మార్పు 13

ఇక్కడికొచ్చేక మరో పెద్ద మార్పు ఏది కొన్నా రెండోసారీ, మూడోసారీ షాపువాడితో  “యిచ్చిపుచ్చుకోడాలు” చెయ్యాల్సొస్తోంది. మంచం అయితే నాలుగుసార్లు మార్చాల్సివచ్చింది. మారోజుల్లో అంటే అదేలెండి నాచిన్నతనంలో పరుపు అంటే పరుపు అంతే. Continue reading “మార్పు 13”

చరిత్ర, చారిత్రక నవల

చరిత్రంటే తారీకులూ దస్తావేజులూ కావంటారు శ్రీశ్రీ.. చరిత్రకీ చారిత్రిక నవలకీ తేడా ఉందంటారు కవిసామ్రాట్ నోరి నరసింహశాస్త్రిగారు.

తెలుగు నవలకి ఆద్యం లార్డ్ మేయో బెంగాలీలని వారి సంస్కృతీ సంప్రదాయాలు తెలిపే నవలలు రాయమని కోరడం అని ఆరుద్ర రాశారు (సమగ్రాంధ్రసాహిత్యం సం. 4, తెలుగు ఎకాడమీ ప్రచురణ). ఒక జాతి సంస్కతీ సాంప్రదాయాలనీ, ఆచారవ్యవహారాలని నవలలు చెప్పినంత వివరంగా చరిత్ర చెప్పదు అని మేయో అభిప్రాయం అనుకుంటాను. Continue reading “చరిత్ర, చారిత్రక నవల”

మార్పు 12

లీలకి నవ్వు రాలేదు. ఏడవాలనుంది కానీ అదీ రాడం లేదు. నగరివాకిట నుండు నల్లగుండులాటిదేదో గుండెల్ని పట్టి  దిగలాగుతున్నట్టుంది. కారుమేఘాలు తరుముకొస్తున్నట్టుంది. Continue reading “మార్పు 12”

మార్పు 11

“నవ్వెప్పుడొస్తుందో చెప్పడం కష్టం,” అన్నాన్నేను.

“నవ్వెప్పుడు రాదో చెప్పడం కూడా కష్టమే,” అంది అరు.

“నువ్వినలేదేమిటి ఇటీవలి లీలాసుందరులవృత్తాంతం” అంది సిరి.

“లేదు. ఏమాకథ? వినుటకుత్సాహంబయ్యెడిని, చెప్పు చెప్పు చెప్పు చెప్పూ” అన్నాను హుషారుగానూ మరియు పూర్వపు బాణీ నెమరేసుకుంటూను. Continue reading “మార్పు 11”

మార్పు 10

ఆదివారం మధ్యాహ్నం. టైము నాలుగయింది. దారిన పోతూ పార్క్ దగ్గర ఆగేను. పిల్లలు సాకరాడుతున్నారు. పిల్లల తల్లులూ, తండ్రులూ, స్నేహితులూ ఆట చూస్తూ, పిల్లలకి హుషారిస్తూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. ముచ్చటేసే దృశ్యం. Continue reading “మార్పు 10”