వంటింటి సంబరాలు 4 – అలసందలతో

వంకాయ, అలసందలు (బొబ్బర్లు, black-eyed peas) కూర

నాకిక్కడ దొరకవు కానీ పచ్చి గింజలయితే మరీ బాగుంటుంది కూర.

2 కప్పులు వంకాయ ముక్కలు

అరకప్పు అలసందలు

– నేను frozen వాడుతాను తేలిగ్గా ఉడుకుతాయని. ఎండుగింజలయితే నానబెట్టి విడిగా ఉడికించుకోవాలేమో. నను వాడలేదు కనక నాకు తెలీదు.

మూకుడులో ఓ చెంచా నూనెవేసి, ఆవాలు, మినప్పప్పు, 2 ఎండు మిరపకాయలు పోపేసి,

వంకాయముక్కలు, అలసందలు ఆ పోపులో వేసి, నాలుగు చిటికెలు ఉప్పు, రెండు చెంచాలు నీళ్ళు పోసి బాగా కలిపి,, మూతపెట్టి, 8, 10 ని. ఉడకబెట్టాలి.

అంతే.. కావలిసినవారు, టొమెటో ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు.

– కారం. ఈమధ్య ఏ రెసెపీ చూసినా గుప్పెడు ఎండుమిరపకాయలు, పది పచ్చిమిరపకాయలు అంటూ చెప్తున్నారు కానీ నెను అంత కారాలు తినను. అఁచేత ఎన్ని మిరపకాయలు అన్నది మీ అభిరుచిని బట్టి.

000

బీన్స్ కూర – నేను రెండు రకాలుగా చే్స్తాను.

వేపుడు

2 కప్పులు బీన్సు ముక్కలు

అర కప్పు frozen అలసందలు (లేదా నానబెట్టి, ఉడికించుకున్నవి)

మూకుడులో 2,3 చెంచాలు నూనే వేసి, అందులో బీన్స్, అలసందలు వేసి, ఉప్పు కలిపి, మూత పెట్టి 3, 4 నిముషాలు మగ్గనివ్వాలి.

తరవాత, మూత తీసేసి, అవసరం అయితే మరో రెండు చెంచాలు నూనే వేసి వేగనివ్వాలి 4, 5 నిముషాలు. మధ్యమధ్యలో కలుపుతూ medium-medium heat. నెమ్మదిగా వేగనిస్తే, ముక్కలు కరకరలాడుతూ వేగుతాయి.

వేగేక, ఎండుమిరపపొడి, జీలకర్రపొడి చల్లి మరొ రెండు నిముషాలు పోయ్యిమీద ఉంచి, కారం బాగా ముక్కలన్నిటికీ పట్టేట్టు కలపాలి.

000

మరో రకం పచ్చికారం

2 కప్పులు తరిగిన బీన్స్

అరకప్పు అలసందలు

మూకుడులో రెండు చెంచాలు నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు పోపు పెట్టి, ఆవాలు చిటపటలాడుతుండగా బీన్స్ ముక్కలు, అలసందలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి ఉడకనివ్వాలి.

రెండు పచ్చిమిరపకాయలు (లేదా మీకు కావలసినన్ని), ఉల్లిపాయముక్కలు అరకప్పుకి కొంచెం తక్కువగా, జీలకర్ర, రెండు చిటికెలు ఉప్పు కలిపి ముద్దగా నూరుకోవాలి.

బీన్సు ఉడికేక, ఈ ముద్ద కలిపి, మరో 2, 3 నిముషాలు ఉడకనిచ్చి, స్టౌమీంచి తీసి పక్కన పెట్టుకోవాలి.

000

అలసందవడలు కూడా బాగుంటాయి. మినప్పప్పు వడలకంటే చేయడం చాలా తేలిక. ముందే చెప్పినట్టు frozen అయితే, ఫ్రీజరులోంచి తీసి, వెంటనే చితకామెతకా grind చేసేసుకోవచ్చు. లేదంటే, ఎండుగుంజలు నానబె్ట్టి, నానేక రుబ్బుకోవాలి.

ఉల్లిపాయలు, ఎండుమిరపపొడి, డీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఇష్టమయితే వెల్లుల్లి రెబ్బలు రెండు, ఉప్పు వేసి గారెలకిలాగే, రుబ్బుకోవాలి.

మూకుడులో నూనె వేడి చేసి, అందులో వడలు వేసి వేయించుకోడమే. నెమ్మదిగా వేయిస్తే, లోపలికంటా వేగి, కరకరలాడుతూ ఉంటాయి.

000

(సెప్టెంబరు 15, 2018)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.