“నేను ఉన్నాను” హృదయాన్ని తాకే కవితా, కవయిత్రి కథా.

Mary Elizabeth Frye (1905-2004) రచించిన ఈకవిత అనేకవిధాల ప్రత్యేకమైనదీ, విశిష్టత సంతరించుకున్నదీను. ఈ రచయిత్రి సామాన్యగృహిణి. అట్టే చదువుకోలేదు. ఆమె తొలికవిత ఇది.

————————

                       నేను ఉన్నాను.

 నాసమాధిప్రక్కన నిలిచి విలపించకు.
  
 నేనక్కడ లేను, నేను నిదురపోలేదు

నేనున్నాను వేనవేలై వీస్తున్న సమీరాలలో 

నేనున్నాను మంచులో స్ఫటికమణివలె దీపించు కాంతిపుంజాలలో.

 నేనున్నాను పైరులపై పరుచుకొన్న ప్రభాతకిరణాలలో.

 అలవోకగా కురుస్తున్న శరత్కాలపువానచినుకులలో.
 
 ప్రభాతసమయంలో నీవు కనులు తెరచినవేళ 

ప్రశాంతమై విహరించేపక్షిగణంతో నీలో మేల్కొను సంభ్రమాన్ని నేనే.  

నిర్ఝరనిశీధిలో చిరుతారకలమిణుకులలో ఉంది నాఉనికి.

నాసమాధిదగ్గర నిలబడి వ్యథ చెందకు.

నేను లేనక్కడ. నేను మరణించలేదు. 

---------------------

ఈకవిత రచించిన సందర్భం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతవరకూ ఏమీ రాయలేదు. ఛందస్సు పాటించలేదు. పదాలు వాటంతట అవే వచ్చేయిట.  ఇది రాసినతరవాత ప్రచురణకి పంపలేదు. తెలిసినవారికి చూపుతూ వచ్చేరు.

Northern Irelandలో యుద్ధంలో చనిపోయిన ఒక సైనికుడు చనిపోయినతరవాత అతనితండ్రి ఆ కుర్రవాడిసంచీలో కనిపించిన ఈకవితను BBC radioలో 1995లో చదివేరు. 1996లో BBC Bookwormవారు “అత్యంత ప్రాచుర్యం పొందినకవితలు” ఏవో చూడడంకోసం poll చేస్తే ఈ కవితకి 30,000 write in ఓట్లు వచ్చేయి.

అనేకవిధాల అనేకమంది ఈకవితని ఆదరించేరు. the Challenger space shuttle, the Lockerbie bombing, the 9-11 terror attack on New York’s twin towers సంస్మరణసభల్లో ఈకవిత గానం చేసేరు.

మరొక విశేషం. ఈకవిత ప్రచురించేక, రచయిత్రి కాపీరైటు హక్కులు తీసుకోలేదు. “ఇది నాది కాదు, యావత్‌ప్రపంచానికి చెందిన కవిత” అన్నారుట.

ఆ తరవాత కూడా కొన్ని రచనలు చేసేరు కానీ ఈకవితకి వచ్చిన ప్రాచుర్యం మరే రచనకీ రాలేదు. అయితేనేమి. అశేష ప్రజానీకాన్ని ఆకర్షించినకవిత ఒక్కటి చాలదా? గంగిగోవుపాలు గంటెడైనను … Mary Elizabeth Frye జన్మ ధన్యం.

000

మరో చిన్న సంగతి. అవుసరం లేదు కానీ కావలిస్తే చదువుకోండి. నేను ఆంద్రా యూనివర్సిటీలో ఇంగ్లిష్ ఆనర్స్ చదువుతున్నప్పుడు మేం చదివిన ఒక పుస్తకం నాకు చాలా ఇష్టంగా ఉండేది. రచయిత Christopher Fry అని జ్ఞాపకం కానీ పుస్తకం పేరు గుర్తు లేదు. Long poem అన్న ఉపశీర్షిక గుర్తు, Wastelandలాగే.

అందులో నన్ను ఎంతగానో ఆకట్టకున్న ఒక భావం – యావత్ ప్రపంచం సంఘటితమై ఉంది. ప్రపంచంలో ఏ ఒక్క అణువు కదిలినా, అది మిగతా అన్ని అణువులలోనూ చలనం కలిగిస్తుంది అని. ఆపుస్తకంకోసం వెతుకుతుంటే పైకవిత దొరికింది.

000

మూలకవిత –

DO NOT STAND AT MY GRAVE AND WEEP

Do not stand at my grave and weep
I am not there; I do not sleep.

I am a thousand winds that blow,

I am the diamond glints on snow,
I am the sun on ripened grain,

I am the gentle autumn rain.

When you awaken in the morning’s hush

I am the swift uplifting rush
Of quiet birds in circling flight.

I am the soft star-shine at night.
Do not stand at my grave and cry,
I am not there; I did not die.

(మే 11, 2017)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on ““నేను ఉన్నాను” హృదయాన్ని తాకే కవితా, కవయిత్రి కథా.”

 1. బాగున్నాయి రెండు తెలుగురూపాలు. భావం బాగుంది కనక. ఆ ఏకాత్మ భావాన్ని నిజంగా అనుభవించగలిగినారు కాబట్టే కాపీహక్కులనలేదు మరి.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. మీ అనువాద కవిత చాలా బాగుంది.చిత్రమేమంటే ,ఈ కవితనే నేను అనువదించి నా ‘రమణీయం ‘ అన కవితా సంపుటి లో ప్రచురించాను.నా కవితను కూడా అవధరించండి.

  శీర్షిక; నన్ను గూర్చి.
  —————————
  నా సమాధి కడ నిల్చి
  నను గూర్చి విలపింపబోకు.
  నేనట నిదురించలేదు,నన్నట కనబోవు నీవు.
  ఉషహ్కాల తుషార కణమును
  ఉదయశీతల పవనవీచిని .
  పండిన చేలపై సందెవెలుగును .
  మండువేసవిని తొలకరి చినుకును
  మగతనిద్దుర లేచి నీవు చూచే వేళ
  ఎగురుచున్న విహంగ కూజితము నేను.
  నిబిడ నిశీధి తారాకాంతి నైపోతి.
  నా సమాధికడ నిలిచి ,ననుగూర్చి విలపింపబోకు

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.