తెలుగుకథ తీరుతెన్నులు

తెలుగుకథ తీరుతెన్నులు

కథ తీరుతెన్నులు ఈ నాటి అంశం. అసలు కథంటే ఏమిటి? ఏది కథ, ఏది కథ కాదు? చూద్దాం.

ఈరోజుల్లో విమర్శకులూ, సంపాదకులూ, ఒకొకప్పుడు పాఠకులూ కూడా కథంటే ఇలా ఉండాలి, ఈ లక్షణాలు ఉంటేనే కథ అవుతుంది అని నిర్ధారణ చేస్తున్నారు.

ఆ లక్షణాలు –  క్లుప్తత, వస్త్వైక్యత, సమయైక్యత, నిబద్ధత, సాంద్రత. రెండోస్థాయిలో పరిశీలించేవి నిర్వహణ లేక నడక, ఆవరణ, పాత్రపోషణ, ముగింపు. వీటికి తగినట్టుగా సన్నివేశాలు. సంఘర్షణా ఉన్నాయా లేవా అన్నది పరిశీలిస్తారు విమర్శకులు. మరోలా చెప్పాలంటే కథకి ప్రధానాంగాలు – ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు. ఉపాంగాలు ఆవరణ, పాత్రచిత్రణ, భాష. ఈ భాష అన్నది మళ్ళీ చాలా విస్తృతమయిన విషయం. Continue reading “తెలుగుకథ తీరుతెన్నులు”

తెలుగుకథ తీరుతెన్నులు – రెండోభాగం

(తొలిభాగం ఇక్కడ)

వీరేశలింగంగారి చివరిదశలో అంటే 1875లో పుట్టిన భండారు అచ్చమాంబగారు ఆయనరచనలతోనే ప్రభావితురాలయినా ఆయన ఉపదేశాలను యథాతథంగా స్వీకరించలేదు. ఆవిడ సృష్టించిన స్త్రీపాత్రలు బలమైన వ్యక్తిత్వాలు గలవి. కేవలం భర్తలసేవలకి అంకితమయినవారు కారు. పిల్లలని బుధ్ధిమంతులుగానూ, విద్యావంతులుగానూ తీర్చిదిద్దడమే కాక తప్పిదం చేసిన భర్తలతో మంచిచెడ్డలు వితర్కించి, వారిని సన్మార్గంవేపు, ధర్మవర్తన వైపు నడిపించినవారు. బహుశా ఇది ఈనాటి స్త్రీవాదనకి నాంది కావచ్చు. ఈ కథలగురించి మరింత విపులంగా తరవాత చర్చిస్తాను. Continue reading “తెలుగుకథ తీరుతెన్నులు – రెండోభాగం”

మార్పు 9

శ్రీదేవి మాటలే నామనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. ఒక మనిషి మరొక మనిషిని ఎందుకు బాధిస్తాడు, నేను ఆమనిషిని బాధ పెడుతున్నాను, ఎదటివాడి నొప్పి నాకానందం” అన్న స్పృహతో చేస్తాడా? లేక యాదృచ్ఛికంగా జరుగుతుందా బాధించడం అన్నది? Continue reading “మార్పు 9”

భండారు అచ్చమాంబగారి కథల్లో ఏముంది?

అచ్చమాంబ గారి కథలు Achamamba-final9

అచ్చమాంబగారి కథలు సుమారు పదేళ్ళుగా చర్చల్లో కనిపిస్తున్నాయి. అబలా సచ్చరిత్రరత్నమాల పేరు నాకు పరిచితమే అయినా కొండవీటి సత్యవతిగారి వ్యాసం నాలుగేళ్ళక్రితం చూసేకే, అచ్చమాంబగారి కథలగురించి తెలిసింది. అప్పటినుండీ నాకు ఆసక్తి కలిగింది. ఈకథలు ఈనాటి పాఠకులు ఆదరిస్తారా లేదా, ఆదరిస్తే, ఏ కారణాలవల్ల అని. అందుకే ఇక్కడ పెట్టి మీ అభిప్రాయాలు కోరేను. లలితగారి స్పందన మీరు చూసే ఉంటారు.  చూడకపోతే Continue reading “భండారు అచ్చమాంబగారి కథల్లో ఏముంది?”