గోరాశాస్త్రిగారి పారిజాతం కధ

చందమామ అంటే కుటుంబరావుగారిలాగే, గోరాశాస్త్రిగారంటే తెలుగు స్వతంత్ర.
తెలుగుస్వతంత్ర అంటే మాకాలపు రచయితలకీ పాఠకులకీ కూడా కల్పవృక్షం. Continue reading “గోరాశాస్త్రిగారి పారిజాతం కధ”

ప్రకటనలు

 రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి కథ, ఆఖరిదశ

మూడవ ప్రపంచయుద్ధం వస్తుందా?

– ఈ ప్రశ్న ఇటీవల చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. Continue reading ” రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి కథ, ఆఖరిదశ”

రచయితలకి ప్రోత్సాహం, సాహిత్యాభిమానులు

“మంచి రచయితలను గొప్ప రచయితలుగా ముద్ర వేస్తే వారు సాధారణ రచయితలైపోయే ప్రమాదం ఉంది. రచయితలు పేరు, డబ్బు మీద మాత్రమే దృష్టి పెడితే మంచి రచనల నాణ్యత తగ్గిపోతుంది” అన్నారు బలివాడ కాంతారావుగారు (యోహన్ బాబుగారి ఇంటర్వ్యూ). Continue reading “రచయితలకి ప్రోత్సాహం, సాహిత్యాభిమానులు”

కాశీరత్నం, నా అభిప్రాయాలతో

ఈమధ్య పువ్వులబొమ్మలు, ఒకొకప్పుడు అర్థవంతమైన వ్యాఖ్యలు జోడించి ముఖపుస్తకంలో ప్రచురిస్తున్నాను. మామిత్రులస్పందనలు Continue reading “కాశీరత్నం, నా అభిప్రాయాలతో”

సంస్కారం అంటే?

ఇది నాకు కలిగిన సందేహం మాత్రమే. నేను జవాబు రాయడం లేదు. మీరు చెప్పండి, కథ అర్థం చేసుకునే సంస్కారం అంటే  ఏమిటి. మీదృష్టిలో  ఒక కథ అర్థం చేసుకోడానికి కావలసిన సంస్కారం ఎలా ఉంటుంది?

వేళాకోళాలు, హాస్యాలు వద్దు. సీరియస్ గా మీ అభిప్రాయాలు చెప్పమని కోరుతున్నాను. మరొకసారి హెచ్చరిక.  ఈ ప్రశ్న కథ అర్థం చేసుకోడంవరకే.  విస్తృతార్థంలో సంస్కారం చర్చ కాదు.

ధన్యవాదాలు.

మంచుదెబ్బ (వివరణతో)

నామాటగా – మళ్ళీ  పాతకథలెందుకు అని కోపగించుకోకండి. చదివినవారు ఇక్కడే ఆగిపోవచ్చు.

ఈకథ ఈరోజు మిత్రులొకరు ఇప్పుడే తొలిసాిరిగా చదివేనని, ఇష్టపడి తమపేజీలో లింకు పంచుకున్నారు. కొత్తపాఠకులు అనేకమంది రంగంలోకి వచ్చేరనడానికి ఇంతకంటే నిదర్సనం అవుసరం లేదు  నన్ను ప్రముఖరచయితలదృష్టిలోకి తెచ్చిన తొలికథ ఇది. ఈకథ కారణంగానే నన్ను ఆంధ్రరచయిత్రులసభలకి (గుడివాడ, వరంగల్)  ఆహ్వానించడం కూడా జరిగింది.

పోతే కథాంశం – పాఠకులకి సహజంగానే జాలి కలగవచ్చు. కానీ ఆకథ రాసినప్పుడూ, ఇప్పుడూ కూడా జాలి కాదు నేను ఆశించింది. (జాలిమీద నావ్యాసం చూసేరు కదా.). అనేకమందికి అనేకవిధాలయిన బాధలు కలుగుతాయి. ఎవరికి వారు ఆ కష్టాలను ఎదుర్కొనె విధానం ఎంచుకుని తమజీవితాలను తీరిచి దిద్దుకుంటారు. ఆనాటి పరిస్థితులవి. ఆ పరిస్థితులలో వకుళ మౌనాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంది. గాంధీగారి సత్యాగ్రహం అంత నిష్ఠతోనూ.

అంచేత మీరు వ్యాఖ్యలు రాస్తే, జాలి మాత్రం చూపకండి. నాకు జాలి అంటే అసహ్యం.  ఈవిషయం స్పష్టం చేయడం మరొక కారణం ఇది మళ్లీ ప్రచురించడానికి.

ధన్యవాదాలు

మాలతి.

00000

పశ్చిమదిక్కున విచ్చలవిడిగా చెలరేగుతున్న శారదనీరదపంక్తుల్ని చూస్తూ డాబామీద నిల్చున్నాను. ఇవేనేమో వప్రక్రీడాగజప్రేక్షణీయంగా కనిపించినవి. నల్లగా బండరాళ్ళలా, కారు ఎనుముల్లా ఉన్న ఆ మేఘాలు అస్తమిస్తున్న సూర్యుడిని దాచ ప్రయత్నిస్తున్నాయి. సూర్యనారాయణుడు ఆల్లరిపిల్లవాడిలా ఆడుగునుంచే చేతులు చాపుతున్నాడు. దివ్యకాంతులు విరజిమ్మే ఘనశ్యామసుందరుడు ఇలాగే ప్రకాశించేడు కాబోలు. అంత ఎత్తుకు ఎగరలేని రాధ కిందనించి దిగులుగా “నీలీలలకి అమాయికనైన నేనే దొరికేనా?” అన్నట్టు చూస్తుంది కాబోలు .. Continue reading “మంచుదెబ్బ (వివరణతో)”

పాతకథలు మళ్లి ఎందుకంటే

నిన్న నాకు పునర్జన్మ ఎత్తినంత ఆనందంగా గడిచింది. మిత్రులకు నామనఃపూర్వక ధన్యవాదాలు.

నేను ప్రచురిస్తున్న నావెనకటి కథలకి ఇంత ఆదరణ రావడం విశేషమే. ముఖ్యంగా ఒక అంశంతీసుకుని వచ్చిన వ్యాఖలు నాకు అరుదు. Continue reading “పాతకథలు మళ్లి ఎందుకంటే”