సాయం

సాయం ఒక వ్యవసాయం

అవుసరాలకనుగుణంగా చేస్తే సాయం

సాయం చేయడమే ధ్యేయంగా 

ఏవేవో చేసుకుపోవడం సాయం కాదు. 

అదొక వ్యసనం, పరమనిరర్థకం.

౦౦౦

మూడేళ్ళగా ప్రతిఏడాదీ 

మాస్థానికప్రభువులు 

LED light bulbs ఇంటింటా పంచిపెడుతున్నారు.

వాటితో వచ్చే సంచీలు ఎంతో బాగున్నాయి

ఎంతో చక్కగా పనికొచ్చేవిగా ఉన్నాయి.

బల్బులు విద్యుత్తు పొదుపు చేస్తాయి.

విద్యుత్ వినియోగం తగ్గుముఖం పట్టునట. 

నాసందేహం

ప్రతిఏటా ఈపంపిణీకి అయే వ్యయం?

బల్బులు, సంచులు, వాటిని ఇంటింటికీ 

సరఫరా చేయడానికి ట్రక్కులు, చోదకులు

వీటిఖర్చులు గమనించేరా?

అసలు బల్బులు ఇలా ఏడాదికోమారు మార్చవలసిన 

అవుసరం ఉంటుందా?

నాకు ఆ బల్బులు అవుసరం లేదు

ఇరుగూ పొరుగూ అడిగేను మీకు కావాలా అని.

మాకొద్దు, మాకొద్దు, వద్దు, వద్దు అనే జవాబు.

౦౦౦

ముఖ్య గమనిక: నేను మా  స్థానికప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు. నిజానికి వారికి ఇలాటి సద్వివేచన కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ, ఇలాటి బృహత్ ప్రణాళికలలో వ్యయం ఉంటుందని చూపడమే నాఉద్దేశం. 

పోతే, వైయక్తికస్థాయిలో కొందరు స్నేహితులు నాకు చేసే సాయాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. ఈ టపా ఆ రెండు ఏడుపులూను. 

(జూన్ 2, 2019)aa

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “సాయం”

  1. అమెరికాలో బల్బులు ఇస్తున్నారా ? చంద్రబాబుగారు కూడా ఇచ్చారు కానీ ఉచితం కాదు కరెంట్ తక్కువ అవుతుందని కొన్నాం. ఎవరూ బ్రతిమాలలేదు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.