మాయా ఏంజెలో

ఆత్మశాంతికోసం

నేను చదివి, ఆనందించిన, ఆనందించగలిగిన  బహుకొద్ది సమకాలీన అమెరికన్ రచయిత్రులలో మాయా ఏంజెలో ఒకరు. సర్వకాలీనమైన, సర్వజనీనమైన నీతులు నిర్ద్వందంగా చెప్పగల రచయిత్రి. నాకు సరిగా గుర్తు లేదు కానీ సుమారుగా ఒక ఇంటర్వూలో అన్నమాటలు –

I know if I was on a bus with a few white men, I would be the first to be thrown under the bus  అని.  మార్పు కావాలనీ, మార్పు వచ్చేసిందనీ మురిసిపోవడం కాదు, వాస్తవదృష్టి కూడా అవసరం అని ఆమె నమ్మకం.

నిన్ననే చూసిన మరొక ఆమెవ్యాఖ్య – I’ve learned people forget what you have said, people forget what you did, but people will never forget how you made them feel.

ఆమె రచనల్లో ఈ కోణం – పాండిత్యప్రకర్ష కాక చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి వెలిబుచ్చిన అభిప్రాయాలు నాకు చాలా నచ్చేయి.

ఈమె అభిప్రాయాలగురించి మరికొంచెం యిక్కడ

ప్రకటనలు

దుష్టుడి మనోవేదన – ఒక నవల

ఒక నవల మొదటిమారు చదివినప్పుడు కలిగిన ఉత్సాహం, ఆనందం, రెండోమారు అరవై ఏళ్ళతరవాత చదివితే ఉండదు సాధారణంగా . కారణం అదే వస్తువుతో రాసినకథలు అప్పటికి చాలా చదివి ఉంటాం. కథ ముందే తెలుసు కనక ఏమవుతుందో అన్న ఎదురుచూపు ఉండదు. రెండోది, వయసు, అనుభవాలమూలంగా అభిరుచులు మారిపోతాయి. Continue reading “దుష్టుడి మనోవేదన – ఒక నవల”

తెల్లతోలు గల నల్లవాడి ఆంతర్యం

An Autobiography of an ex-Colored Man అన్న పుస్తకం రెండు రోజులక్రితం పూర్తి చేసేను. ఆదిలోనే హంసపాదన్నట్టు అసలు ఈ పుస్తకంపేరే నాకు వింత. ఇది రచయిత ఆత్మ కథ అవునా కాదా అన్నది మొదటిప్రశ్న. Continue reading “తెల్లతోలు గల నల్లవాడి ఆంతర్యం”

తెలుపూ, నలుపూ, చామనచాయ కథలు

ఆఫ్రికన్ అమెరికన్ రచయితలకథలు చదివుతుంటే నాకు తోలు రంగు గురించిన ఆలోచనలు మరి కొన్ని కలిగేయి. అమెరికాలో నీగ్రో అన్న పదం నిగ్గర్ అయి, అదొక నిందార్థకం అయిపోయినతరవాత black అన్న పదం వాడుకలోకి వచ్చిందనుకుంటాను. Continue reading “తెలుపూ, నలుపూ, చామనచాయ కథలు”