సరదాగానే

సరదాగానే

సరదాగా తమాషాకి, సావాసగాళ్ళతో

ఫొటోలు పంచుకుందమంటూ మొదలయింది.

ముసిముసినవ్వుల్లా విస్తరించింది.

మరింతమంది రంగంలోకి దూకేరు

పదులసంఖ్యలో, వందలలో, వేలలో, లక్షలలో

ప్రజలు స్పందించేరు

బొమ్మలకి మించి, ఊరూ పేరూ, ఆనవాళ్లూ

ఆశయాలూ, ధ్యేయాలూ, తమరి ఇతరవ్యాపకాలూ

పంచుకోడానికి పాకేయి సమాచారాలు.

దేశదేశాలకి పాకింది.

తొండ ముదిరి ఊసరవెల్లయింది.

సరదాలు ముదిరి పరదాలవెనక చాటుమాటు దెబ్బలు

చెట్టుచాటునించి వాలిని వధించినట్టే.

పాపం, జక్రనామధారి అభిమన్యునివలె

చిక్కుకొనెను పద్మవ్యూహంలో

సరదావ్యవహారం తోలుబొమ్మలాటయి
అంటుజాడ్యంగా కమ్ముకుంది.

000

(ఏప్రిల్ 11, 2018)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.