దార్శనికకథారచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవిగారు. శీలా సుభద్రాదేవిగారి వ్యాసం.

ఇల్లిందల సరస్వతీదేవిగారు నాకు ఒకతరంముందటి రచయిత్రి. సరిగ్గా చెప్పాలంటే ఆవిడ మొదటికథ ప్రచురించేనాటికి నాకు రెండేళ్ళు.

ఈనాటి పాఠకులలో చాలామందికి ఈపేరు తెలియకపోవచ్చు. వెనకటి నిజానికి ముందటి అనాలి, కథకులు అంటే తెలుగుకథలు చదివేవారు కూడా ఓ పది, పదిహేను పేర్లు చెప్పగలరు, కానీ ఆరోజులు ప్రతిభావంతంగా కథలు రాసి పేరు తెచ్చుకున్న రచయితలగురించి ఈనాడు మాటాడుకోడం తక్కువే. ఇప్పుడు చెప్పుకుంటున్న సామాజిక ప్రయోజనంతోపాటు సామాజిక అవాగాహనతో ఎంచదగ్గ రచనలు చేసి సాహిత్యంలో ఉత్తమస్థాయి చేరుకున్నారు.

ఈనాడు అనేకులు ప్రస్తుతం వస్తున్న పుస్తకాలు విరివిగా కొని చదువుతున్నారు, ఈనాటి సమాజంగురించి సమగ్రమైన అవగాహన ఏర్పర్చుకుంటున్నారేమో కూడా. మనకాలానికి ముందటిరచయితల రచనలు కూడా చదవాలి. అలాటివారు ఉన్నారని తెలుసుకోవాలి. వారిరచనలు స్ఫూర్తిదాయకం అని గ్రహించాలి.

ఇలాటి కృషి చేస్తున్నవారు అట్టే లేరు కానీ అస్సలు లేరని చెప్పడానికి లేదు. కొంతకాలం క్రితం సత్యవతిగారు స్వాతంత్ర్యానంతర రచయిత్రులను పరిచయం చేస్తూ వ్యాసాలు రాసేరు.

మళ్ళీ ఇప్పుడు శీలా సుభద్రాదేవిగారు అలాటి కార్యానికి పూనుకోడం ముదావహం.

ఏప్రిల్, 2019, పాలపిట్ట పత్రికలో శీలా సుభద్రాదేవిగారు రాసిన వ్యాసం

చూడండి.

ఇల్లిందల సరస్వతీదేవిగారి పుస్తకాలు బజారులో దొరుకుతున్నాయో లేదో నాకు తెలీదు. కానీ ప్రతి గ్రంథాలయంలోనూ తప్పకుండా ఉంటాయి. నేను లైబ్రరీలోంచి తెచ్చుకునే చదివేను. హెచ్చరిక. కొన్న పుస్తకాలు అటకెక్కించేయవచ్చు కానీ లైబ్రరీపుస్తకం అయితే అలా వీలులేదు కనక తప్పక చదువుతారు.

 దార్శనిక కథారచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవిగారు

(ఏప్రిల్ 6, 2019)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.