పండుగ వేడుకలు

 

ఏడాది పొడుగునా లేని కోలాహలం

ఆఖరిమాసం, మొదటిమాసం

అట

గోడలకి సున్నాలు

గుమ్మాలకి తోరణాలు

వణికించే చలిలో

వాకిట తీరిచిదిద్దిన రంగవల్లులు

ఏడాదిపాటు పడ్డశ్రమఫలం కనులముందు కుప్పయి

వెలసి మురిపించిన సౌభాగ్యం

ఇట

నెట్టెక్కో కారెక్కో పరుగులు

ఎవరికి ఏమి కావాలో

ఎవరికి ఏమి నచ్చుతుందో నచ్చదో

ఎక్కడ ఎంతలో దొరుకుతుంందో అన్న తహతహ

కొనడం, ఇవ్వడం, తిరిగిచ్చేయడం

మూడు స్థాయిలలో ముచ్చట

సంక్రాంతి, Christmas ఏపేరు చెప్పుకున్నా

కనిపించేది ఎడతెగని ఉత్సాహం.

అహో ఎంత చెప్పినా తరగని ఆనందం.

000

(డిసెంబరు 21, 2018)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.