
తెలుగు తూలిక ప్రారంభించి 14 సంవత్సారాలయింది. 2010వరకూ పాఠకుల ఆదరణ బాగానే ఉండేది కానీ తరవాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. అలాగే వ్యాఖ్యలు కూడా బాగా తగ్గిపోయేయి. గత మూడేళ్లగా ఎప్పుడో ఒకటి రెండు తప్ప వ్యాఖ్యలు లేవు. నాక్కూడా రాయాలన్న ఉత్సాహమూ లేదు, రాయడానికి సరుకూ లేదు అనిపించింది.
ఇంక మంగళం పాడేసే సమయం వచ్చిందన్న ఉద్దేశంతో ఏప్రిల్ 2017లో అప్పటివరకూ రాసిన పోస్టులు, అంతకుముందు సంకలనాలలో చేర్చనివి ఇంతే సంగతులు అన్నపేరుతో ఒక సంకలనం వెలువరించేను. కానీ రాసే చెయ్యి ఊరుకోదేమో ఆ సంకలనం వెలువరించిన తరవాత ఇవాళ చూస్తే 200 పైగా పోస్టులు ప్రచురించినవి కనిపించేయి!!
ప్రస్తుతం ముఖపుస్తకంలో కూడా ఇలాగే కృష్ణపక్షచంద్రునిమాడ్కి పాఠకుల ఆదరణ తగ్గుముఖం పట్టడం కనిపిస్తోంది. ఇక్కడ ప్లాట్ ఫారం కూడా వేరు. అంచేత నాకంతగా విచారం లేదు. ఇది కేవలం పొద్దు పుచ్చుకోడానికే అని నిర్ణయించుకున్నాను.
ఆదరిస్తున్న మిత్రులకు మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
తెలుగు తూలిక మీది. మీరే వారసులు ఈ బ్లాగుకి.
మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞురాలిని. ధన్యవాదాలు
ఇట్లు
నిడదవోలు మాలతి వ్రాలు
డిసెంబరు 2, 2021
000