామామణిలాయరుకి లాభం.

భీమారావుకాయం గండుచీమలకాహారం.

000

(మే 10, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “భీమారావు కత – హత్యా? ఆత్మహత్యా?”

  1. మీరు ఈ కథని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే మన ఆంగ్ల సోదరులు కూడా ఆనందిస్తారు. పేరుకి భీమానే కానీ, రాను రాను నిజంగా అవసరం అయినపుడు నిరుపయోగంగా తయారవుతోంది.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.