ఆద్యంతాలు (కథ)

“ఏమంటావు?” అన్నాడు పొయ్యిమీద పెనంమీద దోసెలు పోస్తున్న తల్లినుద్దేశించి గోపీ కాఫీ చప్పరిస్తూ. Continue reading “ఆద్యంతాలు (కథ)”

ప్రకటనలు

మధుపర్కాలు, రావూరు వెంకట సత్యనారాయణరావుగారి రచన

జ్ఞానప్రసూనగారు తండ్రి రావూరి వెంకటసత్యనారాయణరావు గారిగురించి చెప్తూ, “ఆయన చేపట్టని ప్రక్రియ సాహిత్యంలో ఏదీ లేదు. ఆయన సాహితీమందిరంలో తలుపువెనకే ఉన్నారు. కీర్తి, ధనము- వీటిమీద నాన్నకి కాంక్ష లేదు,” అని రాసేరు.

వారి కుమార్తె తటవర్తి జ్ఞానప్రసూనగారిని thulika.netలో అనువాదంకోసం నేను అడిగేను. ఆవిడ ఓపిగ్గా టైపు చేసి నాకు పంపించేరు. ఈకథ కృష్ణాపత్రికలో తొలిసారిగా ప్రచురించేరుట. Continue reading “మధుపర్కాలు, రావూరు వెంకట సత్యనారాయణరావుగారి రచన”

నిడదవోలు వంశజులము మేము

సాధారణంగా ఇంటిపేర్లు విన్నప్పుడల్లా చుట్టరికాలు గుర్తొస్తాయి. పరిచయమైన ఇంటిపేరు కనిపిస్తే, ఫలానావారిని తెలుసా అని Continue reading “నిడదవోలు వంశజులము మేము”

చిక్కటి కాఫీ ముచ్చట్లు

మీలో చాలామందిలాగే నేను కూడా కాఫీగత ప్రాణిని. చిక్కని కాఫీ రెండు కప్పులు పడ్డాకే నాకు నిద్ర మొహం వదిలేది. లేకపోతే ఇంకా

Continue reading “చిక్కటి కాఫీ ముచ్చట్లు”

పైచదువులు

అకారణంగానే ఈకథ గుర్తొచ్చింది  నాకు ఈరోజు.

విదేశీ చదువులమీద వ్యామోహం ఆంగ్లపాలనలోనే వచ్చింది. Continue reading “పైచదువులు”

కళ్లు (మరిన్ని కబుర్లతో)

ఈనాటి కబుర్లు –

రెండు రోజులక్రితం నేను ప్రచురించిన ఒక ట్విటరుతో ఈ కథ మళ్ళీ నాముందుకొచ్చింది. ప్రధానంగా నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నది ఒకరికి కలిగిన ఆలోచనలు మరొకరికి కూడా రావచ్చు. కాపీ కొట్టడం ఎంత నేరమో, కాసింత పో లికలు కనిపించగానే అదుగో నారాత నువ్వు దోచేసేవు అనడం కూడా అంతే నేరం.

చక్కగా రూపు దిద్దుకుంది అని నేను అనుకునే కథల్లో ఇదొకటి. శిరసి నయనం ప్రధానం అంటారు కదా.

నా ట్విటరేమిటంటే,

ఇద్దరు మాటాడుకున్నప్పుడు, ఒకరైనా కొత్తగా తెలుసుకున్నదేమీ లేకపోతే అది రెండు స్వగతాలే తప్ప ఒక సంభాషణ కాదు.

దానిమీద నాట్వీటులు అనుసరిస్తున్నఒకతను, “నారచనలు ఇందులోకి లాగొద్దు,” అని వ్యాఖ్యానించేడు.

నాకు అర్థం కాక, “నేను మీ రచనలు చదవలేదు. మీవ్యాఖ్య నాకర్థం కావడంలేదు,” అని తిరుగుజవాబు ఇచ్చేను

ఈలోపున అతను నాపేజీలో పెట్టిన తన జవాబు తొలగించి తనపేజీలో నాట్వీటూ అతనిజవాబూ కూడా ఉన్నాయి. మాఅమ్మాయిని పిలిచి అడిగేను ఏమిటి ఈట్వీటుకి అర్థం అని. తను చూసి, “హాస్యానికి అలా అన్నాడులే” అంది. అతను మాఅమ్మాయి నటించిన ఒక షో రచయిత. అంచేత తనమాట నమ్మాలి.

నాకు మాత్రం అందులో హాస్యం కనిపించలేదు. హాస్యమయితే నాపేజీలో కూడా ఉంచవచ్చు కదా. ప్రస్తుతం అతనిపేజీలో మాత్రమే ఉంది. అతని అనుచరులు నాది తప్పు అనుకునే అవకాశం ఉంది కదా. మళ్లీ కొంతసేపయేక చూస్తే, నాప్రశ్నకి సమాధానంగా ఒక నవ్వూ, ఒక సంతాపమూ ఇమోజీలు కనిపించేయి.

ఇఁతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఈరోజుల్లో కాపీలు మహోధృతంగా జరిగిపోతున్నమాట నిజమే కానీ ఒకొకప్పుడు రచయితలకి స్వతహాగా కలిగిన ఊహలు మరొకరికి మరొకచోట కలగడం కూడా సంభవమే.

ఇప్పుడు నాకథ సంగతి చెప్తాను. ఈ కళ్లు కథ 1967లో రాసింది. అప్పట్లో నిజంగానే ఒక కుర్రాడు, సుమారు 12-14 ఏళ్లవయసువాడు, కళ్ళు లేకపోయినా, రైల్లో పాలకోవా అమ్ముతూ కనిపించేడు. నేను అతనితో మాటాడలేదు. కానీ ఆ సంఘటన మాత్రం నామనసులో నాటుకుపోయింది. మనం అప్పుడప్పుడు ఇలాటివారిగురించి వింటుంటాం. చేతులు లేనివారు నోటితో కుంచె పుచ్చుకు ఎంతో అందమైన బొమ్మలు వేయడం, కాళ్ళతోనే సూదిలో దారం ఎక్కించి గుండీలు కుట్టడం, కాళ్ళతోనే ఇంకా ఎన్నో పనులు చేయగల నేర్పరులగురించి.

ఈకథ రాసేనాటికి నాకు లోకజ్ఞానం తక్కువే. బయటిప్రపంచంతో అట్టే పట్టించుకునేదాన్ని కాను. అంచేత ఏ పేపరులోనో వార్త చూసి రాసింది కాదు. కేవలం నాకు కలిగిన ఊహల ఫలితమే.

ఈమధ్య మిత్రులొకరు ఈకథలో ప్రధానాంశంగురించి అడిగేరు. ఒకరికళ్లు మరొకరికి అమర్చితే, ఆ కళ్ళు పొందినవారి మనస్తత్త్వంమీద దాతమనస్తత్వం తాలూకు ఛాయలు కలగడానికి ఆస్కారం ఉంటుందా అని. ఈకథ ఊహాజనితమే అయినా, అలా జరగడానికి అవకాశం ఉన్నట్టు, ఆవిషయంమీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నట్టు అంతర్జాలంలో వార్తలు కనిపించేయి.

000

కళ్ళు కథ

ఓ చల్లని సాయంవేళ గోపాలరావు షికారుగా నెమ్మదిగా ఏవేవో భావాలు కలకలుపుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. వెనకే సుమిత్ర సప్తపాదాలు తొక్కుతున్నట్టు అనుసరిస్తుండగా, Continue reading “కళ్లు (మరిన్ని కబుర్లతో)”