మార్పు 3

జాకీ మిలార్ కి క్షమ కవచం మాత్రమే కాదు. పరమదుర్మార్గులలో కూడా మానవత్వం మేలుకొలిపి, వారిని మనుషులని చేయగల పరమౌషధం.

ఐదారేళ్ళక్రితం జూడీ తన స్నేహితురాలు జాకీ మిలార్‌గురించి చెప్పి పుస్తకం రాస్తున్నానని చెప్పినప్పుడు నాకు ప్రత్యేకంగా అనిపించలేదు. పుస్తకప్రచురణ అయినతరవాత నాకో కాపీ ఇచ్చినప్పుడు కూడా నేను వెంటనే చదవలేదు. Continue reading “మార్పు 3”

ప్రకటనలు

మార్పు 2

“ఎక్కడికి మార్తావు?” – తొలి ప్రశ్న.

ఏమో… పక్కఊరికి కాపోతే ఊళ్ళోనే ఈకొసనించి ఆకొసకి, ఈ వీధినించి మరోవీధికి … ఎక్కడికైనా సరే మారాలి. అంతే. నాక్కావలసింది మార్పు. అంతే. ఎక్కడికి అన్నది నాక్కూడా తెలీదు.

అడిగినవాళ్ళు నవ్వేరు. కుక్క తోకని వేటాడినట్టుందని అనలేదు కానీ అలా అనుకుని ఉండడానికి అవకాశాలున్నాయి! Continue reading “మార్పు 2”

మార్పు 1

దాదాపు నాలుగు నెలలయిపోయింది మంచి కథ రాద్దాం అనుకుంటూనే. ఏదో రాయాలనే కానీ ఏం రాయాలన్నది తెలీడం లేదు. అంచేత నాకు తోచిందంతా రాసేద్దాం అనుకుని మొదలు పెట్టేనిది. ఇది నవల కాకపోవచ్చు. ఈమధ్య ఊసుపోక కూడా అట్టే సాగడంలేదు. అంచేత దానికి ఇది మరో రూపం అన్నా తప్పు లేదు. దేశం ఆమూలనించి ఈమూలకి వచ్చి పడ్డాక, అమెరికా మరోసారి కొత్తగా కనుగొన్నట్టుంది! Continue reading “మార్పు 1”