నా పిడియఫ్ సంచయం – 3

మన చరిత్ర ఏమిటి? .

కోట వెంకటాచలంగారు అంధ్రులు వేరు, ఆంద్రులు వేరు అంటూ, ఆంగ్లేయులు మనసంస్కృతిగురించిన అవగాహన లేని ఆంగ్లేయులు వారికి తోచినట్టు మనచరిత్ర రాస్తే, మనవారు ఆభావాలనే తీసుకుని ఆ తప్పులతడక చరిత్రే మళ్లీ మళ్లీ రాస్తూ వచ్చేరనీ సోదాహరణంగా నిరూపించి, మనచరిత్ర సరైన అవగాహనతో తిరగరాయవలసిన ఆవశ్యకత వివరించేరు ఆంధ్రులెవరు (1949) అన్న చిన్న పుస్తకంలో.

Andhrulevaru

000

సుప్రసిద్ధ చారిత్ర్యక పరిసోధకులు నేలటూరి వెంకటరమణయ్యగారు 1028-1950 మధ్యకాలంలో రచించి వివిధ పత్రికలలో ప్రచురించిన వ్యాసాల సంకలనం, పల్లవులు చాళుక్యులు.

pallavulu – chaal’ukyulu

000

గుంటూరు శేషేంద్రశర్మగారి నరుడు నక్షత్రాలు పుస్తకంలో విజ్ఞానశాస్త్రంగురించిన వ్యాసాలతోపాటు, సాహిత్యవ్యాసాలు కూడా ఉన్నాయి.

narudu seshendrasarma

000

కొమ్మఱ్ఱాజు వెంకటలక్ష్మణరావుగారు హిందూదేశకథా సంగ్రహము (1909) నేనింకా చదవలేదు కనక దీన్నిగురించి ఏమీ చెప్పలేను కానీ లక్ష్మణరావుగారు సుప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత, సంఘసంస్కర్త అని మాత్రం తెలుసు. భండారు అచ్చమాంబగారి అనుంగు సోదరులు.

hin’duudeisha kathaa san’grahamu prathama

000

ఏటుకూరి బలరామమూర్తిగారి aan’dhrula san’qs-ipta charitra

000

మనసంప్రదాయంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిభావంతంగా ముదివేడు   ప్రభాకరరావుగారు ఆష్కరించిన గ్రంథం.

Bharatiya Sampradaya Bhumika Bhinnatvam lo

000

archive.org సౌజన్యంతో.

000

(మే 16, 2020)