1960లలో వచ్చిన రెండు సంకలనాలు

ఈరోజు ఉదయం కోడీహళ్ళి మురళీమోహన్ గారు 1960వ దశకంలో ప్రచురించి రెండు సంకలనాలగురించి ప్రస్తావించేరు. మొదటి సంకలనం యువకథామాల. మసూనా సంపాదకత్వంలో ఉత్తరాంధ్ర గ్రంథమాల వారు ప్రచురించేరు. 1964ప్రచురణ. సత్యకాం.కాం వెబ్ సైటులో ఉచితంగా లభ్యం. లింకు ఇచ్చిన మురళీ మోహన్ గారికీ, సత్యకాం.కాం వెబ్ సైటువారికీ ధన్యవాదాలు

http://www.sathyakam.com/pdfImageBook.php?bId=4954

సూచన- లింకు తెరిచేక, కుడివేపు అంచుమీద నొక్కితే తరవాతి పేజీలు కనిపిస్తాయి.

000

ఈ సంకలనానికంటే ముందు ఈ సంస్థ నవ కథామాల అనే పేరుతో మొదటి సంకలనం ప్రచురించేరుట.

ఆసంకలనం వివరాలు- సంకలనకర్తపేరు, ప్రచురించినతేదీ, వెల, ఎన్నిపేజీలు- తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.

000

ఈ సందర్భంలో మరో సంకలనం ప్రస్తావిస్తాను. ఆ సంకలనం పేరు కల్పన. తొమ్మిదిమంది రచయిత్రుల కథలసంకలనం. సంకలనకర్త కీర్తిప్రియ (గణపతిరాజు నరసింహరాజు). ప్రచురణ 1962. ప్రచురణకర్తలు పద్మప్రియ ప్రచురణలు.

నాకు తెలిసినంతవరకూ కేవలం స్త్రీలరచనలే తీసుకుని కూర్చిన తొలి సంకలనం ఇదే. ఈ తొమ్మిదమంది రచయిత్రులలో ఆరుగురు (నేను కాక) ఈనాడు సుప్రసిద్ధులు, ఈనాటి పాఠకులకు సుపరిచితులే అయినా అప్పట్లో వర్ధమాన రచయిత్రులు. ఆమేరకు సంపాదకులు తమ ధర్మాన్ని చక్కగా నిర్వహించేరనే చెప్పుకోవాలి.  ఇంకా కొందర్ని కూడా అడిగేరు కానీ కథలు రాలేదు. వారిలో భానుమతి రామకృష్ణగారొకరని నాతో అన్నారు నరసింహరాజుగారు.

 

 

 

 

000

ఈరెండు సంకలనాలూ విశాఖపట్నంనుండి వెలువడినవి.

పైరెండు సంకలనాలలోనూ నాకథలు (అవేద్యాలు, జీవనమాధుర్యం) చోటు చేసుకున్నాయి.

మసూనాగారికి, నరసింహరాజుగారికీ ధన్యవాదాలు మరోసారి చెప్పుకుంటున్నాను.

ఈ విషయాన్ని నాకు తెలియజేసిన కోడీహళ్లి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.

000

(మార్చి 5, 2019)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.