మనకి స్వాతంత్ర్యం ఎందుకు?

స్వాతంత్ర్యం వచ్చేక సాధించినదేమిటి?

అసలు మనకి స్వాతంత్ర్యం ఎందుకు?

రష్యాలో హాంకాంగులో స్వాతంత్ర్యంకోసం తిరుగుబాటు

మనదేశంలో ఆరు దశాబ్దాలక్రితమే వచ్చిందని సందడి.

ఎందరో త్యాగధనులశ్రమకి వారసులం.

ఏటా స్వాతంత్ర్యదినం సంబరాలు.

నాదొకటే ప్రశ్న.

ఆంగ్లేయులపాలనలో మనకి జరగలేదు. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది కనక మనం మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు అని ఏవిషయంలో చెప్పుకోగలంష?

– ఏభాష, ఏ సాహిత్యం, ఏకళ,

ఏ సంప్రదాయం, ఏ భావజాలం, ఏ సంస్కృతి

ఇప్పుడు పునః ప్రతిష్ఠించుకున్నాం?

ఏ దివ్యజీవనసరళి, “ఆహా స్వాతంత్ర్యం వచ్చింది, మనం స్వేచ్ఛగా

మనదైన కళ, సంప్రదాయం, సంస్కృతి పునరుద్ధరించుకోవచ్చు” అనుకుని గర్వపడొచ్చు?

ఆలోచిస్తున్నా, మిత్రమా, ఈప్రశ్నకి జవాబు చెప్పేవరకూ, నాకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు చెప్పకు,

నమ్మదగ్గజవాబు తెలిసేవరకూ నాకు ఆ శుభాకాంక్షలు వద్దు.

నువ్విచ్చినా నేను పుచ్చుకోను.

000

జి.వి. కృష్ణరావుగారి వాక్యాలు

ఈసందర్భంలో మరోమారు తలుచుకుంటున్నాను – మనమీద పాశ్చాత్యసంస్కృతి ప్రభావంగురించి కృష్ణరావుగారి అభిప్రాయం ఏమిటి అంటే,

ఆధునిక శాస్త్రీయ సాంకేతికపరిజ్ఞానాలు మనకి లభించాయి. హేతువాదం చోటు చేసుకొంది. పరిశ్రమలు నెలకొని సంపద పెరిగింది. అది ఏదో విధంగా చేజిక్కించుకోవాలనే తాపత్రయమూ పెరిగింది. వస్తుగతసంస్కతి బాగా అబ్బి విలాసాలవెంట పరిగెత్తటం జరుగుతున్నది. వస్తుదాస్యంతో భావదాస్యమూ ప్రబలింది. సీతినియమాలు అడుగంటి ధర్మం, ఉదారవర్తన, రసజ్ఞత లుప్తమయిపోతున్నాయి. ఆర్థికవిలువల్ని నిర్లక్ష్యం చెయ్యరాదు. పాశ్చాత్యసంస్కృతినించి అది నేర్చుకున్నాం. కాని ఆర్థికవిలువలే అన్ని విలువలూనా? … దురదృష్టవశాత్తు ఆ పరుగుపందాలే నేడు కనిపిస్తున్నాయి. ఏమవుతున్నదీ సమాజం? ధర్మానికి పట్టం కట్టి, సత్యం, శివం, సుందరాలని దర్శింపజేసే జీవితాన్నిచ్చిన సంస్కృతిని మనం క్రమంగా మర్చిపోతున్నామా అంటే మనల్ని మనం మర్చిపోతున్నామా?”

నిజానికి, కృష్ణరావుగారు ఉటంకించిన వస్తుదాస్యానికి, భావదాస్యానికి, నేను భాషదాస్యం కూడా చేరుస్తాను. ఈనాడు ఇంగ్లీషో, హిందీవో లేకుండా గట్టిగా నాలుగు తెలుగుముక్కలు మాటాడలేకపోతున్న తెలుగువారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది.  మనసంస్కృతిగురించి మరోసారి మనం గట్టిగా ఆలోచించుకోవాలి.

000

(ఆగస్ట్ 14, 2019)

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.