నా పిడియఫ్ సంచయం – 1

నా పుస్తకబాండాగారంలో ఏమున్నాయో చూసుకుంటున్న సందర్భంలో మిత్రులొకరు పుస్తకాలపేర్లు అడిగేరు తమకి పాతపుస్తకాలయందు గల ఆసక్తికారణంగా. అప్పుడు చూసుకున్నాను. వీటిలో చాలా చాలా పాతది 1. జయదేవుడి గీతగోవిందం 1937లో ప్రచురణ. దానిమీద మానాన్నగారి సంతకం ఉంది కనక నాకు అపురూపం.

2 యాజ్ఞ్యవల్క్యగీత 1954 ప్రచురణ. అఖండం సీతారామశాస్త్రిగారి టీకతో

  1. నారద భక్తిసూత్రములు, అసలు కవరుపేజీ లేదు. మా చిన్నన్నయ్య బైండు చేయించినట్టుంది.
  2. వ్రతరత్నాకరం ఎప్పుడు ప్రచురించేరో తెలీదు కానీ జీర్ణావస్థలో ఉంది కనక చాలాకాలం క్రితంవే అనుకుంటున్నాను. ఇవి కాక మాఅమ్మ స్వహస్తంతో రాసుకున్న దర్మసూత్రాలూ, ఉపనిషత్తులు, వివధ దేవతాస్తుతులు డైరీరూపంలో.

ఈ వరసలోనే నేను గత 30 ఏళ్ళలో పోగు చూసుకున్న వివిధ గ్రంథాలు పిడియఫ్ రూపంలో ఉన్నవి చూసకున్నాను. అన్నీ Digital Library of India (DLI), archive.org నుండి తీసుకున్నవే. వారికి శతసహర్రవందనములు.

వీటిలో కొన్ని చదివి వా అభిప్రాయాలతో పరిచయం చేసేను.  ఆ వ్యాసాల చివరలో ఆయా పుస్తకాలలింకులు కూడా ఇచ్చేను.

చాలా ఉన్నాయి కానీ అవన్నీ చదివి సమీక్షలు రాయగలనన్న నమ్మకం లేదు. నేను కాకపోతే మరొకరైనా ఉపయోగించుకోగలరన్న ఆశతో నాబ్లాగులో ఈ పిడియఫ్ పుస్తకాలన్నీ క్రమంగా upload చేదాం అనుకుంటున్నాను.

000 000 000

  1. వ్యాసమంజూష -చారిత్ర్యక వ్యాససంపుటి

రచయిత  చల్లా రాధాకృష్ణశర్మగారు. ప్రచురణ 1960.

భారతి, ఆంధ్రపత్రిక, సౌభాగ్యవంటి పత్రికలలో ప్రచురించిన ఆరు వ్యాసాలసంకలనం.

ఆరు. “ఈ వ్యాససంపుటి చదివిన పిమ్మట భారతదేశచరిత్రలో తెలుగువారికి మహోన్నతస్థానము గలదు అను భావము కలిగినచో నా కృషి ఫలించినట్లే” అన్నారు రచయిత మనవిమాటలలో.

ఇందులో చరిత్ర పరిశోధన కావలిసోదరులు అన్నవ్యాసంలో అనేక మంచి విషయాలున్నాయి. కావలిసోదరులు తొలి తెలుగు చారిత్ర్యకపరిశోధకులుగా చెప్పుకోవచ్చంటారు. అలాగే మధరు నేలిన తొలి తెలుగు రాణి మంగమ్మట. ఆమె పరిపాలనలో దేశసౌభాగ్యంగురించి చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది. ఇవి తెలుసుకోడానికి తప్పక చదవవలసిన వ్యాసం.

  1. అప్పటి ముచ్చట్లు.

గ్రంథకర్త  బులుసు వెంకటరమణయ్య గారు. ప్రచురణ వ్యయనామ సంవత్సరం. (1947 అనుకుంటా).

ఇందులో11 కథలున్నాయి. ఇవి సంస్కృతగ్రంథాలూ, ప్రబందాలనుండి సేకరించిననీ, కొన్ని పెద్దలనుండి విన్నవి ఆని రచయిత చెప్పుకున్నారు. ఇందులో కొన్ని కథలు — భారవి, ఖడ్గతిక్కన, నచికేతుడు–బహుశా చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఏ గ్రంథంనుండి సేకరించేరో కథచివరలో చెప్పడం బాగుంది.

000 000 000

DLI archive.org వారి సౌజన్యంతో ఇక్కడ లింకులు ఇస్తున్నాను. పాఠకులు నేరుగా ఆయా సైటులలోనుండి కూడా సంగ్రహించుకోవచ్చును.

  1. Vyasa_Manjusha_Charitraka_Vyasa_Samputi

2. appat’i muchchat’alu

000

(మే 5, 2020)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “నా పిడియఫ్ సంచయం – 1”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.