www.thulika.net సైటులో ఏడేళ్ళపాటు విరామం తరవాత ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాను. తిరిగి చూసుకోడం చాలా సంతోషంగా ఉంది.
Policy, submission guidelines ఈనాటికి అనుగుణంగా మార్చేను. పాలగుమ్ని పద్మరాజుగారి అమ్మాయి సీత పద్మరాజుగారి కథ హెడ్మాష్టరు కి అనువాదం చదివి స్పందించడం సంతోషం. ఇది Sharada Murali (Australia)గారు చేసిన అనువాదం.
పోతే, ఇతర విశేషాలు. Follow button చేర్చడానికి ప్రయత్నిస్తున్నాను కానీ చేతకాలేదు. కొన్ని కథలు corrupt అయిపోయినట్టున్నాయి. సర్వరులు అటూ ఇటూ మార్చడంలో. సాంకేతికంగా నా అసమర్థతకారణంగానే. అందుకు ఆయా రచయితలకు క్షమాపణలు. వారిదగ్గర కాపీ ఉంటే నాకు పంపిస్తే మళ్ళీ ప్రచురిస్తాను.
అలాగే guidelines చూసి, తదనుగుణంగా కథలు ఎంచుకుని, అనువాదాలు పంపితే చూడగలను.. హెచ్చరిక. ఇంతకుపూర్వం ప్రచురించిన కొన్ని కథలు నిజానికి నాధ్యేయాానికి అనుగుణంగా లేకపోయినా ప్రచురించేను. ఇకమీదట మాత్రం మరింత జాగ్రత్తగా ఉంటాను.
ఈసందర్భంలోనే, ఇక్కడ తెలుగు తూలికలో కొత్తగా ఏమీ రాయలేకపోతున్నందుకు విచారిస్తున్నాను కూడూ. ఫాఠకులకు క్షమాపణలు, మీ ఆదరణకు అనేకానేక వందనాలతో.
మాలతి