చింతా దీక్షితులుగారి కథ సరస్వతీపూజ

విశ్వనాథ సత్యనారాయణగారి సంపాదకత్వంలో జయంతి పత్రిక 1958లో ప్రారంభమయింది. ఒక ఏడాదిపాటు నడిచిందనీ, తరవాత మళ్ళీ మళ్లీ రెండుసార్లు పునరుద్ధరింపబడిందనీ తెవికీలో ఉంది.

ప్రస్తుతం ఇక్కడ పరిచయం చేసిన సరస్వతీపూజ  కథ జయంతి సంపుటి 1, సంచిక 3లో ప్రచురింపబడింది. సంచిక లింకు వ్యాసం చివర ఇచ్చేను.

చింతా దీక్షితులుగారు నవలలు, ఏకాంకికలు, కథలు విస్తృతంగానే రాసినా, బాలవాఙ్మయంలో విపుల కృషి చేసేరు. ఆయన బాలగేయాల సంపుటి లక్కపిడతలు లేని ఇల్లు లేదు ఆరోజుల్లో అంటే అతిశయోక్తి కాదు. దీక్షితులగారి కథలు కొన్ని సంపుటాలలో చూసేను ఈకథ మాత్రం జయంతిపత్రికలో ఇప్పుడే చూడడం.

సరస్వతీపూజ కథలో చింతా దీక్షితులుగారు గ్రాంథికభాషావాదులకీ వ్యావహారిక భాషావాదులకీ మద్య జరుగుతున్న వివాదాలు ఆవిష్కరించేరు. ఇంతకుముందు ఇదే అంశంమీద వచ్చిన కథ ఇఁద్రగంటి హనుమఛ్చాస్త్రిగారి యతిప్రాసల మహాసభ పరిచయం చేసేను

.హనుమఛ్ఛాస్త్రిగారి కథలో వ్యంగంపాలు ఎక్కువ. ఈకథలో హాస్యంపాలు ఎక్కువ అనిపించింది. రెండుకథల్లోనూ రెండు రసాలూ పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈకథ చదువుతున్నప్పుడు మాత్రం నాకు పట్టలేనంత నవ్వొచ్చింది.

మామూలుగా హాస్యకథలు చిన్న చిరునవ్వు పెదవులమీద మొలిపించేవిగా ఉంటున్నాయి. ఒకొకప్పుడు హాహా అని ఒక శబ్జం ఉత్పాదన చేసేవి కూడా కావచ్చు. చింతా దీక్షితులుగారి ఈ కథలో మాత్రం చదవడం ఆపేసి, గలగల నవ్వుకున్నతరవాత గానీ మళ్ళీ కథలోకి రాలేని ఘట్టాలు ఉన్నాయి. నిజంగానే చెప్తున్నాను. మీరే చదివి చూడండి.

జయంతి సం.1 సంచిక 3 jayan’ti san’put’i1 san’chika3 1959.

డియల్.ఐ సౌజన్యంతో.

తెలుగు వికిపీడియాలో చింతా దీక్షితులుగారి జీవితవిశేషాలు, సాహిత్యకృషికి సంబంధించి వివరాలకు ఇక్కడ

000

(మార్చి 15, 2020)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “చింతా దీక్షితులుగారి కథ సరస్వతీపూజ”

  1. మీవ్యాఖ్యకి ధన్యవాదాలు వనజగారూ. అవును. ఇతర వ్యాసాలు కూడా మంచివి ఉన్నాయి. వాటిమీద వ్యాఖ్యానించేంత పాండిత్యం నాకు లేదు కదా అని వాటిని ప్రస్తావించలేదు.

    మెచ్చుకోండి

  2. పన్నెడు పేజీలు ఉంది కథ . పత్రిక చాలా బాగుంది మాలతి గారూ .. ముఖ్యంగా మొదటి పేజీలలో భాషా సౌందర్యం చాలా ఆకట్టుకుంది . ధన్యవాదాలు .

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.