ధమ్మపథంనుండి 10 ప్రవచనాలు.

నేను ధమ్మపథం చదవలేదు. నాకు 14, 15 ఏళ్ళప్పుడు ఏదో పుస్తకంలో చూసి కాపీ చేసుకున్న పది ప్రవచనాలుఉన్న కాయితం ఈమధ్య కనిపించింది. ఇలా నేను రాసుకోడం చాలా చాలా తక్కువ. ఆకాయితం ఇంతకాలం నాదగ్గర పదిలంగా ఉండడం మరీ వింత. ఈకాయితం కనిపించనప్పుడు కూడా, సదా నామనసులో మెదిల్తూ ఉన్నవి 2, 4 ప్రవచనాలు. ఎంత అర్థవంతం అనిపించినవి.

ఈ ధమ్మపథం జనసామాన్యానికి అర్థమయే సరళమైన భాషలో, లోకరీతి స్పృశిస్తూ కూర్చిన బుద్ధుని ప్రవచనాల సంకలనంగా చెప్పుకుంటారు.

ఇది ఎవరి అనువాదమో ఎక్కడనుండి కాపీ చేసుకున్నానో జ్ఞాపకం లేదు. ఆ అజ్ఞాతపండితులకి మనఃపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీముందుంచుతున్నాను.

000–

  1. పువ్వులవాసన గాలికి ఎదురుగా పయనించలేదు. సజ్జనుని కీర్తి అన్నివేపులా పయనించగలదు.
  2. . నిద్ర లేనివానికి ఒక రాత్రి సుదీర్ఘం.  అలసినవానికి ఒక యోజనం సుదీర్ఘం. ధర్మపథస్వరూపం తెలియని మూర్ఖునికి జీవితం బహుదీర్ఘం.
  1.  ఇది నాసంతతి, ఇది నాసంపద అనుకోడం మూర్ఖలక్షణం. తనే తనవాడు కాడు. అటువంటప్పుడు ఈ సంతతి, సంపద ఏమూల?
  2. పాయసంలో గరిటెకి తెలిసే రుచి ఎంత?సజ్జనునితో ఒక జీవితకాలం సాంగత్యము చేసిన మూర్ఖునికి కలిగే జ్ఞానమూ అంతే.
  1. జ్ఞాని సజ్జనునితో ఒక నిమషం గడిపితే చాలు. పాయసంరుచి నాలుకకి తెలిసినంత త్వరగా జ్ఞానోదయం కలుగుతుంది.

6, సహస్రసమరాల్లో సహస్రాధిక వీరుల్ని జయించిన వీరునికన్నా తనని తాను జయించుకున్న వాడు వీరుడు, ఘనుడు.

  1. జయం పగకు దోహదకారి. పరాజితుడు విజేతపై పగ పడతాడు. జయాపజయాలు రెండూ లేనివాడు ధన్యుడు.
  2. గాలికి విసిరిన దుమ్మువలె నిర్మలుడూ, నిశ్చలుడూ అయిన సజ్జనుడికి చెడుపు తలపెట్టినవాడు భంగపడిపోతాడు.
  3. విసురుగా పరుగెత్తే రథం వలె విజృంభించే కోపాగ్నిని జయించగలిగినవాడే నిజమైన సారథి. మిగతావారంతా కళ్ళేలు పట్టుకునేవారే.

10, దేశాంతరం వెళ్ళి వచ్చినవానికి బంధుమిత్రులు స్వాగతమిస్తారు. లోకాంతరగతుడైనవానికి అతని పుణ్యపాపాలే స్వాగతమిస్తాయి పరలోకంలో.

000

(ఫిబ్రవరి 6, 2019)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.