మన తరుసంపద

శిశిరం ఏతెంచిన ఓ సుముహూర్తాన

పండుటాకులు రాల్చుకున్న మహావృక్షం

శిశిర వృక్షం

సంతానబాధ్యతలు తీరిపోయేక మిగిలిన ఓ పండుతల్లివదనంలో

కొలువైన అనుభవరేఖల్లా మనోజ్ఞంగా మురిపాలు కురిపిస్తుంది.

మరోవేపు

శాఖలుతెగిన చట్టు

నగర వృక్షసంరక్షణశాఖవారు ప్రసాదించిన

ప్లాస్టిక్ సర్జరీలతో  శాఖలు తెగిన ఓ బోడిచెట్టు

మహాభారతసంగ్రామంలో

కాళ్లూ చేతులూ తెగిన కళేబరంలా కనిపిస్తుంది.

నాప్రాణం ఉసూరుమంటుంది.

000

(మార్చి 11, 2018)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.