నాఆలోచనలు కొన్ని

నాకు సకృతుగా తోచిన ఆలోచనలు, ఫేస్బుక్కులో ప్రచురించినవి, పాఠకులఆదరణ పొందినవి ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను,  ఫేస్బుక్కులో చూడనివారికోసం, నా రికార్డుకోసం.

వీటికి వరసా వావీ లేదు. కనక పైన ఇచ్చిన శీర్షిక మాత్రమే ఒకచోట చేర్చడానికి ఆధారం.

000

కోరికలు

కుక్కపిల్లల్లా ముద్దులు గుడుస్తూ

ఒడికెక్కుతాయి

రేచుకుక్కలయి గాట్లు పెట్టేక కానీ

తెలీదు ఎంత తెలివితక్కువపని చేసేమో.

000

ఛిన్నాభిన్నం

భిన్నాభిప్రాయాలు ప్రోత్సహించాలని

ఏకాగ్రీవంగా నిర్ణయం చేసేసేరు మ.ఘ.వ. మేధావులు.

ఒకొక అభిప్రాయమూ ఒకొక ద్వీపమయి వెలసింది.

మొత్తం మానవులంతా ఒక అఖండసత్వం

అన్నభావానికి జీవం లేకుండా పోయింది.

000

(అక్టోబరు 8, 2018)

000

జ్ఞాపకాలు.

మరుపులు గానీ జ్ఞాపకాలు కానీ శకలాలుగానే మిగిలిపోతాయి.
ఆవెనక కలిగిన అనుభవాలతో వాటిస్వరూపాలు మారిపోతాయి

000

వాడేరా దైవము

ఒక మహా నాయకుడిని

ఒక మహా నటుడిని

ఒక మహా ప్రవక్తని

వాడేరా దైవము

అని ఆరాధించడంలో ఒక ప్రమాదం

ఆమనిషిలో లోపాలను క్షమించి

అతడివల్ల జరుగుతున్న మంచిని మాత్రమే

చూడమని చెప్తారు.

వాస్తవంలో ఆవ్యక్తిలోపాలను

అనుసరించేవారు ఎక్కువ కనిపిస్తున్నారు.

ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాను.

ఇదే బాధ వాడేరా దైవము అని

ఒక అమ్మనో అయ్యనో ఆరాధించడంలో.

000

ప్రజాస్వామ్య సర్కస్

నీతీ, నిజాయితీ, స్వలాభాలూ,

ఒకొకరి ఔన్నత్యాలూ, త్యాగాలూ

కుప్పగా కూలిపోయి ఏది ఏదో తెలీక

మనసు మొద్దు బారిపోయినప్పుడు

రాయిరప్పల్లో లేని రూపాలు వెతుక్కుంటూ

క్షణం తరవాత క్షణం ఖర్చు పెడుతున్నానీపూట.

000

(జనవరి 2, 2019)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.