అన్నమాచార్య చరిత్ర పీఠిక, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

 

వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సాహిత్యంలో విస్తృత పరిశోదనలు జరిపి అనేక మౌలికగ్రంథాలు ప్రచురించిన పండితులు. తి.తి.దే.వారి ఆధ్వర్యంలో తాళ్లపాకవారి వారి వంశచరిత్ర, Continue reading “అన్నమాచార్య చరిత్ర పీఠిక, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు”

చింతా దీక్షితులుగారి కథ సరస్వతీపూజ

విశ్వనాథ సత్యనారాయణగారి సంపాదకత్వంలో జయంతి పత్రిక 1958లో ప్రారంభమయింది. ఒక ఏడాదిపాటు నడిచిందనీ, తరవాత మళ్ళీ మళ్లీ రెండుసార్లు పునరుద్ధరింపబడిందనీ తెవికీలో ఉంది.

ప్రస్తుతం ఇక్కడ పరిచయం చేసిన సరస్వతీపూజ  కథ జయంతి సంపుటి 1, సంచిక 3లో ప్రచురింపబడింది. సంచిక లింకు వ్యాసం చివర ఇచ్చేను. Continue reading “చింతా దీక్షితులుగారి కథ సరస్వతీపూజ”

మన రచయిత్రులు – ఒక పరిశీలన

మహిళాదినోత్సవం సందర్భంగా మరొకసారి ముందుకు తెస్తున్నాను ఈవ్యాసం, కొత్తగా నాబ్లాగు చదవడం మొదలు  పెట్టినవారికోసం.

000

నేను ఇంగ్లీషులో రాసిన  Telugu Women Writers, 1950-75 అన్న పుస్తకానికి  నేపథ్యం వివరించడానికి ఈ వ్యాసం. Continue reading “మన రచయిత్రులు – ఒక పరిశీలన”

Tooth fairy ఉంది అని నమ్మకం కుదిరింది!!

అలవాటుప్రకారం, జోళ్లేసుకుని, తలుపు తాళంవేసి, కారిడారులో మలుపు తిరుగుతుంటే ఓ డాలరు చుట్ట కనిపించింది. లేదు. ఇలా సొమ్ము కళ్ళ బడడం అలవాటు కాదు. అందుకే చెప్పుకోడం. ఇప్పుడే ఇలా ధనలక్ష్మి దర్శనం.

చుట్టూ చూసేను. కనుచూపుమేరలో ఎవరూ కనిపించలేదు. ఒంగి ఆ కాగితపుచుట్ట తీసి విప్పబోతే మరో డాలరూ, మరో డాలరూ, మరో డాలరూ, మరో ఐదూ, మరో ఐదూ … మొత్తం 14 డాలర్లు. హా.

ఒకటో రెండో అయితే ఊరుకోవచ్చు కానీ మరీ 14 అంటే కొంచెం ఎక్కువే కద.

పైగా ఆలోచించు. ఎవరు అలా నోట్లు చుట్ట చుట్టుకు పెట్టుకుంటారు?సాధారణంగా పర్సులో పెడితే మధ్యకి ఒక మడతగా ఉంటుంది. కానీ ఇలా చుట్ట? ఆ మూల వాటాలో 12 ఏళ్ళ అమ్మాయి ఉంది. ఏ బేబీసిటింగు డబ్బులో కావచ్చు. లేదా ఏ నీళ్ళపైపో  రిపేరు చేయడానికి వచ్చిన చికానో పారేసుకున్నాడేమో!

అనేకవిధాల అలోచించి, Laundryగది తలుపుదగ్గర పడి ఉంది కనక ఎవరో లాండ్రీ చేసుకునేవేళ జేబులోంచి జారిపడి ఉంటుందనే నిర్ణయానికి వచ్చి, ఆ తలుపుమీద నోటీసు పెట్టేను

– “సోమవారం ఉదయం 9 గం. కి మీరు 14 డాలర్లు లాండ్రిగదిముందు పారేసుకునిఉంటే

…. నెంబరుకి ఫోను చేయవలెను. లేదా … వాటాకి వచ్చి తలుపు తట్టవలెను” అని.

గంట పోయేక మేనేజరు ఫోను చేసింది, “నీనోటీసు చూసేను. అలా అన్ని వివరాలతో పెడితే, ఎవరైనా రావచ్చు నాదే నాదే అంటూ. ఇంతకుముందొకసారి అలా జరిగింది” అన్నాడు.

“మరి ఏం చేయను?”

“అంత హరికథ కాకుండా, ఎవరైనా సొ్మ్ము పారేసుకుంటే, ఈ నెంబరుకి ఫోను చేయండి సూక్ష్మంగా అని పెట్టు. అప్పుడు ఎంత పారేసుకున్నారు, ఎక్కడ పారేసుకున్నారు, ఎలా పారేసుకున్నారు అని ఆరాలు తీయడానికి వీలు” అన్నాడు.

హమ్మో ఎంత అజ్ఞానం నాది అనుకుని, అతని సలహాప్రకారం మరో నోటీసు పోస్టు చేసేను.

రెండు రోజులయింది.

ఫోను రాలేదు. మామేనేజరే కారిడారులో కనిపించి, “పోన్లెద్దూ 14 అంటే ఎంతకనక. తీసెయ్ ఆ నోటీసు” అన్నాడు.

నేనూ అదే అనుకుంటున్నాను. నాఫోన్నెంబరు అలా ఆ తలుపుమీద ప్రకటించడం నాకు కూడా బాగులేదు. నాగీత బాగుంది ఆ పొద్దు అనుకుని ఊరుకుంటే పోలే అనుకున్నాను.

అదుగో అప్పుడే నాకు tooth fairy మాట మనసులో మెదిలింది.

000

మామూలుగా చిన్నపిల్లలకి ఆ ఊడిపోయిన పన్ను తలగడకింద పెట్టుకు పడుకుంటే మర్నాడు పొద్దున్న టూత్ ఫేరీ బహుమతి దొరుకుతుందని చెప్తారు ఊరడింపుగా. అన్నట్టుగానే ఓ కాన్డబ్బు దొరుకుతుంది మర్నాడు ఉదయం.

ఈమధ్య కొంతకాలంగా ఓ పన్ను ఉన్నానంటూ నాకు దినదినమూ గుర్తు చేస్తోంది. తింటున్నప్పుడు కాదు, పలు దోమువేళ. అదైనా పెద్ద నొప్పి కాదు. ఊరికే నరాలకి తగిలినట్టు చిన్న కుదుపు.

దంతదైవాన్ని దర్శించుకోవాలి. హ్మ్.

అమ్మాయి ఊరినించి వచ్చేక …

రెండు రోజులు పోయేక మరో హెచ్చరిక. ఇగుళ్లు వాచినట్టు.

అమ్మాయి పాపం రెండువారాలు పనితో అలసిపోయుంటుంది. రెండు రోజులు పోయేక చూడాలి.

పళ్ళు తోముకుంటుంటే సింకులో ఎరుపుజీర.

తప్పదు రేపు పిలవాలి అమ్మాయిని.

హుం. నోట్లో పన్ను ఊగుతున్నట్టుంది.

హాహా. పట్టుకోబోతే టుపుక్కున ఊడి వచ్చేసింది పిల్లల పాలపళ్ళలా.

శనొదిలిపోయింది. డాక్టరుఖర్చు తప్పిపోయింది.

000

నాకిది రెండో బాల్యం కనక మరో రెండు కాన్డబ్బులు ఎక్కువ దొరికేయి.

నిజం. టూత్ ఫేరీ ఉంది!!

000

(ఫిబ్రవరి 22, 2020)

 

 

మైత్రికి నిర్వచనం

“నీకు స్నేహితులు లేరా?”

మా బిల్డింగులో ఉన్న, నాకు కొన్నేళ్ళగా పరిచయం ఉన్న ఒక అమ్మాయి అడగడంతో నాకు అసలు స్నేహం అంటే ఏమిటి అన్న సందేహం కలిగింది. Continue reading “మైత్రికి నిర్వచనం”

ధైర్యం

“నాసంగతి మీకు తెలీదు,” అన్నాడతను విసురుగా గేటుతలుపు తోసుకుని లోపలికొస్తూ.

వరండాలో వాలుకుర్చీలో కూర్చునిఉన్నాను. తలెత్తి అతనివేపు చూసేను. Continue reading “ధైర్యం”