ఘనీభవించిన క్షణం A Moment of Moods

 

 

ఈ కవిత నేను మొదట ఇంగ్లీషులో రాసేను. ఆదరణ ఫరవాలేదు. బాగానే వచ్చింది.

ఇక్కడ ఇంగ్లీషు కవితతోబాటు తెలుగు అనువాదం కూడా ఇస్తున్నాను.

రచయితే రెండు భాషలలో రాసినప్పుడు ఉండగల వ్యత్యాసానికి ఇదొక మచ్చు అనుకోవచ్చు.

***

ఘనీభవించిన క్షణం

హుందాతనం ఉట్టిపడుతూ జగన్మాతలా నిలిచిందొక కలువ

తామరాకుమాటున చేరి గతం నెమరేసుకుంటోందొక బాతు

స్ఫటికలాటి ఆకాశం మురికినీటిలో ప్రతిబింబించింది

రానున్నశిశిరానికి సూచనగా వెలవెలబోతోంది మరొక ఆకు అర్థమనస్కంగా

నిరంతరంగా సాగుతున్న కాలగతిలో ఘనీభవించిన క్షణమది.

****

A MOMENT OF MOODS

The last lotus

standing tall

A lone duck

reminiscing the past

Muddled waters

reflecting the clear skies

Green leaves reluctantly

submitting to the next season

A moment of moods

frozen in time!

***
— Nidadavolu Malathi

(జూన్ 2, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

14 thoughts on “ఘనీభవించిన క్షణం A Moment of Moods”

 1. మీ అభిప్రాయం చక్కగా ఉందండి. ఆంగ్లంలో lotus రెంటికీ వాటవచ్చు తారమకీ, కలువకీ కూడా. లువని water lily అని కూడా అంటారు. మీరడిగేవరకూ నాకు తోచలేదు కానీ కలువ అని అనడంలో తప్పు లేదు. 🙂
  హిందీలోకి అనువదించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా చేయవచ్చు. ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ ! నేను కూడా ముక్కస్య ముక్క అనువాదాన్ని అంతగా ఇష్ట పడ ను ,అనివార్యం అయితే తప్ప .మీ ఇంగ్లీష్ కవిత బహుశా ముందు రాయటం వలన మీ భావాలను ఎక్కువ ప్రతిబిమ్బించిందేమో ! అని నేను అనుకున్నాను అంతే!.కలువ -కమలం రెండిటికీ లోటస్ అనే కదా .తామరాకు ప్రయోగం మనకు ప్రసిద్ధమే ..వీటికి ఆంగ్ల ప్రయోగాలు వేరు -వేరుగా ఉన్నాయా ? భావ ప్రకటన సందర్భం లో ఎవరి భాష కి తగినట్లు వారికి చేరవెయ్యటమే ముఖ్యం అన్నది అనువాదం లో సూత్రం అది అందరికీ తెలుసు .ఇక్కడ మీ రెండు భావ వ్యక్తీకరణ లలో ఆంగ్లం మరింత బాగుంది .విడిగా దేని అందం దానిదే అని మాత్రమె నా అభిప్రాయం .
  మీ ఈ కవితను నేను హిందీ లో అనువదిస్తే మీకు అభ్యంతరం లేదంటే పంపిస్తాను ….డా.సుమన్ లత

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. భావం అనువాదంలో రావడమే ముఖ్యం అన్నది నిజమే. చాలామంది ముక్కస్య ముక్క అనువాదం సరిగా లేదంటారు కానీ నిజానికి అది సాధ్యం కాదు కదా మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. తెలుగు కన్నా ఆంగ్లం మెరుగ్గా ఉంది అనిపించింది…పదాలు మారినా భావం మారకుండా ఉంటే అనువాదం సరిగ్గా కుదిరినట్టు అనుకుంటాను నా మటుక్కి నేను.

  మెచ్చుకోండి

 5. అవును సుమ లతగారూ. ఈ అనువాదంలో నేను ఎత్తి చూపదలుచుకున్నది అది ఒక కోణం. ప్రధానంగా అనువాదాల్లో మనం ఏ సంస్కృతివారికోసం చేస్తున్నామో వారి సంస్కృతిలో విశేషాలు అనుగుణమయితే వాడుకుంటాం అని. రుబాయత్ కి వివిధకవులు చేసిన అనువాదాలు చూస్తే అదే కనిపిస్తోంది కదా. ప్రతిపదార్థం కంటె భావం ప్రసరించగలగాలి అనువాదం.
  మీరు హిందీ, తెలుగు భాషల్లో రాయడం ముదావహం. అభినందనలు

  చిన్న సందేహం. మీరు రమణారావుగారితో ఏకీభవిస్తున్నానన్నారు రమణారావుగారు ఒక పదానికి అర్థంగురించి ప్రస్తావించేరు. కానీ అనువాదంలో అటువంటిమార్పులు లెక్కలోకి రావని నాఅబిప్రాయం. ఈవిషయంలో మీ అభిప్రాయం మరొకసారి చెప్పగలరా?

  మెచ్చుకోండి

 6. మాలతి గారికి ,అన్యగామి గారి ,ఎం వీ రమణ రావు గారి అభిప్రాయమే నాది కూడా !నేను కూడా హిందీ ,తెలుగు భాషల లో ఇలాగే ఒక భావాన్ని తీసుకుని వ్రాస్తూ ఉంటాను ,ఇలాగె స్వతంత్రిస్తూ ఉంటాను కూడా !తెలుగు లో మీరు జగన్మాత హుందాతనాన్ని ప్రవేశ పెట్టటం కూడా ఒక కారణమేమో అనిపించింది .సుమన్ లత

  మెచ్చుకోండి

 7. నిజమే. కాదు. రెండూ నావే కనక స్వతంత్రింతేననుకుంటాను.
  అలంకారవిశేషాలు అన్న నాటపాలో చర్చించేను అనువాదాలలో గల మార్పులగురించి అక్కడ ఉమర్ ఖయాం రుబాయిత్ కి వేరు వేరు కవులు ఎలా మార్చేరో చూడగలరు. మీసౌకర్యార్తం లింకు http://wp.me/p9pVQ-1As
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.