పాతకథలు మళ్లి ఎందుకంటే

నిన్న నాకు పునర్జన్మ ఎత్తినంత ఆనందంగా గడిచింది. మిత్రులకు నామనఃపూర్వక ధన్యవాదాలు.

నేను ప్రచురిస్తున్న నావెనకటి కథలకి ఇంత ఆదరణ రావడం విశేషమే. ముఖ్యంగా ఒక అంశంతీసుకుని వచ్చిన వ్యాఖలు నాకు అరుదు.

కొందరికి ఇవి చదివేసిన కథలు, కొందరికి కొత్త. ఈనాటి అంతర్జాలంలో సౌలభ్యంమూలంగా నాపేరు చాలామందికి తెలుసు కానీ నేను ఏం రాసేనో అట్టేమందికి తెలిసినట్టు లేదు. అంచేత కూడా కొన్ని కథలు మళ్లీ ప్రచురించడం తప్పు కాదనే అనిపిస్తోంది.

నాకు తెలిసిందేమిటంటే, పునర్ముద్రణ అవుసరమే అని. ఇంతకుముందు చదివినవారు కాక కొత్తగా చదవడం మొదలు పెట్టినవాళ్లు కూడా చదివి ఆనందిస్తున్నారు. అంటే ఈకథలకి కాలదోషం పట్టలేదని కూడా అనిపిస్తోంది.  అంచేత మరొ కథ కూడా ఈరోజు పెడుతున్నాను. నేను బాగా రాసేననుుకుంటున్న కథల్లో ఇదొకటి.

రెండోది – ఇలా నాపాతకథలు తీసి చూసుకోడంలో నాకు ఆనాడు తోచని కోణాలు తోస్తున్నాయి. ఉదాహరణకి, అప్పట్లో అనుకోలేదు కానీ నేను ఉత్తమపురుషలో రాసినకథలు ఎక్కువగానే ఉన్నాయి

సాధారణంగా కథ ప్రథమపురుషలో రాసినప్పుడు, కథకుడు సర్వాంతర్యామి. ప్రతిపాత్రలో మనసులో మాట గ్రహించగలడు. ఉత్తమపురుషులో రాసినప్పుడు అలా కాదు.  మనకి తారసపడిన వ్యక్తులని వారి మాటలనిబట్టి, ప్రవర్తననిబట్టి వారి వ్యక్తిత్వాలగురించి ఒక అభిప్రాయానికి వస్తాం కానీ నిజంగా వారివ్యక్తిత్వం తలీదు.

కథ ఉత్తమపురుషలో చెప్పినప్పుడు అదే జరుగుతుంది. కథకుడికోణంలోనే ఇతరపాత్రలను అర్థం చేసుకోడం జరుగుతుంది. అంటే నిత్యజీవితంలో నాకు అర్థం కాని మనుషులగురించి కథల్లో అలాగే చిత్రించేను అనిపిస్తోంది.

నిన్నటి కథ – ఫలరసాదుల గురియవే -లాటిదే ఈ కథ జీవనమాధుర్యం కూడా. మనం ఇతరులని అంచనా వేయడంలో మన పొరపాటు ఎంత దూరమో చూపుతుంది.

మీ అభిప్రాయాలు కథమీద వ్రాయగలరని ఆశిస్తున్నాను.

(జూన్ 27, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s