ఒక ముఖ్య ప్రకటన

ఈరోజు “ఊకదంపుడు” టపాకింద “Meyilu” (దొంగపేరు అని తెలుస్తూనే ఉంది) వ్యాఖ్య చూడకపోతే చూడండి. ఇది రెండోసారి  ఇలాటి వ్యాఖ్య రావడం. బహుశా ఈ వ్యక్తే మరో దొంగపేరుతో రాసి ఉండవచ్చు. నాకు కొంత అయోమయం కూడా అయింది అప్పుడు కూడా. నేను పునఃప్రచురించిన ఫలరసాదుల గురియవే కథ తాను నాలుగైదు సార్లు చదివేననీ, మళ్ళీ ఎందుకు ప్రచురించేరనీ అడిగేరు. నేను నాలుగైదు సార్లు ప్రచురించలేదు. రెండోది నేను ప్రచురించినా ఎందుకు చదవడం? తనకే ఇష్టమై చదివితే, నన్నెందుకు తప్పు పట్టడం? ప్చ్.  అయోమయంగా లేదూ. మరింత ఆశ్చర్యం – కొత్తవి ప్రచురించినప్పుడు చదివేం అని చెప్పలేరు కానీ పాతవి పెట్టినందుకు చిరాకు ప్రదర్శిస్తున్నారు.

అలాటి అనామక పాఠకులకు, ఇంకా ఎవరికైనా అలాటి సందేహం ఉంటే వారికీ పదే పదే చెప్పవలసిన అవుసరం లేకుండా, ఈ టపా-

ఇది నా బ్లాగు. నాకు ఏది సమంజసం అని తోస్తే అది పోస్టు చేస్తాను. ఈటపాలు ఎవరు చదువుతున్నారో నాకు తెలీదు. “మీరు చదవాలి, చదివితీరాలి, చదివి మీ అబిప్రాయాలు చెప్పండి “అంటూ నేను మందపత్రాలు (mass mailing)  పంపడం లేదు. ఎవరు గానీ నాకు ప్రత్యేకంగా ఇచ్చుకుంటున్న ప్రతిఫలం కూడా ఏమీ లేదు కదా.

అసలు ఈ మెయిలుగారెవరో నాకు తెలీదు. ఆపేరు దొంగపేరు కనక ఆడో మగో కూడా తెలీదు. వారు చదువుతున్నారని తెలీదు.  అలాగే ఇప్పుడు చదవడం మానేస్తే కూడా నాకు తెలీదు.

నేను ఎవరికీ ఎలాటి వాగ్దానాలు చేయలేదు. కొన్ని పాతకథలు ఎందుకు మళ్ళీ పెడుతున్నానో ఒకసారి మర్యాదకి చెప్పేను. మళ్లీ చెప్పను. అలాటి వ్యాఖ్యలు అంగీకరించను.

నిజానికి పూర్వం చదవని కొత్త పాఠకులు మంచి అభిప్రాయాలు కూడా వెలిబుచ్చేరు. ముఖ్యంగా ఫేస్బుక్కులో మంచి చర్చలే జరిగేయి, ఈ కథలకి కలగనిగౌరవం ఇది.

చదువుతున్నవారికి, మళ్ళీ ప్రచురించినవి చదివి ఆనందిస్తున్నవారికి, ఇంకా కొన్ని కథలు ప్రచురించమని అడుగుతున్నవారికీ మనఃపూర్వక ధన్యవాదాలు.

నిడదవోలు మాలతి

ఆగస్ట్ 11, 2017

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఒక ముఖ్య ప్రకటన”

 1. వివరించేను కదా. పాఠకులు ఉన్నారనుకున్నప్పుడు పోస్టు చేస్తాను తెలీకుండా ఎలా అవుతుంది. ఇతర వివరాలు ఇస్తున్నాను కదా. కొత్తవాళ్ళు అనేకమంది చదువుతున్నారు. మీరు ఆ టపాలకింద వ్యాఖ్యలు చూసేరా. నిజానికి నా గణాంకాలలో సంఖ్య పెరిగింది కూడా.
  ఇబ్బందేముంది. నేనయితే చదివినదే కనిపిస్తే వదిలేసి మరోకథకి పోతాను. అంతే కానీ మీరలా ప్రచురించకండి అని చెప్పను. ఈ బ్లాగు నా ఒక్కదానికోసమే కాదు అన్న స్పృహ నాకుంటుంది మరి.

  మెచ్చుకోండి

 2. నేను కూడా చాలా సార్లు చెపుదామనుకుని అశ్రద్ద చేసాను. మీ బ్లాగ్ లో పోస్టులు మళ్ళీ మళ్ళీ పోస్టు అవుతున్నాయి. ఇది మీకు తెలిసి జరిగి ఉండకపోవచ్చు, అజ్ఞాత ఈ విషయాన్ని మీకు కాస్త విసుగ్గా చెప్పి ఉండవచ్చు కానీ ఒకే పోస్టు మళ్ళీ మళ్ళీ రావడం మాత్రం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే !

  మెచ్చుకోండి

 3. సంతోషం రమణారావుగారూ. ఇప్పుడు కొత్త పాఠకులు అనేకులు రావడంచేత నేను మళ్ళీ ప్రచురిస్తే చదివి ఆనందిస్తున్నారు.గణాంకాలు చూస్తే కూడా అదే తెలుస్తోంది. మీ ఆదరాభిమానాలకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. చాలా ఏళ్ళక్రితం మీ కథలు పత్రికల్లో వస్తుండేవి.అందులో కొన్ని చదివేను.కాని జ్ఞాపకం లేవు .అప్పట్లో ఇంటెర్నెట్ ,కంప్యూటర్లూ ఏమీ లేవు.మీ కథలు మళ్ళీ నెట్లో రాస్తే తప్పేమీ లేదు.ఇష్టమున్న వాళ్ళు చదువుతారు.లేకపోతే లేదు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s