చిన్నకష్టం చాలు బతుకుతీరు మార్చేయడానికి!

జలజాక్షి ఆలోచనలో పడింది. యోగాసనాలు వేస్తూ ఒంటికాలిమీద నిలబడేసరికి కలుక్కుమంది. సరే రెండోకాలు దింపి, మళ్ళీ ఎత్తబోతే, మోకాలు చివ్వున లాగింది. పట్టలేనంత నొప్పి. విరిగిపోయిందేమో అనిపించేలా.

మెల్లిగా కుర్చీలూ, బల్లలూ ఆసరా చేసుకుంటూ వెళ్ళి మూలనున్ను చేతికర్ర అందుకుని మళ్ళీ వెనక్కొచ్చి మంచంమీద వాలి ఆలోచించసాగింది.

ఇంతవరకూ ఎవరిని ఏ సాయం అడక్కుండా జరుపుకుంది. ఇప్పుడు ఆరోజు వచ్చెనా అన్న భయమే ఆమెని గజగజలాడించేస్తోంది. ఈనొప్పికి ఏ చికిత్స? యునానీ డాక్టరా? ఆయుర్వేదమా? కైరోప్రాక్టరా? సూదులా?

ఇప్పుడు అర్జెంటుగా క్రచెస్ కావాలేమో. వాటికోసం ఎవరిని పిలవాలి? మరో సందర్భం అయితే తనే వెళ్ళి తెచ్చేసుకునేది. హాహా. తాను వెళ్ళగలిగితే అసలు ఆ కర్రల అవుసరమే ఉండదు కదా.

సమయానికి అమ్మాయి ఊళ్ళో లేదు కానీ ఉంటే వద్దన్నా వినకుండా వచ్చి, ఊతకర్రలూ, మందులూ, తిండికి కావలసిన సంభారాలూ అన్నీ కూర్చి పెట్టేది. ఆవెంటనే యమర్జెన్సీ వార్డుకి తీసుకుపోయేది. అదే తనకి అస్సలు ఇష్టం లేనిది. ప్రాణాలమీదికి వస్తే ఆస్పత్రిముఖం చూడదామె.

ఏంటో అదేదో పద్యంలో … హుం ఆఖరికి అది కూడా జ్ఞాపకం రావడం లేదు … అల్లునిరాక, ఇల్లాలిపురిటివేదన … ఇంతకీ అన్నీ ఒక్కసారే వస్తాయెందుకూ పెళ్ళివారిలా కట్టకట్టుకు. ఒకదాని తరవాత ఒకటి తీరిగ్గా, మధ్య మధ్యలో కొంచెం విరామం ఇస్తూ రావచ్చు కదా. అప్పుడు దేనకదే ఒకొక కష్టంమీద విడివిడిగా, సంపూర్ణంగా మనసు పెట్టి తగు సేవలు చేస్తాం. అన్నీ ఒక్కసారి ఉప్పెనలా విరుచుకుపడితే ఏం చేయగలం.

“సరే, మీరంతా నన్ను కష్టపెట్టడానికే కదా వచ్చేరు, మీరు కష్టపెట్టండి, నేను ఏమీ పట్టించుకోకుండా, మిమ్మల్ని లెక్క చేయకుండా, రాజెవరికొడుకన్నంత హాయిగా  సుఖపడతాను”. .. లేదులెండి. ఊరకే కథకోసం అలా చెప్పొచ్చు కానీ నిజంగా అలా జరగదు. అలా  నొప్పి మరిచిపోగలగితే అసలది నొప్పే కాదు.

వీధిలో షికార్లకి విఘ్నం కలగడంతో జాలవిహారం ఎక్కువయింది. మోకాలు నొప్పి ఎందుకు వచ్చును, రెండుకాళ్ళకి పని సమానంగానే ఇస్తాం కదా ఒకమోకాలే ఇలా ఎందుకు పేజీ పెట్టును, అసలు దీనికి మూలకారణములేమి, వాటికి చికిత్సలేమి, ఏపనులు చేయొచ్చు, ఏవి చేయరాదువంటి అనేక విషయాలు తెలిసేయి. అన్నిటికంటె నవ్వాలో ఏడవాలో తెలీని ఒక అంశం యోగాసనాలు మంచవని. అందులోనూ వృక్షాసనం మోకాళ్ళు గట్టిడడానికి తోడ్పడుతుంది. లేదు మహానుభావా, అది చేస్తున్నప్పుడే ఈ మోకాలు కలుక్కుమంది. ఆతరవాత నడుస్తుంటే తెలిసింది నొప్పి.

ఆ జాలంలోనే ఇంతకుముందు టైపింగు మితిమీరి చేయి నొప్పి అని elbow brace కొంది. తీరా చూస్తే మోచేయిదగ్గర పట్టు బాగానే ఉంది కానీ కిందిభాగం వదులుగా ఉంది. ఆమాటే reviewలో రాసి, వదిలేసింది. ఇప్పుడు చూస్తే ఆ కంపెనీ జవాబు ఇచ్చేరు.

వినియోగదారులకి సంతృప్తి నూటికి నూరు పాళ్ళు కలిగేలా చూడడం మాధ్యేయం. మాది చిన్న ఫామిలీ బిజినెస్. మీసంతృప్తి మాకు ప్రధానం.

ఇదుగో. ఈకింద ఇచ్చిన మూడు విధానాలలో మీకు ఏది ఇష్టమో చెప్పండి అలా చే్స్తాం.

 1. మీడబ్బు వాపస్ చేసేస్తాం. మీదగ్గరున్న బ్రేస్ తిరిగి పంపనక్కర్లేదు.
 2. మరొకటి పంపుతాం. మీకు ఏవిధమైన ఛార్జీ లేదు.
 3. మేం అమ్ముతున్న మరొకటి ఏదైనా ఎంచుకున్నా పంపగలం. ఉచితంగానే.

ఆజవాబు ఇప్పుడే చూడడం. సరే, “నాచేయి వంకరలు మీరు తీర్చలేరు, knee brace పంపగలరా?”అని రాసింది. తిరుగు టపాలో ఒకటి కాదు, రెండు పంపేరు ఉచితంగానే!! (కథ ముగిసినతరవాత, చివరలో మరిన్ని వివరాలు, వాస్తవమైనవి ఇచ్చేను knee brace companyగురించి)

అదీ జలజాక్షిని అంత ఆశ్చర్యచకితురాలిని చేసింది. ఆ మోకాలిపట్టీ బాగానే పని చేస్తోంది. కొంతవరకూ అడుగులు వేయడం తేలికయింది. అది కొంత ఉపశమనమే కానీ చికిత్స కాదు కదా.

హాల్లోంచి వంటింటికి దగ్గరదారి, వంటింట్లోనో, పక్కగదిలోనో ఉంటే అక్కడినుంచి కదిలేముందు అక్కడ తాను చక్కబెట్టవలసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా అని మరోసారి వెనుదిరిగి చూసుకుంటోంది. హాల్లో కూర్చుని కాఫీ తాగేక కప్పు సింకులో చేర్చడానికి రెండు మజిలీలు. పొయ్యిదగ్గర నిలబడితే ఒంటికాలిజపం, ఈరెండోకాలు ఎంతకాలం భరిస్తుందోనన్న సందేహం … … ఈ మార్పులు చిన్నవే అయినా తనజీవనవిధానాన్ని, ఆలోచనావిధానాన్నీ కూడా మార్చేసేయి చప్పుకోదగ్గ స్థాయిలో.

000

ఒకరోజు,

“చాల్రోజులైంది. ఎలా ఉన్నావు? ఈమధ్యనే అనుకున్నాను ఎక్కడున్నావో, ఏంచేస్తున్నావో అని.”

“అనుకోకుండా ఊరు మారిపోయేను. షికాగోలో మెయినాఫీసుకి పంపించేరు అసిస్టెంటు మేనేజరుగా.”

“అసిస్టెంటు మేనేజరే. బాగుంది. చెప్పనేలేదు నాకు. సరేలే.”

“సారీ, సారీ. మీకు చెప్పాలనుకుంటూనే ఉన్నానండి. ఇక్కడ అంతా కొత్త కదా. మళ్ళీ తుడుంనుంచి దేవతార్చనవరకూ అన్నీ మళ్ళీ మొదట్నుంచీ చూసుకోవాలి కదా. ఆఫీసులోనూ ఊపిరాడకుండా పని.”

“అవును మరి. పెద్ద ఉద్యోగం ఊరికే వస్తుందేమిటి. ఫరవాలేదులే. ఇప్పుడు చెప్పేవు కదా. సంతోషం. బాగున్నావు కదా.”

“బాగున్నానండి. ఇంతకీ ఎందుకు పిలిచేనంటే …”

“ఆహా, ఏదో ఉందన్నమాట.”

“మరలా అనకండి. అసలే ఇంతకాలం పిలవలేదని బాధగా ఉంది.”

“సరే. అనను. విశేషాలు చెప్పు.”

“నేనిక్కడ ఉన్న పనులు చాలనట్టు తెలుగు సంఘంలో చేరేను.”

“బాగుంది. అభినందనలు.”

“థాంక్సండి. ఇంతకీ, అసలుసంగతి, మేం ఉగాదికి ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం. మీరు వక్తగా వస్తే బాగుంటుందని. ఇది నాప్రత్యేక విన్నపము అనుకోండి. మీరు సరే అనాలి. మీ ప్రయాణఖర్చులు మేమే భరిస్తాం.”

“వద్దులెద్దూ. నాకెక్కడికీ తిరిగే ఓపిక లేదు.”

“అదేమిటండి. మిమ్మల్ని మళ్లీ చూడొచ్చని ఎంతో ఆశపడ్డాను. పోనీ నన్ను చూడ్డానికి వస్తున్నాననుకోండి.”

“హా హా. అలా అనుకుంటే సరా? మాటాడొద్దూ. అసలు అది కాదు. నాకు మోకాలు వశంలోలేదు. arthritis అనుకుంటున్నా. కొంతకాలం డాక్టర్లచుట్టూ తిరగాలి. అంచేత ఇప్పుడప్పుడే ప్రయాణాలేమీ పెట్టుకోదలుచుకోలేదు.”

“అయ్యో అలాగా. మీఇష్టం. ఆలోచించి చెప్పండి. ఉగాది అంటే ఇంకా 4 నెలలుంది కదా.”

అక్కడికి మాటలు ముగించి ఫోను పెట్టేస్తుంటే ఈ అమ్మాయి ఎంతటిదిట్ట అయిందీ అనుకోకుండా ఉండలేకపోయింది. అప్పట్లో –

నాలుగేళ్ళయిందేమో కొత్తపెళ్ళికూతురుగా వచ్చింది యామిని ఇండియానించి. కామేశం అసిస్టెంటు ప్రొఫెసరు కాగానే ఇండియా వెళ్ళి పెళ్ళి చేసుకుని తీసుకొచ్చేడు. ఇద్దరూ ఎంతో సరదాగా ఉండేవారు. … పుట్టింట అమ్మా నాన్నా ఏడుమల్లెపూలఎత్తు రాకుమారిలా సుకుమారంగా పెంచేరు. కాపురానికొచ్చేక, కామేశం యామినిని సిగపూవు వాడకుండా చూసుకున్నాడు. పువ్వుల్లో పెట్టి అంటే ఏమిటో అతన్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలన్నా అతనే తీసుకెళ్ళడం, ఇంట్లో ఏమి కావాలో చూసుకోడం అతనే, ఎవరితో మాటాడాలన్నా అతనే …

వంటింట్లో ఊరికే తను నిల్చోడమే కానీ పనంతా కామేశమే చేసేవాడు కబుర్లు చెబుతూ. ఆరోజుల్లోనే మరో పని లేక యామిని కథలు రాయడం మొదలు పెట్టింది. అవి కూడా అతనే టైపు చేసి, కవరులో పెట్టి అడ్రెసు రాసి, పోస్టు చేసేవాడు. వీలున్నచోట సాఫ్టుకాపీ పంపేవాడు. వ్యాఖ్యలకి జవాబులు రాసేవాడు.

… … …

ఆ సుందర సురచిర స్వప్నం ఒక రోజున టుప్పున పేలిపోయింది గాలిబుడగలా, నిద్రమత్తు ట్రక్ డ్రైవరు నిర్లక్ష్యంమూలాన. క్షణాలమీద యామినిజీవితంలో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. బుద్ధి పనిచేయడం లేదు. ఓదార్చడానికొచ్చిన స్నేహితులూ, పరిచయస్తులూ, ఇరుగూ పొరుగూ ఏమంటున్నారో వినిపించడంలేదు. రేపేమవుతుందో తెలీడంలేదు.

అలాటిరోజుల్లోనే ఎవరో జలజాక్షిని పిలిచి, “ఒక్కపూట మీరు యామినితో ఉండగలరా?” అని అడిగేరు. వాళ్ళంతా వంతులు వేసుకుని తనకి సాయంగా ఉంటున్నారుట, వాళ్ళవాళ్లు ఇండియానించి వచ్చేవరకూ.

జలజాక్షికి అలా పరిచయమయింది యామిని. కాలక్షేపానికి, మనసు సమాధానపరుచుకోడానికి, ఓ చిన్నకంపెనీలో data entry పనిలో చేరిన యామిని, ఇప్పటికి మేనేజరు అయిందన్నమాట. నలుగురు తెలుగువాళ్ళని పోగేసుకుని, ఓ తెలుగుసంఘం మొదలుపెట్టి, ఊళ్ళో తెలుగువాళ్ళందరికీ తలలో నాలుకైపోయిందంటే ఆశ్చర్యమే మరి!

కాలూ, చెయ్యీ, కన్నూ, చెవీ … ఏదీ తక్కువైనా, అది లేకుండానో, దానికి అనువైన మరోవస్తువు తెచ్చుకునో జరుపుకోడం నేర్చుకుంటాం కానీ బతకడం మానేయం కదా.

000

ఆలోచిస్తూ జలజాక్షి కాఫీకప్పు సింకులో పడేయడానికి లేవబోయి, ఆగిపోయింది. మళ్ళీ మోకాలు గుర్తు చేసింది నీకు మోకాలు పనిచేయుట లేదు అని.

దీర్ఘంగా నిట్టూర్చి, “కొత్త విధానాలు నేర్చుకోవాలి మారిన శరీరతత్వానికి అనుగుణంగా. మోకాలు జాగ్రత్త అని నాలుగు చీటీలు రాసి కళ్లముందు బల్లమీద, కుర్చీమీద, రిఫ్రెజరేటరుమీద, మంచానికి ఎదురుగా గోడమీద రాసి పెట్టుకోవాలేమో …” అనుకుంటుంటే చిన్ననవ్వొచ్చింది.

అంతే మరి.

ఇంక ఇప్పుడు తినడానికేముందో చూసుకోవాలి. ఫ్రిజ్ తీసి చూస్తే ఏవో నాలుగు డబ్బాలు కనిపించేయి. ఏది ఏమిటో, ఎప్పుడు చేసిందో తెలీడం లేదు. కానీలే, ఏదీ లేనప్పుడు ఏగడ్డి అయినా రుచిగానే ఉంటుందనుకుంటూ తీసి కంచంలో పెట్టుకుంది.

హ్మ్. చేత్తో తింటే చేయి కడక్కోడానికి వెంటనే లేవాలి. చెంచా తీసుకుంది.

హాల్లో కూర్చుని తింటే, కంచం సింకులోకి చేర్చడానికి మధ్యలో రెండు మజిలీలు. చేతికర్ర మరిచి గబుక్కున లేస్తే, మోకాలు కలుక్కుమంటుంది, కర్ర, కర్ర అని వినిపిస్తూ.

తోచనప్పుడల్లా ఠపీమని లేచి, వీధులు తిరుగుతూ, తన్ను నిలబెట్టేసే పూలూ, కాయలూ ఫొటోలు తీసుకునే ఆశలు మాసిపోయేయి.

అయినా దినము గడిచిపోతూనే ఉంది.

ఒకొకప్పుడు ఏమిటీ నిన్న బుధవారం కదా, ఇవాళ శుక్రవారమా? మధ్యలో గురువారం ఏమయిపోయింది?

నిన్న ఏమిటి చేసేను చెప్మా?

ఇప్పుడే కదా లంచి తిని ప్లేటు సింకుకి చేర్చేను, మళ్లీ ఆకలేస్తోందేమిటి?

ఓహో, వార్తలు, రాత్రిభోజనంవేళ అయిందన్నమాట!

ఎప్పుడూ లేని ఆలోచనలు, ఏనాడూ తలుచుకోని విదానాలు

ఏరోజుకారోజు సమయానుకూలంగా సందర్భాన్నిబట్టి మారిపోతోంది దినచర్య… …

000

 

Author’s note:

I would not have thought of writing this story, if I was not impressed by the honesty and integrity of the Copper Compression company’s customer satisfaction policy. As I mentioned in the story, the elbow brace I bought did not work for me. When I contacted them, they were willing to refund, replace with the same or another product of my choice. I chose knee brace. They sent me not one but two braces. They mentioned that they were a small family business and customer satisfaction 100% was important to them. That’s why I am writing this. If you are interested, please check their products on Amazon.com. https://www.amazon.com/Copper-Compression-Recovery-Elbow-Sleeve/dp/B00STR80Y4?th=1

***

In contrast, there is another experience I had with a software company. it is  my bad experience with https://www.softcruxsolutions.com/

I was having bad connection problems, and called the customer service of my router, https://www.arris.com/#. One of their reps took the call, and said they can fix it, and said it would cost $99.00. I paid the amount and he said he was forwarding to another number, which I thought was tech support of the same company.

The people at the other number worked on my computer. It took me sometime to realize that they had nothing to do with router. It was a totally different software company. They got my business backdoor. Since they did not fix my problem, I asked them to refund partial refund at least. The company owner agreed to refund 50 dollars but did not send the money.

All these people at this software company, including the one at ARRIS, who diverted my business to this company without telling me, are Indians. That’s what bothering me most. I am not saying all of them are like that. But, it helps to know who is not honest.

Beware of Softcrux Solutions and the one dishonest staff member at ARRIS. ARRIS is currently investigating who did it.

***

If these two experiences had not happened at the same time, probably, I would not have thought of writing about them. Experience is a valuable teacher. But, its timing deepens it.

(ఆగస్టు 1, 2019)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “చిన్నకష్టం చాలు బతుకుతీరు మార్చేయడానికి!”

 1. చేత్తో తింటే చేయి కడక్కోడానికి వెంటనే లేవాలి. చెంచా తీసుకుంది.
  Life style changes! 🙂
  చిన్నవి, పెద్దవి అని కాదుగాని నా అనుభవంలో మన సమస్యని ఆయా వ్యాపారంలో/ సంస్థలో పనిచేస్తూన్న ఉద్యోగి వ్యక్తిత్వన్నాని బట్టి ఉంటుందనుకుంటున్నాను.ఇండియాలో BSNL (టెలిఫోన్ – ప్రభుత్వ సంస్థ) లో ఫీల్డ్ స్టాఫ్ ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్పితే దాదాపు అందరూ నిర్లక్షంగా ఉంటారు. అక్కడి ఉన్నతాధికారులు సహాయం చేస్తారు.

  కొన్నొ సందర్బాలలో మాల్స్ లో ఫ్లోర్ మానేజర్లు సరిగ్గా స్పందించని సందర్భాలు కూడా ఉన్నాయి. అదే మాల్ లో సేల్స్ అసిస్టెంట్స్ సహాయం అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

  ఒక అమెరికన్ సంస్థ నా సేవలు వినియోగించుకుని కూడా, నాకు ఇవ్వాల్సిన డబ్బుని ఎగ్గొట్టిన సందర్భం ఉంది. దేశీయులు అత్యున్నత పదవులలో ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలతో నా అనుభవం బాగానే ఉంది.

  It is unfortunate that some of the desi’s do not understand the value of customer satisfaction. They carry the same culture where ever they are with them. I know of instances where some of the immigrants keep away from the desi companies for the same reason …fleecing their customers!

  తెలుగు తూలికలో నేను గమనించినంత వరకు అప్పుతచ్చులు తక్కువే. కానీ ఇక్కడ తెలుగు టపాలో కొంచెం ఎక్కువే కనపడ్డాయి!

  మెచ్చుకోండి

 2. జలజాక్షి కథ .. కన్నా “నొప్పి మరిచిపోగలగితే అసలది నొప్పే కాదు.” అన్న విషయం బాగుంది. కీళ్ళు అరిగిన వారికి తరచూ తమ స్థితిని గుర్తుచేసే హెచ్చరికలు .. ఆచరణీయమే మాలతి గారూ ..

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.