తెలుగు తూలిక 11వ పుట్టినరోజు

11 ఏళ్ళక్రితం ఈరోజున తెలుగుతూలిక ఉదయించింది.

11 ఏళ్లలోనూ 756 పోస్టులు ప్రచురించబడినాయి.

50వరకూ పునర్ముద్రణలు అనుకున్నా, 700 పోస్టులు తూలిక పాఠకులకు అందించినట్టే లెఖ్ఖ.

ఈ పదకొండేళ్ళలోనూ నాలుగు లక్షలకి పైచిలుకు చూపులకు నోచుకున్నాయి.

వందలాది పాఠకులు ఆదరించేరు. మొదటి ఐదారేళ్ళలో కొందరు పాఠకులు విలువైన అభిప్రాయాలు వెలిబుచ్చేరు. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. నాటపాలలో తప్పులు దిద్దుకోడానికి అసామాన్యమైన అవకాశం కలిగింది నాకు.

వారందరికీ మనఃపూర్వకధన్యవాదాలు.

గత నాలుగేళ్ళలోనూ ఫేస్బుక్కుద్వారా అనేకమంది కొత్తపాఠకులు చేరేరు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

000

ఈమధ్య నేను అట్టే రాయడంలేదు.

ఈసందర్భంలో “కొత్తవి ఎందుకు రాయరు?” అన్న ప్రశ్నకి సమాధానం మరొకసారి చెప్తాను. ఇది నాపరంగా చెప్పుకున్నా, చాలామంది రచయితలకి అనుభవమే అని అనుకుంటున్నాను.

000

రాయండి, రాయండి,

రాయండన్నంతమాత్రాన జనియించేది కాదు కథ గానీ కవిత గానీ.

కాశ్మీరుశాలువాలు కప్పుతామంటేనూ,

గుప్పెడు రూకలు ఇప్పిస్తామంటేనూ వచ్చేది కాదు కథ గానీ కవిత గానీ.

హేళనలకీ ఎత్తిపొడుపులకీ ఝడిసి వెలువడేది కాదు కథ గానీ కవితావాణి కానీ.

అర్థం పర్థంలేని ముఖస్తుతిమాటలకి కూడా రాదు.

రాసినది చదివి, ప్రధానంశంమీద మీ నిర్మా ణాత్మకమైన అభిప్రాయాలు వెలిబుచ్చినప్పుడు మాత్రమే మారుబలుకగలదు సృజన.

అ ప్పుడే వస్తాయి మీరు మెచ్చగల కథలూ,కవితలూ.

000

మా పాఠకులందరికీ మరొకమారు మనఃపూర్వకంగా వందనశతములు.

(డిసెంబరు 2, 2018)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “తెలుగు తూలిక 11వ పుట్టినరోజు”

  1. శుభాకాంక్షలు మాలతి గారూ. కొత్త విషయాలు స్ఫురించక కాదు. ఒక విధమైన నిరాశక్తత గూడు కట్టుకోవడమేమోనని నేననుకుంటాను. నిజానికి మీ దృకోణంలో వ్రాయవలసి విషయాలు చాలా వున్నాయి. వ్రాయాలనిపించినప్పుడు వ్రాస్తూ వుండండి.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.