అన్నమాచార్య చరిత్ర పీఠిక, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

 

వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సాహిత్యంలో విస్తృత పరిశోదనలు జరిపి అనేక మౌలికగ్రంథాలు ప్రచురించిన పండితులు. తి.తి.దే.వారి ఆధ్వర్యంలో తాళ్లపాకవారి వారి వంశచరిత్ర,

సంగీతకృషి విపులంగా వివరించేరు, విడిగా ప్రచురించిన ఈ పీఠికలో అనేక విషయాలు సూత్రప్రాయంగా చెప్పి ముగిస్తారు మామూలుగా. అందుకు భిన్నంగా, ఈ పుస్తకంలో ప్రభాకరశాస్త్రిగారు చేసిన పరిశోధన ఇతోధికంగా గ్రంథస్తం చేసేరు.

అన్నమాచార్యులుగారి జన్మదినం నిర్ణయానికి ఋజువులు మొదలుకొని, ఆయనజీవన ప్రస్థానంలో ఆయన చూసిన ప్రదేశాలూ, ఎదుర్కొన్న సంఘటనలూ, అవి ప్రాతిపదికగా ఏ సందర్బంలో ఏ కీర్తన రచించేరో వివరించేరు. ఆ కీర్తనలు పూర్తిపాఠాలు కూడా జత కూర్చడంవల్ల ఈపుస్తకం స్వయంప్రతిపత్తి గలిగిన పుస్తకం అయింది.

శతథా బహుళ ప్రచారంలో ఉన్న అన్నమాచార్యులవారి కీర్తనలు చాలామటుకు భక్తి, వైరాగ్యం బోధించేవిగానూ, శృంగారరసమయమైనవిగానూ ఉన్నాయి నాకు తెలిసినంతవరకూ. నాకుతెలిసింది చాలా చాలా తక్కువ అని కూడా మనవి చేసుకుంటున్నాను.

ఈపీఠికలో అన్నమాచార్యులవారికి సాళువ నరసింగరాయలు భూపతికి గల మైత్రిగురించి ప్రస్తావించేరు. రాజులవిషయంలో ఆగ్రహానుగ్రహాలు కొంచెం పైస్థాయిలో ఉంటాయన్నది అందరికీ తెలిసినదే. నరసింగరాయలతో  చెలిమిమూలంగా అన్నమాచార్యులవారికి కలిగిన సుఖదుఃఖాలు, వాటిప్రేరణతో అన్నమాచార్యులవారు రచించిన కీర్తనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది ఎంతమందికి తెలుసో  కానీ నాకు మాత్రం కొత్తే.

సందర్భానుసారంగా తిరుపతిలో వివిద ప్రాంతాలూ, పండుగలూ, వేంకటేశ్వరస్వామివారికి సమరించే అర్చనలూ వంటివి ఎన్నో రచయిత సూక్ష్మాతిసూక్ష్మ విషయాలు ప్రస్తావించేరు. అన్నమయ్యకాలంలో జరిపించే పూజలకీ ఇప్పటిపూజలకీ మధ్య గల తేడాలు కూడా ఎత్తి చూపించేరు సోదాహరణంగా.

తాతాచార్యులవారి ముద్ర భుజం తప్పినా వీపు తప్పదు లాటి నానుడులు ఎలా వచ్చేయో, అన్నమాచార్యులవారి కాలంనాటి శ్రీపాదరేణువులకీ ఇప్పటి శ్రీపాదరేణులకీ తేడా వంటి విషయాలు ఎన్నో సంగతులు వివరించేరు.

ఈపుస్తకం వికీసోర్సు లో లభ్యం. లింకు ఇక్కడ

 

000

(మార్చి 21, 2020)

2 thoughts on “అన్నమాచార్య చరిత్ర పీఠిక, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.