నగరంలో కోలాహలం

నగరవీధులు పరిశుభ్రం చేసి కళ్లాపు చల్లి

రంగవల్లులు తీరిచి దిద్దుతున్నారు.

పచ్చతోరణాలు కట్టేరు

పట్టు తివాసీలు పరిచేరు

పురస్త్రీలు కప్పురపనీరాజనాలుు కుంకుమాక్షతులు సమకూర్చేరు

నవమోహనాంగి, జగన్మోహనాకారం

మేకప్పుల ఒప్పులకుప్ప

పడమటి యువరాణి వేంచేయుచున్నది

వేగిరపడుతూ రండు రండంటూ ఊరంతా కోలాహలం,

అయ్యో, ఎరుగరైతిరి భస్మాసురహస్తమని

పశ్చిమాద్రి వెలసిన వామనావతారమని.

కోహినూరు వజ్రానికి నీళ్లధార అప్పుడు

మొత్తం దేశానికే ముప్పు ఈపటాటోపం ఇప్పుడు.

అందుకే నా ఈ ప్రార్థన

దేవాదిదేవా! ఏ గుణపాఠం చెప్పడానికో ఈనాయకుని ప్రసాదించేవు.

ఇక నీవే గతి, కావు కావు కావమని నామొరలివే!

000

(నవంబరు 24, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.