నొప్పి

నొప్పి సాపేక్షం అవునో కాదో

1 నించి 10 వరకూ ఏఅంకెతో పోలుస్తావంటే ఏమిటి చెప్పడం

నాకు తెలిసినవి రెండే, మూడూ, ఏడూ

మూడంకె వేసి ముడుచుకు పడుకునేలా చేస్తోంది.

“ఏడుపొ”చ్చేలా ఉంది.

కొంచెం, ఫరవాలేదు, ఓ మోస్తరుగా, బాగానే ఉంది, చాలా నొప్పెడుతోందంటూ చెప్పడం మామూలు.

లేదా

రణరంగంలో కాళ్ళూ చేతులూ నరుక్కుపోయిన వీరుడిబాధ,

ముళ్ళకంపలో చేయి పెట్టినప్పుడు గీరుకుపోయినట్టు అని చెప్పడం కూడా తేలిక.

అంతే కానీ అంకెలలో అక్షరాలలో చెప్పగలిగేది కాదు కదా శారీరకమైనా మానసికమైనా నొప్పి.

నొప్పి నొప్పే, మరోలా చెప్పలేం.

000

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.