సంస్కారం అంటే?

ఇది నాకు కలిగిన సందేహం మాత్రమే. నేను జవాబు రాయడం లేదు. మీరు చెప్పండి, కథ అర్థం చేసుకునే సంస్కారం అంటే  ఏమిటి. మీదృష్టిలో  ఒక కథ అర్థం చేసుకోడానికి కావలసిన సంస్కారం ఎలా ఉంటుంది?

వేళాకోళాలు, హాస్యాలు వద్దు. సీరియస్ గా మీ అభిప్రాయాలు చెప్పమని కోరుతున్నాను. మరొకసారి హెచ్చరిక.  ఈ ప్రశ్న కథ అర్థం చేసుకోడంవరకే.  విస్తృతార్థంలో సంస్కారం చర్చ కాదు.

ధన్యవాదాలు.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “సంస్కారం అంటే?”

 1. అవును. కథ నచ్చలేదంటే అది కథకుడు లేదా కథకురాలిమీద వ్యాఖ్య కాదు. భారతం ఆనాటి భావజాలాన్ని ప్రతిఫలిస్తుంది అనే నేను అనుకుంటాను. ఆయన బుర్లలో ఇంతటి మంత్రాంగం – నాకు నచ్చింది.

  మెచ్చుకోండి

 2. కధ నచ్చలేదు అంటే కధకురాలి పట్ల సహృద్భావము లేనట్లు అని అనుకోరాదు. భారతం నాకు నచ్చినదంటే వ్యాసుడు నాకు నచ్చినట్లు కాదు. ఆయన బుర్రలో ఇంతటి మంత్రాంగం దాగి ఉన్నదే అని అశ్చర్యపడడం కూడా కావచ్చు.

  మెచ్చుకోండి

 3. 1) కథ వ్రాసిన (వ్రాయబడిన అంటే గతంలో చాలా ఏళ్ళ క్రితం జరిగిన విషయాలని జ్ఞాపకానికి తెచ్చుకుని వ్రాసిన ) కాలాన్ని,ఆ నాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయాలని దృష్టిలో ఉంచుకుని కథని చదవడానికి పూనుకోవాలి.
  2) కథల్లో నవరసాలలో దేనికో ఒక దానికి ప్రాధాన్యత ఉంటుంది. రచయిత కోణంలోనే పరకాయ ప్రవేశం చేసి అర్ధం చేసుకోమని ఎవరూ చెప్పరు. పాఠకులు తమ అభిరుచి మేరకే తమకున్న అవగాహన మేరకే కథని అర్ధం చేసుకుంటారు. అంటే పాఠకుల ఆలోచన, వికాస పరిధిని బట్టీ ఆ సూక్ష్మ గ్రాహ్యత లభిస్తుంది. ఉదాహరణకి ప్రపంచ పోకడలు తెలియని పల్లెటూరి పాఠకులకి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఉండాలి. వారికి ఎక్కువ సమాజ రీతికి అనుగుణంగానే కథలుండాలి అవే నచ్చుతాయి వారికి. అదే పల్లెటూరులో ఉన్నా ఎక్కువ చదువుకుని అనేక పుస్తకాలు చదివి, లేదా వివిధ దేశాలు పర్యటించడం వల్ల విస్తారమైన లోకజ్ఞానం ఉన్నవారికి వాస్తవ జీవితాల్లో ఉన్న సంక్లిష్టత తెలిసినవారికి కథ ఎలా ఉన్నా అర్ధంచేసుకోగలరు. కథా వస్తువు విభిన్నంగా ఉండి (సాంఘిక నియమాలని దాటి నైతిక విలువలు లోపించి,నీతి బాహ్యమైన పనులు చేసే పాత్రలున్న కథలు ) వ్యక్తి పరిధిని దాటి సమాజ (అనేక సమూహాల) పరిధి లోకి వెళ్ళినప్పుడు వ్యక్తి సంస్కారం (సహానుభూతి చెందడం ) ఆ కథని చదవడంలో తప్పక అవసరం అవుతుంది.
  జీవితాన్ని వాస్తవిక కోణంలో అర్ధం చేసుకుని యధాతదంగా తీసుకునే వారి అవగాహనకి, అవి లోపించిన వారికి ఉన్న తేడా కూడా సంస్కారమే అనుకుంటాను నేను.
  (ఉదాహరణ కి చలం గారి కథలు అందరికి నచ్చవు ఆకోణంలో ఆలోచించాలి ) (కొందరికి క్రైమ్,హార్రర్,శృంగార కథలు నచ్చవు ఆ కోణంలో ఆలోచించాలి )
  అని నేను భావిస్తున్నాను మాలతీ గారు . ఇది నా అభిప్రాయం మాత్రమే! అందరి అభిప్రాయం ఇలాగే ఉంటుందని నేను భావించడం లేదు.
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. ఒక పాత్రని చంపేయడం, బ్రతికించడం లేదా ధీరోదాత్తురాలిని చేయడం. ఒక కధలో మూడు ముగింపులు ఇవ్వలేము కాబట్టి నాకు నచ్చినదే నేను వ్రాస్తాను. అది నా సంస్కారాన్ని బట్టి అంటే …. నేను పెరిగిన వాతావరణం, నా చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు, ఆ రోజుకి నేను తీసుకున్న నిర్ణయం మరియు భవిష్యత్తు తరాలకి ఈ కధ ఎటువంటి సందేశాన్ని ఇవ్వగలదూ అని ఆలోచించి తీసుకునే నిర్ణయమే సంస్కారం. మొదట ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ఆలోచిస్తారు. తరువాత వాదనల ద్వారా నేర్చుకుని సంస్కారాన్ని మెరుగుపరుచుకోవడమో మరింత దిగజార్చుకోవడమో చేస్తారు. కధ అంటే ఊహించి వ్రాసేదే అయితే ముగింపు ఎలా అయినా ఇవ్వవచ్చు. జరిగినది జరిగినట్లు వ్రాసినకధే అయితే ముగింపు మార్చనవసరంలేదు. నా కధని నేను వ్రాస్తే ఒక రకంగా వ్రాసుకుంటాను. నా కధని వేరే వాళ్ళు వ్రాస్తే వాళ్ళు నాలా కాకుండా వారి సంస్కారాన్ని బట్టి వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి వారి భౌగోళిక పరిస్థితులను బట్టి వ్రాస్తారు. అదే వారి సంస్కారం. సంస్కారం అంటే కులాలు, మతాలు, ప్రదేశాలు, తల్లిదండ్రులు, పెరిగిన వాతావరణం, అప్పటి కాలమాన పరిస్థితులను గమనించుకుంటూ ఎవరికి వారు తమ తమ నిర్ణయాధికారాన్ని స్వేచ్చగా ప్రకటించుకోగలగడం.

  మెచ్చుకోండి

 5. కథ అర్థము చేసుకొను సంస్కారమనగా రచయిత(త్రి) వ్రాసిన కథనమును రాసిన వారి పరిధి లో అర్థము చేసుకుని వారి పట్ల సహృద్భావము కలిగి యుండుట

  ఇట్లు
  జిలేబి

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.