నిన్నటి మహానుభావులు

(మార్పు 50)

ఏం తోచడంలేదని మళ్ళీ పెద్దక్కయ్యగారింటికి వెళ్ళేను. అక్కడే సిరి కూడా ఉంది.

“రా, రా,” అంది సిరి పక్కకి జరుగుతూ.

“ఏంటి విశేషాలు?” అంది పెద్దక్కయ్య.

“ఏం లేదు. ఈమధ్య వీరేశలింగంగారి ఆత్మకథ చదువడం మొదలు పెట్టేను,” అన్నాను నవ్వుతూ.

“హా!!” అంది సిరి కళ్ళు పెద్దవి చేసి. Continue reading “నిన్నటి మహానుభావులు”

ప్రకటనలు

మార్పుకి నిదర్శనం

(మార్పు 48)

తెల్లారిలేస్తే, పొద్దు పోయేవరకూ ఒకరోజుకీ మరోరోజుకీ తేడా లేదనుకుంటూ గడుపుకుపోతుంటే, ఒకొకరోజు హఠాత్తుగా పెద్ద సుడిగాలీ, తుఫానూ వచ్చినట్టు ఒక చిన్నమాట మనని కుదిమట్టంలోంచి కుదిపేయగలదు. Continue reading “మార్పుకి నిదర్శనం”

జనపదము

(మార్పు 48)

ఏది మంచి కథ, లేదా ఒక కథ మంచికథ అవునో కాదో ఎలా నిర్ణయిస్తాం అన్నది తరతరాలుగా మనందరినీ వేధిస్తున్న సమస్య. రాసేవాళ్ళు నేను మంచికథ రాసేనా లేదా అని ఆలోచిస్తే, చదివేవాళ్ళు ఇది మంచికథేనా, చదువుదామా వద్దా అన్నప్రశ్నతో కుస్తీ పడుతున్నారు. సాహిత్యం అంటే హితముతో కూడుకున్నది అంటారు కానీ నాకు మాత్రం సందేహాలతో కూడుకున్నది అనిపిస్తోంది. అన్నట్టు అనుమానం అంటే ప్రశ్నలూ, జవాబులూ, అంటే చర్చ అంటే నిర్ధారణగా తెలుసుకోడానికి అనుసరించవలసిన పద్ధతులు – మనకి కళ్లకి కనిపించేవీ, ప్రశ్నించడంద్వారా గ్రహించుకునేవీ, Continue reading “జనపదము”

కవితాత్మ నీలినీడలు

(మార్పు 47)

లీల రాసిన ఉత్తరం పట్టుకుని వరండాలో కూర్చున్నాను.

ఎండలు తగ్గేయి కానీ చలి మరీ అంతగా గజగజలాడించేయడం లేదు. అసలిక్కడ అంత చలి రాదంటున్నారందరూ. రెండేళ్ళక్రితం పడినమంచు విచిత్రమేన్ట. ఈయేడెలా ఉంటుందో … అయినా ఏదయితే మాత్రం ఏం చేస్తాం భరించడం తప్ప. కనీసం ఇవాళ్టికి నీరెండ గోరువెచ్చగా మనసుకి ఓదార్పుగా ఉంది. ఈ చల్లదనమూ శాశ్వతం కాదు. ఎండలు మళ్లీ రెచ్చిపోకా తప్పదు. బతుకంతా ఇంతే, ఎండలూ, వానలూ, చలీ, ఎండలూ, వానలూ, చలీ, ఎండలూ …

మళ్ళీ చేతిలో కవరువేపు చూసేను. Continue reading “కవితాత్మ నీలినీడలు”

జంతు నీతి

(మార్పు 46)

అమానుషం?!!! అంటే మానవులకి ఉండకూడని నీతి. జంతువులకి ఉండగల నీతి అని కూడా అనిపిస్తుంది. మ్.

నదివెంట పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే అనేక ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి నామనసులో.

Continue reading “జంతు నీతి”

మార్పు సింహావలోకనం

2010 డిసెంబరులో నేను ఈ మార్పు ధారావాహిక ప్రారంభించినప్పుడు చెప్పేను ఇది ఎలా సాగుతుందో అన్నవిషయంలో ఒక నిశ్చితమైన ఆలోచన లేదని. అప్పట్లో దేశం ఆమూలనించి ఈ మూలకి – ఉత్తరపు కొసనించి దక్షిణపు కొసకి – వచ్చి పడగానే దాదాపు ఇండియానించి అమెరికా వచ్చినరోజులు తలపుకొచ్చేయి. సంస్కృతిపరంగా అంత తేడా ఉంది ఈ రెండు ప్రాంతాల్లోనూ, ఇండియాలోలాగే. ఆ అనుభవం అక్షరగతం చెయ్యాలని అనుకున్నాను. Continue reading “మార్పు సింహావలోకనం”

మార్పు 45

లీల మెట్లెక్కి రెండో అంతస్థులో ఉన్న పెద్దక్కయ్య వాటాముందు అడుగు పెట్టబోతూ అక్కడ పరిస్థితి చూసి ఉలిక్కిపడి ఒకడుగు వెనక్కి వేసింది. తరవాత నెమ్మదిగా అక్కడున్న గలీజులో అడుగు పడకుండా చూసుకుంటూ, తలుపు దగ్గరికి చేరి తలుపు తట్టింది. నాలుగు క్షణాలతరవాత పెద్దక్కయ్య తలుపు తీసి, రా, అంటూ వెనక్కి ఒకడుగు వేసి, లీల లోపలికొచ్చింతరవాత తలుపు మళ్ళీ వేసేసింది, “నువ్వొస్తానని ఫోను చేస్తే రావొద్దని చెప్పి ఉండేదాన్ని,” అంది. Continue reading “మార్పు 45”