యువతీ, ఎవ్వతెవీవు?
కాకలు తీరిన నిపుణులు తీరిచి దిద్దిన
నీ
శిరోజాలు, కనులు, కనుబొమ్మలు
ముక్కూ, తోలూ,
దంతాలూ, వస్త్రాలూ,
కాళ్లూ, గోళ్లూ,
వెరసి ప్రతిభావంతుడు
చెక్కిన శిల్పంలా తీరేవు.
సమస్త అలంకారాలమధ్య
నువ్వెవరో తెలీకుండా పోయేవు.
నీనిజస్వరూపం ఆనవాలు లేకుండా పోయింది.
ఎవరు నువ్వు?
చెప్పు తల్లీ, మరోసారి తెలుసుకుంటాను సరికొత్తగా,
000
(మార్చి 12, 2019)