What is a Good Story?

నేను  అక్టోబరు 2014లో రాసి thulika.netలో ప్రచురించిన  ఈ వ్యాసం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ఇంతవరకూ ఇక్కడ ఇంగ్లీషువ్యాసాలు ప్రచురించలేదు కానీ పైన చెప్పినట్టు కొంత  ఆసక్తి ఈ వ్యాసంలో చూపడంచేత, నావ్యాసాలు నాబ్లాగులో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ ప్రచురిస్తున్నాను.
ఆదరిస్తున్న పాఠకులకి ధన్యవాదాలు.
000

Continue reading “What is a Good Story?”

ప్రకటనలు

తూలిక.నెట్ పునరుత్థానం

తూలిక.నెట్ అంతరించడానికి కారణాలు అని మొదలు పెడదాం అనుకున్నాను వారం రోజులక్రితం. తూలిక.నెట్ చూస్తున్నవారు గమనించే ఉంటారు దాదాపు నెలరోజులక్రితం అక్కడ ప్రకటించేను ఆ సైటు నడపడం కష్టంగా ఉందని. నా ఈతిబాధలు, ఆలోచనలు సాగకపోవడం అలా ఉండగా, సాంకేతికబాధలు అంతకంతా అయి, Continue reading “తూలిక.నెట్ పునరుత్థానం”

తూలిక.నెట్ ఆగస్టు సంచికలో రెండు కథలగురించి

ఒకొకప్పుడు కథ రాసి ప్రచురించడం అయిపోయినా, కథ అయిపోదు. ఆ ఇతివృత్తం రచయితమెదడులో తొలుస్తూ రాత్రింబవళ్లు గొడవ చేస్తూ ఉంటుంది. ఆ ఇతివృత్తం తనకి చాలా ప్రీతిపాత్రమయితేనూ, తనకథలో అది సంతృప్తికరంగా ఆవిష్కరించడం జరగలేదు అనిపిస్తేనూ, ఆ బాధ మరింత ఎక్కువ. నిల్చోనివ్వదు, కూర్చోనివ్వదు తిరిగి దాన్ని పునరుద్ధరించేవరకూ.   Continue reading “తూలిక.నెట్ ఆగస్టు సంచికలో రెండు కథలగురించి”

అచ్చమాంబగారిమీద ఇంగ్లీషు వ్యాసం

అబలా సచ్చరిత్ర రత్నమాల మొదటి సంపుటిలో అచ్చమాంబ గారు స్వయంగా రాసిన పీఠిక, ఆవిడ జీవితచరిత్ర చూసిన తరవాత నేను ఇంతకుముందు ఇక్కడ పెట్టిన టపా చాలా అసమగ్రంగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఇక్కడే రాయడం నాకు సమ్మతం గాదు కనకనూ, ఇంగ్లీషు తూలికలో కొత్త టపాలు పెట్టి తొమ్మిది నెలలు కావడంచేతనూ, ఇంగ్లీషులో మరింత విపులంగా రాసి పెట్టేను.

జీరాక్స్ కాపీలో పై భాగాలు చాలా గజిబిజిగా ఉన్నాయి. అట్టే అచ్చు తప్పులే భరించలేనివాళ్ళకి అది పూర్తిగా అగమ్యగోచరం. అంచేత కూడా మీరు ఇంగ్లీషు వ్యాసం చూడవలసిందిగా కోరుతున్నాను. :).

తద్ లింకు – The outstanding life and works of Bhandaru Acchamamba

ధన్యవాదములు మీ సహనానికి.

గమనిక. వర్డ్ ప్రెస్ కొత్తగా పెట్టిన నియమం ప్రకారం, వారి ఖాతా ఉన్నవారందరూ ఆ ఐడి, తదనుకూలంగా సంకేతపదం వాడి తీరాలంట. ఏం డెమొక్రసీయో ఏమో :p

Telugu Penscape – పుస్తకావిష్కరణ విశేషాలు.

హైదరాబాదులో నాఅనువాదాలు మూడవ సంకలనం Telugu Penscape (Anthology of Telugu short stories) లేఖిని మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ వారి ప్రచురణ ఆవిష్కరించేరు. సభ విశేషాలు మాఅన్నయ్య సీతారామారావు పంపిన రిపోర్టు ఇక్కడ ప్రచురిస్తున్నాను. సభలో వక్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు గమనింపదగినవి.

పుస్తకావిష్కరణ

(ఎడమనుండి) శ్రీమతి తమిరిశ జానకి, శ్రీ కళా దీక్షితులు, డా. సి. విజయశ్రీ, డా. పోరంకి దక్షిణామూర్తి, శ్రీ మునిపల్లె రాజు, శ్రీ నిడదవోలు సీతారామారావు, డా. వాసా ప్రభావతి గారలు.

Continue reading “Telugu Penscape – పుస్తకావిష్కరణ విశేషాలు.”

తూలిక.నెట్ చరిత్రలో ఒక దశాబ్దం

నా వెబ్ సైట్ thulika.net అంతర్జాలంలో అడుగెట్టి దశాబ్దం అయింది ఈరోజుకి.

పదేళ్లు! నాకే ఆశ్చర్యంగా ఉంది. నాజీవితకాలంలో ఏ అంతరాయాలూ లేకుండా ఇంతకాలం నేను నిర్వహించిన ఉజ్జోగం – ఆదాయంలేనిదే అనుకోండి – ఇదొక్కటే.     Continue reading “తూలిక.నెట్ చరిత్రలో ఒక దశాబ్దం”