అనుమాననివృత్తి

ఎన్నో ఏళ్ళగా ఈదారిని నడుస్తూనే ఉన్నా
ఎందుకో నిన్ననే నాకన్నుకానింది.
క్షణకాలం ఆగి పరీక్షగా చూడాలనిపించింది.
ఆ చెట్టునీడ కూర్చోవాలనిపించింది ఏకారణమూ లేకుండానే.

ఈ పేరు తెలీని వృక్షం నాకు
బోధివృక్షం కాగలదేమో అనుకుంటూ …
చేతిలో ఫోనువంక చూసేను.

మిరుమిట్లు గొలిపే వెలుగుతో
నారేపురేఖలను రేఖామాత్రం చేస్తూ ….

నాతల్లో శూన్యం పరుచుకుంది.
అనుమానం నివృత్తి అయిపోయినట్టే ఉంది.
ఏ చెట్టయినా బోధివృక్షమే.

000

సెప్టెంబరు 6, 2019

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.