అలనాటి చెలికి ఆఖరిఉత్తరం

ప్రియమైన జయసూర్యబాలాకుమారికి,

నీ ఉత్తరాలు అందేయి

నీ ఘనవిజయాలూ, నీ పిల్లల అభ్యున్నతి తెలివిడి అయింది.

మనం కలుసుకుని అర్థశతాబ్దం పైమాటే కదూ

నామనోవీధిలో ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఆనాటి కతలూ వెతలూను.

 

అన్నట్టు నీకు తెలీని సంగతి నాకు prejudices ఎక్కువేనన్నది.

నువ్వు నాకొనరించిన మేలు, కలిగించిన నొప్పి గుర్తున్నాయి

అలాగే నేను నీకు చేసిన సాయాలు, నిన్ను పెట్టిన హింసానూ

జీడిమరకల్లా  స్థిరంగా తిష్ఠ వేసేయి నామనోఫలకంపై.

మంచయినా చెడయినా మరిచిపోలేను నేను మరి.

అప్పట్లో నీ ప్రతి చేష్టకి జేజేలు కొట్టిన ఓపిక కొరత పడిందిప్పుడు.

నాకు ముదిమి వచ్చేసినట్టేనని సాధికారకంగా ప్రకటించుకుంటున్నాను.

నువ్వింకా అప్పటి బాలాకుమారివే మరి.

మొదట్లో అద్భుతం అన్నాను కదూ నీమొదటికథకి మూడో బహుమతి వచ్చినప్పుడు.

నీతొలిచూలు కుమారజననం విని హర్షాతిరేకంతో తలమునకలయేనని చెప్పినట్టే గుర్తు.

నాలుగోసారి బహుమతికో సత్కారానికో కాబోలు అహో ఒహో అంటూ ఊః సంబరపడిపోయేను.

తొమ్మిదోసారి ఓహో అన్నాను.

యాభై ఏళ్ళ తరవాత, ఈరోజుల్లో బహుమతులు ఎవరికి రావు కనక అనిపిస్తోంది.

ఈనాడు ఘనసంపాదనలు లేని పిల్లలెక్కడున్నారులే అన్న తేలికభావం కూడా అలాగే.

లేదింక నేను జయజయధ్వానాలు చేయలేను.

నీకిది అర్థం కాదు కనక నేనే చెప్పకతప్పదు.

నువ్వూ నేనూ చీలిపోయి చెరో దిక్కూ చాలా దూరం వచ్చేసేం.

నీ ఉత్తరాలు మోసుకొచ్చే శుభవార్తలు అతకడం లేదిప్పుడు టపాలకింద వ్యాఖ్యల్లాగే.

అప్పటి నాకూ ఇప్పటి నాకూ పోలికే లేదు.

ఇప్పటి నేను నీకు తెలీదు.

నువ్వు మాత్రం మారలేదు

అందుకే నాతో భేటీ కుదరదింక.

అప్పట్లా నేను నీ ప్రతికబురుకీ ఉప్పొంగిపోలేను, మన్నించు,

మరి ఉంటానింక.

మనకథ ఇంతటితో సమాప్తం.

ఇదే నీకు నాఆఖరి ఉత్తరం.

ఇట్లు

మరో మాలిని

000

(రచయితమాట – కొన్ని దశాబ్దాలతరవాత కొందరు అనుభవాలమూలంగా, జీవితంలో తమ ఎదుర్కొన్న సంఘటనలమూలంగా మారిపోతారన్న సంగతి చిన్ననాటి స్నేహితులు గుర్తించరు అన్న ఆలోచనకి ఇది అక్షరరూపం.)

ooo

(ఆగస్టు 30, 2020)

90వ దశకంలో రాసుకున్న కవితలు

మమదేహి కరావలంబం

మిస్సింగ్ లింకులు మూడు

రెండోకవితలో ఆరుద్ర చెప్పినట్టు అన్నది పొరపాటు. రావిశాస్త్రిగారి కథ ఆఖరిదశ అని అనిపిస్తోంది ఇప్పుడు.

(నవంబరు 14, 2019)

బతుకు విభవం (కవితలు)

బతుకువిభవం

కొన్ని దశాబ్దాలు గడిచేక

జీవనసూత్రాలు మారిపోతాయి. Continue reading “బతుకు విభవం (కవితలు)”

అనుమాననివృత్తి

ఎన్నో ఏళ్ళగా ఈదారిని నడుస్తూనే ఉన్నా
ఎందుకో నిన్ననే నాకన్నుకానింది.
క్షణకాలం ఆగి పరీక్షగా చూడాలనిపించింది. Continue reading “అనుమాననివృత్తి”