వెనకటి నేను 6 – అసలైన విషాదం (కథ)

3-28-1973 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన కథ.
———-  Asailaina

నాకు మనుషులంటే సరదా. Continue reading “వెనకటి నేను 6 – అసలైన విషాదం (కథ)”

వెనకటి నేను 5 – ఆర్చేవారూ ఓదార్చేవారూ (వ్యంగ్యరచన)

మార్చి 6, 1959లో వనితాలోకం శీర్షకలో ఆంధ్రపత్రిక, వారపత్రికలో ప్రచురించిన వ్యాసం.

ఆరోజుల్లో ఎప్పటికేది తోస్తే అదే రాసి పారేయడం అక్షరాలా, పత్రికలవారు వెంటనే ప్రచురించేయడం జరిగేది కనక ఈ వ్యాసం మరేమీ తోచక హాస్యానికి రాసిందే. మరే దురుద్దేశమూ లేదు. ‘ఆరుస్తావా తీరుస్తావా అక్కరకొస్తే మొక్కుతావా’ అన్న జాతీయందృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది కానీ, ఆ మూడో భాగం – అక్కరకొస్తే మొక్కుతావా – అన్నది ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఇప్పటికీ. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పమని కోరుతున్నాను.

దీనిమీద వచ్చిన వ్యాఖ్యలు కూడా జత పరుస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను వాడిన ఇంగ్లీషుపదాలగురించి వచ్చిన వ్యాఖ్యానం నాకు అప్పట్లో అంతగా హత్తకపోవడం గమనార్హం!

వ్యాసానికి లింకు – Arche vaaru2

వ్యాఖ్యలకి లింకు – Arche vaaru comments


(డిసెంబరు 10, 2014)

 

వెనకటి నేను 4 – గీర్వాణి (కథ)

డిసెంబరు 1, 1954 ఆంధ్రమహిళలో ప్రచురితమైన ఈ కథ కథానిలయం సైటులో చూసేవరకూ నాకు గుర్తు లేదు. కథానిలయంవారికీ, రమణమూర్తిగారికీ మనఃపూర్వక ధన్యవాదాలతో, మీకు అందిస్తున్నాను.

ఆరోజుల్లో గీర్వాణం అన్నపదం గర్వం, గోరోజనం అన్న అర్థంలో వాడడం విన్నాను. ఈకథలో చివరివాక్యం అలా వాడేను. ఇప్పుడు తెలుసనుకోండి గీర్వాణి అంటే సరస్వతీదేవి అని, గీర్వాణభాష అంటే సంస్కృతం అనీ. ఇలాటివి చూసుకోడానికి ఈ పాతకథలు పనికొస్తున్నాయి. -:)

కథానిలయంలో PDF file లింకు – ఇక్కడ

 


(డిసెంబరు 7, 2014)

 

వెనకటి నేను – 3. పగటివేషాలు (నాటిక)

నేటికి ఏడేళ్ళక్రితం ఈ బ్లాగు మొదలు పెట్టేనని బ్లాగుస్వాములు (వర్డ్ ప్రెస్) పంచాంగం చెప్పేరు. ఆనాటినించి ఈనాటివరకూ నాబ్లాగువేదనలని ఆదరిస్తూ వచ్చిన పాఠకులకు శత సహస్ర నమోవాకములు.

pagativeshaluPNG

ఈ వెనకటి నేను శీర్షికలో 48 ఏళ్ళక్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన నాటిక పెడుతున్నాను.  పిిడియఫ్ ఫార్మాట్ కన్నులపండువగా తీరిచి దిద్దిన కథానిలయం వారికి ధన్యవాదాలు.  ఆనాటి ఆంధ్రప్రభలో పై బొమ్మ వేసిన చిత్రకారునికి ధన్యవాదాలు.

ఈ లింకుమీద నొక్కండి – పగటివేషాలు

 

(డిసెంబరు 1, 2014)

 

వెనకటి నేను 2 – బాలతార (కథ)

(42 ఏళ్ళ వెనక!)
“ఏరోజు పేపరు చూసినా చచ్చిపోయినవాళ్ళూ, తప్పిపోయినవాళ్ళూ, ఏక్సిడంట్లూ, ఎడ్వర్టైజుమెంట్లూను,” రామకృష్ణ విసుగ్గా పేపరు కింద పడేశాడు. Continue reading “వెనకటి నేను 2 – బాలతార (కథ)”