ఊకదంపుడు …

కాలు విరిగిందా?

ఫరవాలేదులే. అదే నయమవుతుంది.

దెబ్బ తగిలిందా?

ఎందుకు తగిలించుకున్నావూ, బుద్ధి లేదూ?

డబ్బుకి కటకట ఇయిపోతోంది.
కష్టాలు మనుషులకి కాక మానులకొస్తాయా, ఫరవాలేదులే అదే సర్దుకుంటుంది.

డాక్టరుగారిచ్చిన మందులు తిని తిని అవి లేకుండా బతకలేని పరిస్థితి అయిపోయింది.

చిన్నతనంలో వద్దు అని చెప్పేస్తే సరిపోను కదా.

మాయవ్వ పోనాదమ్మా, పనికి రానాఁకవదు.

మనుషులు పోకేం చేస్తారు, పన్లు మానుకుంటామా?

ఎండ మండిపోతన్నది బాబూ,

ఏసీగదిలో కూచోరా. ఎండ తెలీదు.

చిలక్కి చెప్పినట్టు చెప్తున్నా తెలుగు నేర్చుకోరా అని, మనఅబ్బాయి వినడం లేదు.

You’re the mother. Just make him listen.

తెలిసింది కదా ఊకదంపుడు ఉపన్యాసాలంటే.

000

(ఆగస్ట్ 11, 2017)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊకదంపుడు …”

  1. అయ్యో. కష్టమే. నాకు తెలీక అడుగుతున్నాను. మిమ్మల్ని ఎవరు బలవంతం చేసేరండీ చదవమని. పైగా అంత డబ్బు పోసి కొన్నాను అని విచారించడానికి కూడా లేదు కదా.

    మెచ్చుకోండి

  2. >> తెలిసింది కదా ఊకదంపుడు ఉపన్యాసాలంటే

    ఇంతకు ముందు అంత బాగ తెలియదు కాని ఇప్పుడు ఈ బ్లాగులొ రాసినదే మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉంటే చదివిందే చదువుతూంటే తెలిసి వస్తోంది లెండి.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s