దంపుళ్ళపాట

అమ్మదినం వెల్లిపోనాది ఆహుం
సెల్లె ల్లదినం సొగసైపోనాది ఆహుం
దేశదేశాల ఆడోల్లదినం అదిరిపోనాది ఆహుం
అమ్మలగన్న అమ్మలదినము అట్టే పాయె ఆహుం

ఇగ రెన్నెల్ల దనక మారాడకండిరో తండ్రులార
మీయమ్మ కడుపు సల్లగ ఆహుం
మీ పెద్దలపున్యాలు పుచ్చంగ ఆహుం

పల్లకుంటేనూ పాయసాన్నాలు ఎడతం బాబులార
ఊరకుంటేనూ ఉపారాలు ఎడతాం తండ్రులార
మల్ల కల్లబడకుంటేనూ ఆహూం
మాజోలికి రాకుంటేను ఆహుం
మాఊసెత్తకుంటేనూ ఆహుం
మాబిడ్డలకు మీపేరెట్టుకుంటం మారాజులారా ఆహుం
000

(మార్చి 10, 2020)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.