నేను ఉన్నాను, నాకు గలదొక బుర్ర!!

సంఘంలో పదిమందిచేత ఔననిపించుకోడానికి, నలుగురిమధ్యా తిరగాలి. నలుగురితో మంచిగా నడుచుకోవాలి. నలుగురిని కలుసుకు మాటాడాలి. ఇవన్నీ చేస్తేనే నాకూ ఉంది ఓ బుర్ర, దానిలో ఆలోచనలున్నాయి అనిపించుకోగలం. అప్పుడే మనం చేసినపనికి గుర్తింపు. ఆలా నలుగురూ గుర్తించినప్పుడే నేనూ ఉన్నాను అన్న సంతుష్టి కలిగేది.

అలాటి గుర్తింపు తెచ్చుకోడానికి కొన్ని విదానాలున్నాయి. వాటికే nnetworking అని పేరు. తెలుగుపేరుకోసం వెతికితే జాలాకార వ్యవస్థ, యంత్రాంగం, వలరీతిగా చేసిన పని అని కనిపించేయి. ఒక వాక్యంలో వాటిని వాడడం సుకరంగా లేదు. బహుశా దాన్ని పేరుప్రతిష్ఠలకోసం పాకులాడడం అని కూడా అనొచ్చు. 2, 3, 4 గౌరవప్రదంగా కూడా లేవు. అంచేత నేను మరో పదంకోసం చూస్తున్నాను. ఈలోపున నా ఆలోచనలు కొన్ని చెప్తాను.

ఈ నెట్వర్కింగులో జరిగేది మనం చేసిన కృషి పదిమందికి తెలియజేయడం అని చెప్పేను కదా. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. పూర్వం కవులు తమ తాటాకు గ్రంథాలు రాజులకూ, భాగ్యవంతులకూ చూపించి, వీలు కుదిరితే వారికి అంకితం ఇచ్చి తమరచనలను నిలుపుకునేవారు కదా. ఈ నేనున్నానన్న తపన అనాదిగా వస్తూనే ఉంది, పోతనవంటి మహానుభావులను తప్పిస్తే.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. ఈమధ్య నేనే వార్తలు ఎక్కువగా వింటున్నానో, పరిస్థితులే రాను రాను ఘోరం అవుతున్నాయో కానీ ప్రతిరోజూ వింటున్నాను. స్త్రీలమీద, పిల్లలమీదా జరుగుతున్న అనేక అత్యాచారాలగురించి. ఆడపిల్లలనే కాదు మగపిల్లలని కూడా హింసిస్తున్న సంఘటనలు ఉన్నాయి.  నిజానికి బలవంతుడు – ఏవిధమైన బలమైనా అర్థబలం, అంగబలం, స్థానబలం – ఏది ఉంటే దాన్ని ఉపయోగించుకుని మరొకరిని హింసిస్తూనే ఉంటారు. అలా తమబలాన్ని దుర్వినియోగం చేయనివారు చాలామంది ఉన్నారు. వారికి నమస్సులు.

అందుకు విరుద్ధంగా కొందరు అలాటి బలాన్ని ఉపయోగించుకుని బలహీనులని నోటితో చెప్పలేని హింసకు గురి చేస్తున్నారు. ఆ హింసలు నేను రాయను. మీరు కూడా వార్తల్లో వింటూనే ఉన్నారు.

ఇక్కడ బలహీనులంటే కండబలం లేనివారు మాత్రమే కాదు. పైన చెప్పినట్టు, సమాజంలో స్థానాన్నిబట్టి అవతలివారికి గల బలం. ఆ స్థానం లేనివారు హింసకి గురి అవుతున్నారు. ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, సినిమా, సంగీతం, సాహిత్యం, సకల కళల్లోనూ ఈనాడు ఈ స్థానబలానికి చెప్పలేనంత బలం వచ్చింది.

మామూలుగా ఇలాటివిషయాలగురించి రాయడానికి నేను సందేహిస్తాను కానీ వార్తలు చూస్తుంటే ఏమీ మాటాడకపోవడం కూడా నేరమే అనిపిస్తోంది. ఇక్కడ నాబాధ వర్ణించబోవడం లేదు. నాకు కలిగిన ఆలోచనలు ఇక్కడ రాస్తే, ఎవరికి వారు తాము చేయగలిగింది ఏమైనా ఉందేమో తరిచి చూసుకోడానికి ఉపయోగపడగలదేమో అన్న ఆలోచనతో రాస్తున్నాను.

ప్రతివారూ పిల్లలకి చెప్తారు కొత్తవాళ్ళతో మాటాడవద్దు కొత్తవారు ఎక్కమంటే కారో రిక్షావో ఎక్కవద్దు. Girls Scouts cookies అమ్మడానికి ఇల్లిల్లూ తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఇంట్లోకి రమ్మంటే వెళ్ళొద్దు అని పదే పదే నొక్కి చెప్తారు. కారణం అందరికీ తెలిసిందే. ఈరోజుల్లో ఎవర్నీ నమ్మడానికి లేదు. వీధిలోకి వెళ్ళినపిల్లలు భద్రంగా తిరిగొస్తారో లెదో తెలీదు. ఆఫీసుకెళ్ళిన ఆడపిల్ల క్షేమంగా ఇల్లు చేరుతుందన్న భరోసా లేదు. ఆఫీసులో జరిగిన అఘాయిత్యం ఇంటేలో తల్లికో తండ్రికో మరొకరికో చెప్పగల ధైర్యం లేదు. చిన్నా పెద్దా అని లేదు. ఆడా మగా అని లేదు. ఇంతకీ ఇక్కడ నేనంటున్నది పెద్దలకి కూడా ఆ ఆలోచన ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాం. ఎవరితో మాటాడుతున్నాం, ఆవ్యక్తుల ధోరణి ఎలాటిది అని ఆలోచించుకోవాలి కదా.

రాజకీయనాయకులు, సినిమారంగంలో ప్రొడ్యూసర్లూ, సుప్రసిద్ధనటులు తమకంటె తక్కువ స్థానంలో ఉన్నవారిని హింసకు గురి చేసిన విధానం పరమనీచం. అలా హింసకి గురైనవారు ఆయా రంగాల్లో పైకి రావాలన్న తాపత్రయంతో, దుర్మార్గులని కాదంటే తమకి పుట్ట గతులుండవన్న భయంతో సహించేరు. తమమాట ఎవరూ నమ్మరన్న భయంతో మాటాడుకుండా సహించేరు. ఇప్పుడిప్పుడే ధైర్యంగా మాటాడగలస్థాయికి వచ్చేరు.

సాహిత్యంవిషయానికొస్తే ఇంత ఉధృతంగా లేదనే అనుకుంటున్నాను. ఈనాటి సమాజం తీరుతెన్నులమూలంగా ఈ నెట్వర్కింగు చోటు చేసుకుంది. కనీసం కొందరు అలా భావిస్తున్నారు. ముఖ్యంగా పేరుప్రఖ్యాతులు, బిరుదులు, సత్కారాలూ, పురస్కారాల, పట్టుశాలువలు కావాలనుకుంటే ఈ వ్యవసాయం చేస్తున్నారు. అన్నట్టు దీన్నే కాకా పట్టడం అనొచ్చేమో.

ఇది నేను కూడా కొంత చవి చూసేను. నాకేదో పెద్ద పరపతి ఉందనుకుని కొందరు నన్ను కదిలించేరు. మొదట మీ అంత బాగా కథలు రాసేవారు చాలా తక్కువ. పేర్లు చెప్పమంటే, మొదటి పదిమందిలో మీపేరుంటుంది…. లేదా ఇంటర్వ్యూ చేస్తాం అంటూ మొదలు పెడతారు. లేదా ఫలానాకత బోల్డు బాగుందని చెప్పడానికి పిలిచేం అంటారు. అంటే నేను “అంది పుచ్చుకునే” వైపు ఉన్ననాన్నమాట. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు. తమకథ, తమ పుస్తకం, తమ అద్భుత ఆలోచనలు … ఇవి నేను మెచ్చుకోవాలి. ఇంతలో విషయం మారిపోతుంది. “అదేంటండీ ఆయన అలా ….” అక్కడే నాకు చిరాకేస్తుంది. ఇక్కడే నేను సాహిత్యరంగంలో నెట్వర్కింగు చేయదలుకున్నవారికి, చేస్తున్నవారికీ నాసలహా.

ఆ సంభాషణ తుంచేయడం నేర్చుకో. ఆపకపోతే ఫోనయితే, కట్ చేసేయి.నీఇంట్లో అయితే, “దయ చేయమ”ని చెప్పు. వారిల్లయితే లేచి వెళ్ళిపో.

నీరాతలని ఒకరు ఆదరించకపోతే వారితల్లో జేజమ్మ, మరొకరు ఆదరిస్తారు. ఒకరు నిన్నూ నీరాతలనీ ఆదరించనంతమాత్రాన కొంపలు ములిగిపోవు.

మనగీత బాగుండడంచేత ఇప్పుడు పాఠకులే కాదు ఆదరించే సంఘాలు కూడా లెక్కకు మించి ఉన్నాయి. ఎవరో ఒకరు పిలిచి ఓ శాలువా కప్పకపోరు. కనీసం నిన్ను అవమానించినవారిని అవమానించడానికైన నిన్ను అందలం ఎక్కిస్తారు. విపులా చా పృథ్వీ అంటారు. అలాగే విపులా చ పాఠకులూ, తెలుగు సంఘాలూను.

తెలుగు సంఘాలు ఉన్నంతకాలం ఓ శాలువా కప్పించుకోని రచయిత ఉండడు.

చివరిమాటగా ఇదంతా చదివి నన్నేన్రోయ్ అని భుజాలు తడుముకోవద్దు. ఇందులో పనికొచ్చే ఆలోచనలేమైనా ఉంటే వాడుకోండి. లేదా మరో టపాకి ప్రయాణించండి.

000

(జూన్ 5, 2018)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “నేను ఉన్నాను, నాకు గలదొక బుర్ర!!”

 1. “నేను ఉన్నాను, నాకు గలదొక బుర్ర!!–మంచి వ్యాసం!
  కీర్తి కండూతిలకోసం ప్రాకులాడేవారిని చాలామందిని గమనిస్తూ ఉంటాను..కాకపోతే నేను మంచి చదువరినే కానీ రచయిత్రిని కాదు కాబట్టి ఎటువంటి విమర్శలకూ పూనుకోను.
  ఎందరో మహానుభావులు(రచయితలు/రచయిత్రులు) అందరికీ వందనాలు💐💐

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. అతిగా ఏమీ లేదండి నేను కూడా శాలువాలు తీసుకోను. అసలు సభలకే వెళ్ళడం మానేసేను మీరు చెప్పిన కారణాలే. నెట్వర్కింగ్ పేరుతో దేవులాట కూడా నాకు నచ్చదు. మీ స్పందనకి ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 3. పెద్దల నుండి అనుభవజ్ఞుల నుండి కొన్ని వింటూ ..మరికొన్ని వారిని అనుసరిస్తూ నేర్చుంటారు పిల్లలు . ఆ కోవలోనే నేను . ఈ మధ్య వొక వర్క్ షాప్ లో పాల్గొన్నాను . టీవి మాధ్యమంగా కనబడే ముఖాముఖి కి నేనంటే నేనని పోటీ పడ్డారు . నేను ఇంకొక యువ రచయిత అటువైపు చూడను కూడా చూడలేదు. శాలువా కప్పించుకుంటే పొగడాలి. మనలని వారు వారిని మనము. ఇదొక వృత్తం. కథలకి,కవితలకి బహుమతి వస్తే అవార్డ్ వస్తే తీసుకుంటాను కానీ శాలువా అయితే కప్పించుకోను .. బహుమతి రూపంలో ఇవ్వవలసిన మొత్తాన్ని ఫలానా సంస్థ వారికి అందిద్దాం అన్నాను. నా దగ్గర సరే నండీ అని వెళ్లి .. ఆమె కి చాలా పొగరు అని చెప్పినవారు వున్నారు . ఈ సన్మానాలు చేయించుకోవడం కన్నా సొంత డబ్బుతో పుస్తకాలు వేయించుకోవడం , మనం నమ్మిన మన రాతలని భద్రపరచుకోవడం ముఖ్యం అని నేను భావిస్తాను . అతిగా స్పందిస్తే మన్నించండి .

  మెచ్చుకున్నవారు 2 జనాలు

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.