జగన్నాటకం – అరాజకీయాలు

ఓట్లపండుగ

ఓటు ఓటుకీ కోటి దండాలు
వెలిగించు దీపాలు మా
నేతలబుర్రలే మట్టిప్రమిదలు కాగ.

కూటికోసం గూటికోసం వేడుకుంటున్నాను

కాలూ చేయీ ఏబాధా లేకుండా ఆడడంకోసం
ఓటేసి నిలబెట్టు నాబోటి జనులఉసురు.

కోటిదండాలు పెట్టుకుంటా నీపేరు చెప్పుకు.

000

సజ్జనసాంగత్యము సర్వశ్రేయములకు మూలము

సజ్జనుడు దొరకుటయే బహు దుర్లభము

000

పరదేశీజనాలతో చిక్కు

ఆదిని ఉక్కుగొలుసులు బిగించి లాక్కొచ్చేరు.

ఆపైన అరచేత వైకుంఠం చూపి తీసుకొచ్చేరు

ఇప్పుడు దిక్కులు కానక జుత్తు పీక్కుంటున్నారు

000

చంపినవాడూ చచ్చినవాడూ
అన్నీ నేనే అంటాడు భగవానుడు

చావక బతికున్నవాళ్ళు
ఆఇద్దరి గురించి శుప్కచర్చలతో
కాలాన్ని చంపుతున్నారు.

000

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.