సృజన

రాయి రాయంటూ ఎనరో పోరితే పుట్టేది కాదు.

ఎందుకు రాయవని సతాయిస్తే పలికేది కాదు.

నిలువెత్తు ధనం పోస్తానన్నా వచ్చేది కాదు.

పురస్కారాలకూ పట్టుశాలువలకు మురిసి వెలిసేది కాదు.

ఒకానొకనాడు

తూగుటుయ్యెలలు అమరిస్తేనూ,

నవమోహనాంగులు కప్పురవిడెములందిస్తేనూ

కవితామతల్లి దర్శనమిచ్చిందేమో కానీ

ఈనాడు సృజన కవిహృదయాన్ని

కదలించేసంఘటనతో పొడతెంచు అపురూపపు దివ్వె.

ఉదయకిరణస్పర్శతో విచ్చుకున్న కమలంలాటిది.

గుండె తడి అయినప్పుడో గట్టిగా గుండెకి ఏదో కొట్తుకున్నప్పుడో

జనియించు ప్రత్యేక జీవకణం.

నాహృదయం మాత్రమే నిర్దేశించగల ఆత్మ ప్రభ!

000

(సెప్టెంబరు 20, 2017)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “సృజన”

  1. కాదనడంలేదు. ఆ సమయానికి రాసే మానసికస్థితి ఉండొచ్చు. కానీ రాయమన్నప్పుడల్లా రాయడం సాద్యం కాదనుకున్నాను. కనీసం నావిషయంలో అంతే. నువ్వు రాస్తే కాదనడానికి నేనెవరు :p

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.