ఊసుపోక – చేపాటికర్ర

దండం దశగుణం భవేత్ అంటే

విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చఅంధ్యే తమసి వార్ధక్యే దండం దశ గుణం భవేత్‌.

అంటే పక్షులు, కుక్కలు, అమిత్రులు (జాలమిత్రులు కానివారు), పాముల, పశువులబారినుండి తప్పించుకోడానికి, బురదలో, నీటిలో, అందత్వం ప్రాప్తించినప్పుడు, చీకటిలో నడుస్తున్నప్పుడు కర్రసాయం పది విధాలు అని.

దాదాపు 20 ఏళ్లక్రితం చెట్లకింద నడుస్తున్నప్పుడు కనిపించిన ఒకకర్ర ఊరికే ఏరుకొచ్చేను. ఆ తరవాత మంచులో నడుస్తున్నప్పుడు దాన్ని చేతికర్రలా వాడుకున్నాను. విస్కాన్సిన్ వదిలేసినా ఆకర్ర

పారేయబుద్ధి  పుట్టలేదు. ఇప్పుటికీ ఉంది.

 ఈరోజు మామిత్రులు మళ్ళీ  గుర్తుకి తెచ్చేరు ఈ చేపాటికర్ర. 

000

(ఎన్నెమ్మ కతలు 23)

 తెల్లారిలేచి కాఫీకప్పు పుచ్చుకుని కిటికీలోంచి చూస్తున్నాను ఉప్పుపాతరల్లా పరుచుకున్న మంచుకుప్పులు. అమెరికా వచ్చి 35 ఏళ్లయింది. ఇదే తొలిసారి నాకు మంచుని చూస్తే కోపం రావడం. Continue reading “ఊసుపోక – చేపాటికర్ర”

మరిన్ని కబుర్లు రామక్కా అంటే తామరాకా అని!‌

జాలగుంపులవచోవిలాసం అని కూడా అనొచ్చు. నాలుగురోజులక్రితం “రామక్కా అంటే తామరాకా అన్న సామెత” మీద నాకతని ముఖపుస్తకంలో పెట్టేక, అదేవిషయంమీద మరో చుట్టు కొనసాగిద్దాం అన్న సరదా కలిగింది కొత్తగా వచ్చిన జ్ఞానంతో. Continue reading “మరిన్ని కబుర్లు రామక్కా అంటే తామరాకా అని!‌”

ఎన్నెమ్మకతలు 4వ సంకలనం

Picture1ఎన్నెమ్మకతలు సంకలనం నాల్గవ సంకలనం లింకు ఎన్నెమ్మకతలు 4

ఉపసంహారం

ఊసుపోక శీర్షికతో తెలుగు తూలికలో ధారావాహికంగా ప్రచురించిన కతల సంకలనాలు ఈ సంకలనంతో సమాప్తం.  Continue reading “ఎన్నెమ్మకతలు 4వ సంకలనం”

ఎన్నెమ్మకతలు మూడవ సంకలనం

ఊసుపోక శీర్షికతో 2008లో మొదలుపెట్టి హాస్యంగా, వ్యంగ్యంగా, గంభీరంగా, సంభ్రమాశ్చార్యాలతో కలగాపులగంగా అనేక అంశాలమీద వ్యాఖ్యానిస్తూ రాసేను. పాఠకుల స్పందనలు నేను ఆశించనిస్థాయిలో వచ్చేయి. Continue reading “ఎన్నెమ్మకతలు మూడవ సంకలనం”

ఊసుపోక 167- పలకరించే తరువులు!

నాలుగేళ్ళక్రితం నన్ను సదా పలకరించే ఆత్మీయులని నా సహచరులు టపాలో పరిచయం చేసేను కదా. అవి కిలకిల్లాడుతూ గలగల్లాడుతూ తిరుగుతూ మనకి ఉల్లాసం కలిగించేవి.

ఊరు మారేక దృశ్యాలు మారేయి. Continue reading “ఊసుపోక 167- పలకరించే తరువులు!”

166 ఊసుపోక – కాపీ చేయుట ఒక సాహిత్య ప్రక్రియ!

కాపీ చేయుట చాలాకాలము క్రితము కనిపెట్టబడినది. మొదట అతి సాధారణమైనదీ అనాదిగా అభ్యాసములో నున్నదీ చెప్పుకుందాం. అక్షరాభ్యాసం చేసి పిల్లలకి ఓ పలకా బలపం ఇచ్చి అక్షరాలు Continue reading “166 ఊసుపోక – కాపీ చేయుట ఒక సాహిత్య ప్రక్రియ!”