జగన్నాటకం 2 – ఎంతకష్టమెంత కష్టం

కష్టాలతో చెప్పలేనంత కష్టం

కష్టాలు చెప్పడం కష్టం, చెప్పుకోడం కష్టం

ఒకప్పుడు నీకష్టాలు చెప్పుకుంటావు

మరొకప్పుడు మరొకరి కష్టాలు వల్లిస్తావు

 

కష్టాలు వినిపించడం కొందరికి ఇష్టం

ఇతరులకష్టాలు వినిపించడం మరింత ఇష్టం

నీకష్టాలు చెప్పుకోడం కష్టమవుతుంది కొంతకాలానికి

అది మంచి సమయము పొరుగువారికష్టాల కచేరీ పెట్టడానికి

 

వినేవారికి ఏదిష్టమో తేల్చుకోడం కష్టం

అసలు ఆ ఆలోచనే రాదు నీకు.

నీది సున్నితమైన మనసు కదా.

నీఆలోచనంతా నీసున్నితమనస్తత్వంమీదే.

న్యాయాన్యాయవిచక్షణ

కష్టనష్టాలు అన్నిటికీ నీసున్నితమనస్తత్వం కేంద్రం

అవతలివారిమనసు నొచ్చుకోగలదని తోచదు.

 

అలాటప్పుడే అనుకుంటాను

అసలు కష్టాలే లేకుంటే బాగుండని.

హాహాహ, ఇది హాస్యము.

కష్ఠం, నీదో నాదో, లేకపోతే ఏముంటుంది మాటాడ్డానికి.

లోకంలో సమస్త ప్రఖ్యాతకథలూ కష్టాలుండబట్టే కదా.

నేను క్షేమం, నువ్వు క్షేమమనుుకుంటానంటే కథేదీ?

అందుకే ఆలోచిస్తున్నా ఏకష్టంగురించి రాద్దామా అని.

ఇవాళో రేపో మొదలెట్టాలి.

అంతవరకూ శలవు మరి,

000

  1. మరోరకం కష్టం

ఆలోచిస్తున్నా.

కష్టాలు కొనితెచ్చుకుంటున్నామా?

మాట నేర్చేక అపశబ్దాలు

అర్థంవల్ల అనర్థాలు

అధికారపూర్వకంగా ఆవర్తించి బధిరాంధకత్వం

మనిషి మాత్రమే పొందగలవరం!

000

(జులై 1, 2018)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.