శీలా సుభద్రాదేవి. భిన్నప్రవృత్తుల సహజదృశ్యాలు (వ్యాసం)

శీలా సుభద్రాదేవిగారు రచించిన భిన్నప్రవృత్తుల సహజదృశ్యాలు, నిడదవోలు మాలతికథలు విపులవిశ్లేషణాత్మకవ్యాసం నాకథలమీద ఇది.

ఈవ్యాసం నాకు ప్రత్యేకంగా నచ్చిన కారణాలు చెప్తాను. మంచివ్యాసానికి కావలసిన లక్షణాలున్న వ్యాసం ఇది.

వ్యాసం ప్రారంభంలో సుభద్రాదేవిగారు చెప్పిన అనేకమంది మంచిరచయితలకి గుర్తింపు ఉండడంలేదన్నది. ఇది  నేను అనేకమంది రచయితలవిషయంలో గమనించేను. అందుకే నేను అనువాదాలు చేసినప్పుడు, గొప్ప పేరుగల రచయితలనే కాక, మంచికథలు ఎంచుకున్నాను. నావ్యాసాల్లో కూడా అలా మరుగునపడుపోతున్న రచయితలనే ఎక్కువగా ప్రస్తావించేను.

  1. స్థూలంగా ఒక రచయిత రచనలను ప్రస్తావిస్తున్నపుడు మౌలకమైన కొన్ని అంశాలు అంతస్సూత్రంగా ఉంటాయి. ఒకొకకథలోనూ ప్రధానాంశం కుదించి చెప్పేయడం కాక, ఈ మౌలిక అంశాలను పట్టుకోడం మంచి విమర్శకులలక్షణం. ఇది ఈవ్యాసంలో చూస్తాం.
  2. బాగానే రాసేను అని నాకు సంతృప్తికలిగించిన కథలను ఎంచుకుని వాటిలో ప్రాధాన్యాన్ని విస్తరించి చెప్పడం.
  3. అన్నిటికంటె ముఖ్యమైనది, నాకథలే తీసుకున్నా స్థూలంగా సామాజికప్రయోజనంగల కథలు, స్త్రీవాదకథలు అంటూ ముద్రలు వేసే కథలకీ ఈకథలకీ తేడా ఎత్తి చూపడం  జరిగింది అన్యాపదేశంగా.

వ్యాసానికి లింకు ఇస్తున్నాను. శ్రమ తీసుకుని ఓపిగ్గా నాకథలన్నీ చదివి సునిశితమైన విశ్లేషణాత్మకవ్యాసం రాసిన శీలా సుభద్రాదేవిగారికీ, ప్రచురించిన భూమిక సంపాదకులకూ కృతజ్ఞతలతో,

http://bhumika.org/archives/8737

000

సుభద్రాదేవిగారు ప్రస్తావించిన కొన్ని కథలకి లింకులు ఇస్తున్నాను.

విల్లు రాసి చూడు

నిజానికీ ఫెమినిజానికీ మధ్య

ఆనందో బ్రహ్మా

రంగుతోలు

నీలితెరలమాటున 

పైచదువులు

లోతు తెలీని ఈత

నవ్వరాదు

అడవిదారంట

తృష్ణ

విషప్పురుగు

శివుడాజ్ఞ

కొనేమనిషి

డాలరుకో గుప్పెడు రూకలు

నీకోసం

ఉత్తమాయిల్లాలు

(నవంబరు, 11, 2019)

 

 

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “శీలా సుభద్రాదేవి. భిన్నప్రవృత్తుల సహజదృశ్యాలు (వ్యాసం)”

  1. ఈ వ్యాసంలో ఉదహరించిన కథలు చదవాలనిపిస్తుంది. బాగా చెప్పేరు సుభద్ర గారూ … చాలా కాలం వేచి చూసిన తర్వాత ఈ వ్యాసం అచ్చులోకి వచ్చింది. దాదాపు నాలుగు నెలలవుతుంది ఈ వ్యాసం వ్రాస్తున్నట్లు తెలిసి. మన పత్రికల తీరు అలా నిరుత్సాహపరిచేదిగా వుంది . ప్చ్ …

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.