శివుడాజ్ఞ కథమీద లక్ష్మి వసంతగారి విశ్లేషణ

సమీక్ష యథాతథంగా –

మాలతి గారూ ,
మీరే అనువదించిన మీ శివుడి ఆజ్ఞ లేనిదే కథ చదివాను రాత్రి..మళ్ళి, మరో సారి చదివాను..ఇలా ఇంతగా ఆలోచింపచేసే కథ ఈ మధ్య చదవలేదు ..ఇది నిజం.
మన బాల్యం మనం ఒక అందమైన భరణి లో దాచేసుకుని, నెమలి ఈకలు పుస్తకాలు మధ్య పెట్టుకుని, ఏదో మేత వేస్తూంటే ,ఈక పెరుగుతుంది అని చిన్నతనం లో నమ్మినట్టు, ఆ బాల్య స్మృతులు మనకి మాత్రమే అమూల్యమైనవి. వేరెవెరికి అయినా చెప్పమా ? పిచ్చిదా ? అన్నట్టు చూడ్డం తధ్యం. మరి ఆ మాజిక్ మన లోనే ఉంది, మన ఊహా ప్రపంచం లో ఉంటుంది.

చిన్నప్పుడు మనం పెరిగిన ఇళ్ళు, విశాలమైన గదులు, ఇప్పుడు వెళ్ళి చూస్తే ,తీరా అవి ఎంత చిన్నవో పరిమాణం లో, కాని మనకే ఎందుకు అంత పెద్దవి, అప్పుడు మనం చిన్న వాళ్ళం అవడం వల్లా?? ఊహలు అలా కల్పిస్తాయా ?అలా భ్రమలు ?

మన ప్రక్కింటి అత్తయ్యగార్లు అంతే , నేనొకటి అనుకుంటాను ,ఎప్పుడూ ,పిల్లలు మనలని నచ్చి ఇష్టపడుతున్నారు అంటే, వారి పెద్దలు, మన గురించి పరోక్షం గా కూడా మంచి మాటలే చెపుతున్నారన్న మాట. ఏమిటొ ఒక దాని నుంచి మరోక దాన్లోకి వెళ్ళిపోతున్నాను.. రాండం గా .

చిన్నప్పుడు పక్కింటి అత్తయ్య గారు ని చిన్నప్పుడే చూసింది ,అప్పుడు విన్న కథలు ,అప్పుడు చెప్పించున్న కథలు ,అప్పుడు చేయించుకున్న ముద్దు ,ఒక చిన్న పిల్లగా ..

ఇప్పుడు ..చిన్నప్పటి ప్రేమ మూర్తి అత్తయ్య ,కథల అత్తయ్య వచ్చిందని ఎంతొ ఎదురుచూసి , పతీ సమేతం గా వెళ్ళిన ఆమె ఎందుకు అంత నిరాశపడింది ?

ఇదే కథ సారాంశం.

నీ సంసారం ఎలా ఉంది? మరో పిల్లో ,పిల్లాడో వద్దు అనుకున్నావా ? భర్త బుద్దిమంతుడేనా అంటూ ఆ కథల అత్తయ్య ,ఈ చదువుకుని ,సంస్కారం ఉన్న ఒక నిండు మనిషి ..స్త్రీ మీద పెద్దరికం పేరుతొ జరుగుతున్న అధికార అత్యాచారం ఈమె తట్టుకోలేక పోయింది.

మన చిన్నన్నాటి ఇంటికి వెళ్ళి సువిశాలం అనుకున్న ఇల్లు ఎంత చిన్నదో అనే నిజం కనుగొన్నప్పుడు కలిగే విషాదం.. విస్మయం .. అంత ప్రేమాస్పదురాలు అనుకున్న కథల అత్తయ్య ఇలా ఉందేమిటి?

తనని ఇంకా చిన్న పిల్ల లాగే చూస్తూ ఉండడం వల్లా ?

కథల అత్తయ్య తన అంతరంగం మీద, తన వ్యక్తిత్వం మీద చేసిన దాడి కి జవాబు గా ఆమె ఒక జాబు రాసుకుంది ,అత్తయ్య రాసినట్టు..

ఈ విషయం నిర్ధారణ చేసుకోవడానికే నేను రెండు సార్లు చదివాను.. సరిగ్గానె అర్ధం చేసుకున్నానా ?

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు ..అంటూ ఉంటారు ..

తన మీద ఇంత మాటల అఘాయిత్యం చేసిన కథల అత్తయ్య మీద చిన్న నాటి మొహం, ప్రేమ వదులుకోలేదు, ఈ రూపం లో అత్తయ్యని అంగీకరించలేదు ..

బాల్యాం లో అమాయకత్వం ,పెద్ద వారం అయాక ,మాయ విడినట్టు వీడిపోతుంది, వీడి పొవాలి ..

అలా కాక పోతే ,మరి కొంచం ఏదో తేడా మనుషులమే కదా ..

ఈమె తన మదిలో ఎంత తిట్టుకుందో , అయ్యో ఎందుకిలా జరిగింది అని ఒక బాధ, ఆమె నె తీవ్రం గా బాధిస్తూ ఉండగా ,కథల అత్తయ్యకి గుండె జబ్బు ,అని వార్త, కోలుకుంటొంది అని మలి వార్త..

హమ్మయ్య అని మనసు శాంతించి ,యేనాడు ,ఒక పూజ, వ్రతం చేయని ఆమె ,’ ఏమండీ మనం సత్యనారాయణ వ్రతం చేసుకుందామా ?’ అని అడగడం లో ,మనం మన మన్సుని శాంతి పరచుకోడానికి ,మన ప్రమేయం లేని, ఇష్టం లేని , జన ఆమోద విషయాలు ని ఎలా ఆమోదిస్తామో ?

మన మనసు లో ఉండే గిల్ట్ ..తప్పు చేసాం అనే బాధ ఎంత గా క్రుంగ దీసి, ఎలాంటి మనిషి ఎలా చేస్తుందో , మన పిల్లాడికి అంతు పట్టని జబ్బు గా ఉంటే, మనం కూడా ,అంటే, దేవుడిని నమ్మని వారు కూడా, ఎందుకైనా మంచిది అని ఒక దణ్ణమో ,మొక్కో మొక్కని వారుంటారా ? ఉంటే, వారిది ఎంత ధృడమైన వ్యక్తిత్వం ?

అంతటి ధృడమైన వ్యక్తిత్వం ఉంటేనే మనిషి అని మనం అనుకోలేం, సహజం గా ఉండే మానవ ప్రలోభాలు, మానవ తప్పిదాలు, లోతు లేని వ్యక్తిత్వాలు , పరిస్థితులకి లొంగే వారు, లొంగని వారు, అయినా మంచి వారే ,ఎందరో ..ఈ మానవ సమాజం లో ..ఎప్పటికప్పుడు ,మనలని మనం ,సంస్కరించుకుంటూ ,బేరీజు వేసుకుంటూ ముందుకు సాగిపోవడమే ఒక మనిషి చేయగలిగే జీవన్ యాత్ర.

ఒక మామూలు సన్నివేశం , పెద్దావిడ ,ఆమె మీద సాగించిన మాటల దాడి, మనకి ఇలాంటి సన్నివేశాలు చాలా జరిగే ఉంటాయి, ఆ సన్నివేశం నించి రచయిత్రి మనకి ఎలాంటి కథ , సందేశం అందించారో ,అని అబ్బురం గా అనిపించింది నాకు .

ప్రతి సంఘటన ని ఇలా మనకి తెలియకుండానే మనం ఆలోచించి , అనుభూతి పొందుతాం. నిరసనో ,విసుగో ,చికాకో కానీ ఆ పైన ఆ అనుభూతి లను ఇలా ఒక కథ లాగ వ్యక్తీకరించడం..
అదేనూ , శివుడి ఆజ్ఞ లేకుండా చీమ అయినా కుట్టదు అనే నానుడి ని ఎలా మార్చుకున్నారో ,తనకి అనుకూలం గా ,అన్నీ కూడా ,కథలు రాసే వారికి ఒక టెక్స్ట్ బుక్ కేస్ అంటారు ..అలాంటిది.

నేను తెలుగు కథ చదవలేదు ,అనువాద కథ ఏ చదివాను.. నాకు చదువుతూ ఉంటే భాష గుర్తు రాలేదు, ఆ ఇంటికీ ,ఆమె మనసులోకి, ఆ కథల అత్త తో నేపధ్యం అయిన ఆమె బాల్యం లోకి అవలీలగా ప్రయాణం చేసాను ..

ఇంత కన్నా ,ఒక కథకి మెప్పు మరేమిటి ? కదిలించేది కథ కదా ..

మాలతి గారూ ,నేను మీ అభిమానిని ఒకప్పుడు, ఇప్పుడు, మరి ఎప్పుడూ..

Vasanta Lakshmi ,p.( Vasantham.. )

000

ప్రధానంగా ఈకథలో (అక్టోబరు 2008) నేను ఆవిష్కరించడానికి ప్రయత్నించింది – రెండు తరాలవెనక ఆలోచనలూ, అభిమానాలూ ఎలా ఉండేవి, వాటిని ఈనాటి బావజాలంతో చూసినప్పుడు ఎలా కనిపిస్తున్నాయి అని.

ఈకథ మొదట ఒక ముగింపుతోనూ, ఆకథమీద వచ్చిన చర్చలు ఆధారంగా మరొక ముగింపుతోనూ రాసిన రెండో కథమీదా విశేషంగా చర్చలు జరిగేయి.

లక్ష్మి వసంతగారు మొదటి కథకి నా ఇంగ్లీషు అనువాదం చదివి రాసిన వ్యాఖ్య ముఖపుస్తకంలో ప్రచురించేరు. నేను ఆ సమీక్ష అప్పట్లో ప్రచురించకుండా లింక్ మాత్రం ఇచ్చి నా ప్రతిస్పందన మాత్రం ఇక్కడ ప్రచురించేను. ఇప్పుడు మళ్ళీ లక్ష్మి వసంతగారు ము.పు,లో ఈరోజు ముందుకి తెచ్చేరు.  ఈసందర్భం ఉపయోగించుకుని, ఆవిడ విశ్లేషణ పూర్తిపాఠం ఇక్కడ ఇస్తే అన్నీ ఒక చోట ఉంటాయన్న ఉద్దేశంతో ప్రచురిస్తున్నాను. అనుమతించిన లక్ష్మి వసంతగారికి ధన్యవాదాలు.

000

లింకులు

  1. శివుడాజ్ఞ (మొదటి వెర్షను)
  2. శివుడాజ్ఞ (రెండవ వెర్షను)
  3. లక్ష్మీ వసంతగారి సమీక్షకి నాప్రతిస్పందన

000

(సెప్టెంబరు 30, 2018)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.