గంగాప్రవాహం

మగవాడిహృదయం గండ్రశిల

స్త్రీహృదయం గంగాప్రవాహం Continue reading “గంగాప్రవాహం”

ప్రకటనలు

మనకి స్వాతంత్ర్యం ఎందుకు?

స్వాతంత్ర్యం వచ్చేక సాధించినదేమిటి?

అసలు మనకి స్వాతంత్ర్యం ఎందుకు? Continue reading “మనకి స్వాతంత్ర్యం ఎందుకు?”

అడివి బాపిరాజుగారి కథలు, నవల

1940వ దశకంలో భావకవిత్వం ప్రముఖంగా వెల్లివిరుస్తున్నరోజులలో భావకవులకథలు, నవలలలో ఆ భావకవిత్వపు ఛాయలు విస్తృతంగా కనిపిస్తాయి. అలాటి రచయితలలోఅడివి బాపిరాజుగారు ఒకరు. సుకుమారమైన మనోగతభావాలు, Continue reading “అడివి బాపిరాజుగారి కథలు, నవల”

చిన్నకష్టం చాలు బతుకుతీరు మార్చేయడానికి!

జలజాక్షి ఆలోచనలో పడింది. యోగాసనాలు వేస్తూ ఒంటికాలిమీద నిలబడేసరికి కలుక్కుమంది. సరే రెండోకాలు దింపి, మళ్ళీ ఎత్తబోతే, మోకాలు చివ్వున లాగింది. Continue reading “చిన్నకష్టం చాలు బతుకుతీరు మార్చేయడానికి!”

నిరీక్షణ

చిన్నప్పుడు స్కూల్ బస్సుకోసం
చల్లని సాయంత్రాలకోసం
ఆ సాయంకాలం సముద్రతీరాన
ఇసుకలో కట్టే పిచిగ్గూళ్లకోసం
ఆ గూళ్లలో చేరే పిట్టలకోసం

పెద్దపండుక్కోసం
పట్టుపరికిణీకోసం
గోదావరి ఆనకట్టపై
పరుగుల్తీసే రైలుబండీకోసం
ఆరైలుబండీకమ్మీల్లోంచి
చిమ్మచీకట్లు చీల్చుకుంటూ
వెలుగులు కురుసే దీపాలతోరణాలకోసం

ఏతావాతా
చదువుల్తెచ్చే డిగ్రీలకోసం
ఆ డిగ్రీలిచ్చే ఉద్యోగాలకోసం
ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లకోసం
ఆప్తుల ఆమోదముద్రకోసం

నాలుగువీధులకూడలిలో పచ్చవెలుక్కోసం
మనసిచ్చి మాటాడే మనిషికోసం
అలనాటి మిత్రము కాకమ్మచేతనైన పంపే ఊసులకోసం
ఋజువైన చెలిమికోసం

ఎండకోసం
వానకోసం
ఆకురాలు కాలంలో
కొమ్మలు చిమ్మే చిత్రవిచిత్ర సోయగాలకోసం
మళ్లీ మళ్ళీ మొలకెత్తే చివుళ్లకోసం

ఎదురుచూస్తున్నాను అర్ధశతాబ్దిగా
మూడంతస్తులమేడల్లో
ఐదంకెల ఆదాయాల్తో
కోరితెచ్చుకున్న ఈతిబాధల్తో
వాలుకుర్చీల్లో విలాసంగా వెనక్కి  వాలి
భారతీయసాంప్రదాయం
వైరాగ్యం ఔన్నత్యం గూర్చి
వివరిస్తుంటే వింటున్నాను ఓపిగ్గా.

తరంగాలెళ్తే స్నానం చేస్తానంటూ
సముద్రపొడ్డున ముడుచుక్కూచున్న  బడుగుబాపడిలా
ఎదురుచూస్తున్నాను.

ఏ ఉద్గ్రంథానికో
అస్తవ్యస్తంగా రాస్తున్న
నాందీప్రస్తావనలా వుంది జీవనహేల.
తుదిపలుకు వ్రాయడం మొదలు పెట్టాలింక.
*

(తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో, తెలుగువెలుగు, 2003, లో ప్రచురితం.

చిన్న చిన్న మార్పులతో సంస్కరించి.  27 జులై 2019)

కార్పణ్యము

దొరగారి ఏడంతస్తులభవనంముందు సరదాగా తిరుగుతున్న తెల్లపిల్లి గేటుకవతల తచ్చాడుతున్న మచ్చలపిల్లిని చూసింది.

నీలిరంగు పిల్లికళ్ళు చిట్లించి చూసింది. Continue reading “కార్పణ్యము”